Update Aadhaar Card : ఆన్‌లైన్‌లో మీ ఆధార్ కార్డ్ ఫొటోను ఎలా అప్‌డేట్ చేయాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్!

Update Aadhaar Card : ఆధార్ కార్డ్ అనేది పర్సనల్, బయోమెట్రిక్ డేటాను కలిగిన భారత్‌లోని నివాసితులకు ప్రత్యేకమైన గుర్తింపు కార్డుగా పనిచేస్తుంది. ముఖ్యంగా 15 ఏళ్లు పైబడిన వారికి, ఏటా కార్డ్‌ని అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

Update Aadhaar Card : ఆధార్ స్కీమ్ భారత్‌లో సెప్టెంబరు 29, 2010న ప్రారంభమైంది. అంటే.. 13 ఏళ్లుగా ప్రజలు తమ గుర్తింపు రుజువుగా ఆధార్‌ను ఉపయోగిస్తున్నారు. ఆధార్ కార్డ్ బయోమెట్రిక్ డేటా, ఫొటోగ్రాఫ్‌లు, అడ్రస్, ఇమెయిల్ ఐడి, ఫోన్ నంబర్ వంటి మరిన్ని వివరాలను కలిగి ఉంటుంది. ఒక వ్యక్తి సమాచారాన్ని గుర్తించేందుకు UIDAIని అనుమతిస్తుంది.

ప్రభుత్వ పథకాలు లేదా కాలేజీ దరఖాస్తుల రిజిస్ట్రీతో సహా వివిధ సర్వీసులను యాక్సెస్ చేయడానికి ఈ వివరాలను ఉపయోగించవచ్చు. అయితే, డేటా కచ్చితత్వాన్ని నిర్ధారించడానికి, ఆధార్ వివరాలను ఏటా అప్‌డేట్ చేసుకోవడం ముఖ్యం. ప్రత్యేకించి, మీ ఆధార్ ఫొటోను ఏళ్ల తరబడి మార్చకుంటే.. బహుశా దరఖాస్తు చేసినప్పటి నుంచి ఒక్కసారి కూడా మార్చకపోతే దాన్ని అప్‌డేట్ చేయడానికి ఇదే సరైన సమయం కావచ్చు.

UIDAI ప్రకారం.. 15 ఏళ్లు దాటిన వ్యక్తులు తమ ఫొటోతో సహా తమ ఆధార్ వివరాలను అప్‌డేట్ చేయడం తప్పనిసరిగా ఉంటుంది. మీ ఆధార్ కార్డ్ ఫొటోను అప్‌డేట్ చేయాలనుకునే వ్యక్తులలో మీరు ఒకరు అయితే.. ఇప్పుడే మీ ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకోండి.

Read Also : WhatsApp email Address : వాట్సాప్‌లో ఈ-మెయిల్ అడ్రస్ వెరిఫికేషన్ ఆప్షన్.. ఆ యూజర్లకు మాత్రమే..!

ఆధార్ ఫొటోలో మార్పు కోసం దరఖాస్తు చేయడానికి ముందు యూఐడీఏఐ ఆధార్ హోల్డర్‌లు పేరు, చిరునామా, పుట్టిన తేదీ, లింగం, మొబైల్ నంబర్, ఇమెయిల్ వంటి వారి జనాభా వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసేందుకు అనుమతిస్తుంది. అయితే, ఫింగర్‌ఫ్రింట్స్, ఐరిస్ ఫోటో వంటి బయోమెట్రిక్ వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయడానికి, బయోమెట్రిక్ వెరిఫికేషన్ కోసం సమీపంలోని ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ కేంద్రాన్ని సందర్శించాలి. కనీస సర్వీసు ఛార్జీని చెల్లించాలి.

How to update Aadhaar card photo online 

* అధికారిక UIDAI వెబ్‌సైట్‌ (uidai.gov.in)ను విజిట్ చేయండి.
* వెబ్‌సైట్ నుంచి ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేయండి.
* రిజిస్టర్ ఫారమ్‌లో అవసరమైన వివరాలను నింపండి.
* సమీపంలోని ఆధార్ సర్వీసు సెంటర్ లేదా ఆధార్ నమోదు కేంద్రాన్ని సందర్శించండి.
* సమీప ఆధార్ కేంద్రాన్ని గుర్తించడానికి ఈ లింక్‌ (points.uidai.gov.in/)ని విజిట్ చేయండి.
* కేంద్రంలో ఉన్న ఆధార్ ఎగ్జిక్యూటివ్ బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా అన్ని వివరాలను నిర్ధారిస్తారు.
* ఎగ్జిక్యూటివ్ ఆ తర్వాత ఆధార్ కార్డ్‌లో అప్‌డేట్ చేయాల్సిన కొత్త ఫొటోను క్లిక్ చేస్తారు.
* ఈ సర్వీసు కోసం రూ. 100 రుసుము GSTతో వసూలు అవుతుంది.
* మీకు రసీదు స్లిప్ అందిస్తారు.
* యూఐడీఏఐ వెబ్‌సైట్‌లో అప్‌డేట్‌ల స్టేటస్ ట్రాకింగ్ కోసం అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ (URN) ఎంటర్ చేయాలి.

ముఖ్యంగా, ఆధార్ కార్డ్‌లోని సమాచారాన్ని అప్‌డేట్ చేయడానికి గరిష్టంగా 90 రోజులు పట్టవచ్చు. మీరు స్టేటస్ చెక్ చేయడానికి యూఆర్ఎన్ నంబర్‌ను ఉపయోగించవచ్చు. ఆన్‌లైన్‌లో మీ ఆధార్ కార్డ్‌ని అప్‌డేట్ చేసిన తర్వాత మీ సమీపంలోని ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌లో కాపీని ప్రింట్ తీసుకోవచ్చు లేదా యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ నుంచి ఇ-ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Read Also : Download Aadhaar Card : మీ మొబైల్‌లో ఆధార్ కార్డు ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

ట్రెండింగ్ వార్తలు