Hp Has Launched The Chromebook 11a In India
Chromebook : COVID-19 మహమ్మారి పుణ్యమాని ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్ క్లాసులు జరుగుతున్నాయి. ఈ కారణంగా, మార్కెట్లో ఎంట్రీ లెవల్ నోట్‌బుక్‌లు.. క్రోమ్‌బుక్‌ల కోసం భారీగా డిమాండ్ పెరిగింది.ఈ క్రమంలో భారత్ కు Chromebook ను తీసుకురావాలని ప్రముఖ ల్యాప్ టాప్ తయారీ సంస్థ HP నిర్ణయించింది..
ఇందులో భాగంగా Chromebook 11a ను అందుబాటులోకి తెచ్చింది. కొత్త Chromebook విద్యార్థులకు కనెక్ట్ అయ్యేందుకు.. ఆన్‌లైన్ అభ్యాస ప్రయోజనాన్నిపొందడానికి ప్రత్యేకంగా రూపొందించారు. HP Chromebook 11a మీడియాటెక్ MT8183 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.. ఇది 11.6-అంగుళాల HD టచ్ డిస్‌ప్లేను కలిగి ఉంది.
ఇందులో ఫుల్ సైజు కీబోర్డ్ తోపాటు మల్టీ-టచ్ టచ్‌ప్యాడ్ ఉంది.100 జీబీ క్లౌడ్ స్టోరేజ్ తోపాటు 64 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్ కూడా లభిస్తుంది. ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ని 256GB వరకు విస్తరించుకోవచ్చు. ఇక usb పోర్టుల విషయానికొస్తే.. ఆడియో జాక్ ,మైక్రో SD కార్డ్ స్లాట్ తోపాటు యుఎస్‌బి టైప్-ఎతో , యుఎస్‌బి టైప్ సి పోర్ట్ కూడా ఉన్నాయి.
ఇంకో ప్రత్యేకమైన విషయమేమిటంటే ఇందులో గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఉంది. 16 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను కూడా అందిస్తుంది. ఇక ఈ హెచ్‌పి Chromebook 11a ధర 21,999 వేల రూపాయలుగా నిర్ణయించింది HP సంస్థ. ఫ్లిప్‌కార్ట్ లో ప్రత్యేకంగా కొనుగోలు చేయవచ్చు.