Huawei Nova 15 Max : 50MP కెమెరా, 8500mAh బ్యాటరీతో కొత్త హువావే నోవా 15 మ్యాక్స్.. ఫీచర్లు చూస్తే ఫిదానే, ధర జస్ట్..!

Huawei Nova 15 Max : హువావే నోవా 15 మ్యాక్స్ ఫోన్ లాంచ్ అయింది. అద్భుతమైన ఫీచర్లతో సూపర్ ఛార్జ్ టర్బో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు అందిస్తుంది. కీలక ఫీచర్లపై ఓసారి లుక్కేయండి.

Huawei Nova 15 Max

  • హువావే నోవా 15 మ్యాక్స్‌లో 6.84-అంగుళాల FHD+ ఓఎల్ఈడీ డిస్‌ప్లే
  • 50MP ప్రైమరీ కెమెరా, 8500mAh బ్యాటరీ అమర్చారు
  • సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఆప్షన్

Huawei Nova 15 Max : హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. హువావే నోవా 15 మ్యాక్స్‌ను గ్లోబల్ మార్కెట్లో లాంచ్ చేసింది. నోవా 15 మ్యాక్స్‌లో 50MP మెయిన్ రియర్ కెమెరా, 8MP ఫ్రంట్ సైడ్ కెమెరా ఉన్నాయి.

ఈ ఫోన్‌లో 8500mAh బ్యాటరీని అమర్చారు. 40W హువావే సూపర్‌ఛార్జ్ టర్బో ఫాస్ట్ ఛార్జింగ్‌కు (Huawei Nova 15 Max) సపోర్టు ఇస్తుంది. హువావే నోవా 15 మ్యాక్స్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లకు సంబంధించి ధర పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.

హువావే నోవా 15 మాక్స్ ధర ఎంతంటే? :
యూరప్‌లో హువావే నోవా 15 మ్యాక్స్ ధర 449 యూరోలు (సుమారుగా రూ. 49,825)గా ఉండనుంది. నోవా 15 మ్యాక్స్ బ్లష్ గోల్డ్, లేక్ సియాన్ గోల్డెన్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఈ ఫోన్ కోసం ప్రీ-రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. అతి త్వరలో అమ్మకానికి అందుబాటులోకి రానుంది.

నోవా 15 మాక్స్ స్పెసిఫికేషన్లు :
హువావే నోవా 15 మ్యాక్స్ ఫోన్ 6.84-అంగుళాల FHD+ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. రిజల్యూషన్ 2756×1272 పిక్సెల్స్, 120Hz రిఫ్రెష్ రేట్ 4000 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. ఈ ఫోన్‌లో 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి.

Read Also : Amazon Summer Sale 2026 : వారెవ్వా.. కిర్రాక్ ఆఫర్.. వన్‌ప్లస్‌ 13పై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

సేఫ్టీ పరంగా పరిశీలిస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. 8500mAh బ్యాటరీని అందిస్తుంది. 40W హువావే సూపర్‌ఛార్జ్ టర్బో ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. 90°+ అల్ట్రా-వైడ్ సౌండ్ ఫీల్డ్‌తో సిమెట్రికల్ స్టీరియో స్పీకర్‌ ఆప్షన్ కూడా ఉంది.

కెమెరా సెటప్ విషయానికి వస్తే..
హువావే నోవా 15 మ్యాక్స్‌లో బ్యాక్ సైడ్ ఎఫ్/1.9 అపర్చర్‌తో 50MP ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.4 అపర్చర్‌తో సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు వీడియో కాలింగ్ కోసం ఎఫ్/2.0 అపర్చర్‌తో 8MP ఫ్రంట్ కెమెరా ఉంది.

కొలతల పరంగా చూస్తే.. ఈ ఫోన్ 163.3 మిమీ పొడవు, 78 మిమీ వెడల్పు, 7.98 మిమీ మందం, 232 గ్రాముల బరువు ఉంటుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 4జీ VoLTE, Wi-Fi 7, బ్లూటూత్ 5.2, GPS, AGPS, GLONASS, BeiDou, Galileo, QZSS, NFC, సింగిల్ USB టైప్-సీ 2.0 పోర్ట్ ఉన్నాయి.