Maruti Suzuki : మారుతి సుజుకీ కార్ల మోడళ్లపై భారీ డిస్కౌంట్‌

Maruti Suzuki

Maruti Suzuki : కరోనా కారణంగా ఆటో మొబైల్ రంగం తీవ్రంగా నష్టపోయింది. కొన్ని కంపెనీల వాహనాల అమ్మకాలు దారుణంగా పడిపోవడంతో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఇక ఇప్పుడిప్పుడే పరిస్థితి మెరుగవుతుండటంతో అమ్మకాలను పెంచేందుకు పలు కంపెనీలు ధరలు తగ్గిస్తున్నాయి. ఈ క్రమంలోనే మారుతి సుజుకీ తమ కంపెనీలోని కొన్ని కార్ల మోడళ్లపై భారీ ఆఫర్లు ప్రకటించింది. క్యాష్‌ డిస్కౌంట్‌, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ల కింద ఆఫర్లను అందించనుంది. ఆల్టో, స్విఫ్ట్, ఈకో అనేక రకాల కార్లపై డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్‌ జూలై 31 వరకు కస్టమర్లకు అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది.

మారుతి ఆల్టో

Maruti Alto

ఈ కారుపై సుమారు రూ. 15000 వరకు ఎక్సేఛేంజ్‌ బోనస్‌, మరో రూ. 3000 కార్పొరేట్‌ బోసన్‌ను అందించనుంది. ఇక మారుతి ఆల్టో పెట్రోల్‌ ఇంజన్‌ మోడల్‌కు సుమారు రూ. 25 వేల వరకు క్యాష్‌ డిస్కౌంట్‌ను అందించనుంది.

మారుతి సెలేరియో, సెలేరియో ఎక్స్‌

Maruti Celerio

 

మారుతి సెలేరియో, సెలేరియో ఎక్స్‌ మోడళ్లపై రూ. 15,000 వరకు ఎక్సేఛేంజ్‌ బోనస్‌, మరో రూ. 3,000 కార్పొరేట్‌ బోసన్‌ను ప్రకటించింది.

మారుతి డిజైర్‌

 

ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువగా అమ్ముడవుతున్న మోడళ్లలో ఈ కారు ఒకటి మారతి డిజైర్‌ మోడల్‌ కొనుగోలుపై రూ. 20,000 వరకు ఎక్సేఛేంజ్‌ బోనస్‌, రూ. 10,000 క్యాష్‌ డిస్కౌంట్‌ను ప్రకటించింది.

మారుతి ఈకో

ట్యాక్సీలకు అధికంగా ఉపయోగించే మారుతి ఈకో మోడల్పై రూ. 15,000 వరకు ఎక్సేఛేంజ్‌ బోనస్‌, మరో రూ. 3,000 కార్పొరేట్‌ బోసన్‌, రూ. 10,000 క్యాష్‌ డిస్కౌంట్‌ను అందించనుంది. ఈ మోడల్ పై అటు ఇటుగా రూ. 30 వేలు సేవ్ చేసుకోవచ్చు.

మారుతి ఎస్-ప్రెస్సో

Maruti S Presso

ఇది ఫోర్ సీటెడ్ స్మాల్ ఫ్యామిలీ కారు. ఈ మోడల్ లో పెట్రోల్ ఇంజన్ రూ .25 వేల నగదు తగ్గింపు, సిఎన్‌జి మోడల్‌కు రూ .10,000 నగదు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. వాటితో పాటుగా రూ .15 వేల ఎక్స్ఛేంజ్ బోనస్, మరో రూ .3,000 కార్పొరేట్ డిస్కౌంట్ అందించనుంది. ఈ కారు చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది.

మారుతి స్విఫ్ట్

Swift

దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే కార్లలో మారుతి స్విఫ్ట్ మొదటి స్థానంలో ఉంటుంది. రిచ్ తోపాటు కంఫోర్ట్ గా ఉండే ఈ కారును చాలా మంది ఇష్టపడతారు. ఇక ఈ కారుపై సుమారు రూ .20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ , మరో రూ .4,000 కార్పొరేట్ డిస్కౌంట్‌ అందుబాటులో ఉంది. స్విఫ్ట్‌ ఎల్‌ఎక్స్‌ఐ మోడల్‌కు 10,000 రూపాయల నగదు తగ్గింపు, జెడ్‌ఎక్స్ఐ, జెడ్‌ఎక్స్ఐ + వేరియంట్లకు రూ. 15,000 తగ్గింపు, స్విఫ్ట్ విఎక్స్ఐ మోడల్‌కు సుమారు . 30,000 నగదు తగ్గింపును ప్రకటించింది.

మారుతి విటారా బ్రెజ్జా

ఈ కారు హుండై ఐ20 మోడల్ ను పోలి ఉంటుంది. ఈ కారుపై సుమారు రూ. 20,000 వరకు ఎక్సేఛేంజ్‌ బోనస్‌, మరో రూ. 4,000 కార్పొరేట్‌ బోసన్‌, రూ. 15,000 క్యాష్‌ డిస్కౌంట్‌ను అందించనుంది.

మారుతి వాగన్-ఆర్

చిన్నపాటి ఫ్యామిలీకి మంచిగా సెట్ అయ్యే కారు ఇది. ఈ మోడల్ పై రూ .15000 వరకు నగదు తగ్గింపు, సిఎన్‌జి ఇంజన్ మోడళ్లకు రూ .5 వేల నగదు తగ్గింపుతో లభిస్తుంది. అంతేకాకుండా, కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 15,000, ఎక్స్ఛేంజ్ బోనస్ మరో రూ.3,000 ను అందిస్తోంది.

అయితే ప్రస్తుతం మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్న ఏర్టిగా మోడల్‌కు సంబంధించి ఏలాంటి రాయితీ ప్రకటించలేదు.