×
Ad

Sanchar Saathi : ‘సంచార్ సాథీ’ తప్పనిసరికాదు.. మీ స్మార్ట్‌ఫోన్ నుంచి డిలీట్ చేయొచ్చు.. జస్ట్ ఆప్షనల్ మాత్రమే..!

Sanchar Saathi : 'సంచార్ సౌథీ' తప్పనిసరి కాదని వద్దనుకుంటే ఫోన్లో నుంచి డిలీట్ చేసుకోవచ్చు. ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే. మీ ఫోన్‌లో వద్దా లేదా అనేది వినియోగదారుడి ఇష్టం’ అని పేర్కొంది.

Sanchar Saathi

Sanchar Saathi : స్మార్ట్‌ఫోన్ యూజర్లకు బిగ్ అలర్ట్.. అన్ని కొత్త మొబైల్ ఫోన్లలో ‘సంచార్ సౌథీ’ యాప్ తప్పనిసరి కాదు. మొబైల్ యూజర్లు యాప్ వద్దనకుంటే ఫోన్ నుంచి డిలీట్ చేసుకోవచ్చు. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సంచార్ సౌథీ యాప్ ప్రీ-ఇన్‌స్టాల్ చేయాలనే కేంద్రం నిర్ణయం తీవ్ర వివాదానికి దారితీసింది. ప్రతిపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది.

ఈ సందర్భంగా కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా (Sanchar Saathi) పార్లమెంటు వెలుపల మీడియాతో అన్నారు. ‘సంచార్ సౌథీ’ తప్పనిసరి కాదని వద్దనుకుంటే ఫోన్లో నుంచి డిలీట్ చేసుకోవచ్చు. ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే. ఈ యాప్‌ అందరికీ అందుబాటులో ఉంచడం మా విధి. మీ ఫోన్‌లో వద్దా లేదా అనేది వినియోగదారుడి ఇష్టం’ అని ఆయన స్పష్టం చేశారు.

గతంలో కేంద్ర ప్రభుత్వం ఈ యాప్ విషయంలో తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పు కలిగించే ఫేక్ IMEI నంబర్‌లను అరికట్టడానికి యాప్ అవసరమని పేర్కొంది. అయితే, ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. పౌరుల ప్రైవసీకి ప్రభుత్వం భంగం వాటిల్లేలా ప్రభుత్వ నిర్ణయం ఉందని ఆరోపించింది. ఈ యాప్ ద్వారా కేంద్రం ప్రజలపై నిఘా పెట్టాలని చూస్తుందని ఆరోపించింది.

మొబైల్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు :

మొబైల్ హ్యాండ్‌సెట్ తయారీదారులు, దిగుమతిదారులు 90 రోజుల్లోపు అన్ని కొత్త ఫోన్లలో ‘సంచార్ సాథీ’ అనే సైబర్ అలర్ట్ యాప్‌ను ప్రీ ఇన్‌స్టాల్ చేయాలని టెలికమ్యూనికేషన్ విభాగం ఆదేశించింది. నవంబర్ 28 నాటి ఆదేశాల ప్రకారం.. ఆర్డర్ జారీ చేసిన తేదీ నుంచి 90 రోజుల తర్వాత దేశంలో తయారైనా లేదా దిగుమతి చేసుకున్న అన్ని మొబైల్ ఫోన్‌లలో ఈ యాప్‌ తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది.

జాతీయ భద్రత కోసమే.. :
దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న సెకండ్ హ్యాండ్ ఫోన్ మార్కెట్లలో దొంగిలించిన లేదా బ్లాక్‌లిస్ట్ చేసిన ఫోన్లను సులభంగా తిరిగి అమ్మడం వల్ల ఉగ్రవాద సంబంధిత లేదా సైబర్ నేరాల దర్యాప్తులో ఫోన్‌లను గుర్తించేందుకు నమ్మకమైన సిస్టమ్ అవసరమని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. ట్యాంపర్ అయిన లేదా క్లోన్ చేసిన IMEI నంబర్‌లతో కూడిన ఫోన్‌లు ఒకే సమయంలో టెలికాం నెట్‌వర్క్‌లోని అనేక లొకేషన్లలో కనిపించవచ్చు. తద్వారా అనుమానితులను గుర్తించడం చాలా కష్టమవుతుంది.

Read Also : Oppo Find X8 Pro : ఆఫర్ అదిరింది భయ్యా.. కొత్త ఒప్పో Find X8 ప్రోపై కళ్లుచెదిరే డిస్కౌంట్.. ఇంత తక్కువకే వస్తుంటే కొనాల్సిందే..!

ఫేక్ IMEI నంబర్లు నేరస్థులు ట్రాకింగ్ నుంచి తప్పించుకునేందుకు వీలు కల్పిస్తాయని, దొంగిలించిన ఫోన్లను కొనుగోలు చేసేవారు నేరారోపణ కేసుల్లో చిక్కుకుంటారని అధికారులు చెబుతున్నారు. సంచార్ సాథీ యాప్ IMEI నంబర్‌లను వెరిఫై చేయడమే కాకుండా దొంగిలించిన ఫోన్‌లను బ్లాక్ చేసేందుకు వినియోగించవచ్చు. సైబర్ దుర్వినియోగాన్ని నిరోధించవచ్చునని ప్రభుత్వం వాదిస్తుంది. ఈ యాప్ “జాతీయ భద్రత కోసమే తప్పా గూఢచర్యం కోసం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

గూఢచర్యమంటూ ప్రతిపక్షాల ఆరోపణలు :

ప్రతిపక్ష పార్టీలు ఫోన్ల పట్ల ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించాయి. రాజ్యాంగ విరుద్ధమని ప్రభుత్వ నిఘాను ప్రోత్సహించే ప్రయత్నమని అభివర్ణించాయి. ప్రభుత్వం వ్యక్తిగత ఫోన్‌లను రహస్యంగా హ్యాక్ చేసేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. ఇలాంటి ప్రయత్నాలను ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. ఐటీ మంత్రిత్వ శాఖ ఒక నిఘా వ్యవస్థను సృష్టిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ‘గూఢచారి యాప్’ అని, ప్రభుత్వం దేశాన్ని నియంతృత్వంగా మార్చడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

“సంచార్ సాథి ఒక గూఢచారి యాప్ స్పష్టంగా చెప్పాలంటే ఇది హాస్యాస్పదం. పౌరులకు ప్రైవసీ హక్కు ఉంది. ప్రభుత్వ పరిశీలన లేకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులకు సందేశాలు పంపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉండాలి” అని ప్రియాంక గాంధీ పార్లమెంటు కాంప్లెక్స్‌లో మీడియాతో అన్నారు. ఇది కేవలం వినియోగదారుల ఫోన్‌లో దొంగచాటుగా మాట్లాడటం కాదు. ప్రభుత్వం ఈ దేశాన్ని అన్ని విధాలుగా నియంతృత్వంగా మార్చాలని చూస్తోంది. ప్రతిపక్షాన్ని నిందించడం సులభమే కానీ ఏమీ చర్చించేందుకు అనుమతించడం లేదు. అది ప్రజాస్వామ్యం కాదని పేర్కొన్నారు.

5 మిలియన్లకుపైగా యాప్ డౌన్‌లోడ్ :
గత జనవరిలో సంచార్ సాథీ యాప్‌ లాంచ్ కాగా 5 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ డేటా ప్రకారం.. దొంగిలించడం లేదా పోగొట్టుకున్న 3.7 మిలియన్లకు పైగా ఫోన్‌లను బ్లాక్ చేసేందుకు ఈ సౌథీ యాప్ వినియోగించారు. గత అక్టోబర్‌లో ఈ సౌథీ యాప్ 50వేల స్మార్ట్‌ఫోన్‌లను గుర్తించింది. 30 మిలియన్లకు పైగా మోసపూరిత మొబైల్ కనెక్షన్‌లను నిలిపివేసింది. సైబర్ మోసాల బారినపడకుండా ఈ యాప్‌ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫేక్ నంబర్‌లు, IMEI నంబర్‌లను రిపోర్టు చేయొచ్చు. అనుమానాస్పద నంబర్‌లను చెక్ చేయొచ్చు.