Amazon Prime Video : మీ అమెజాన్ ప్రైమ్ వీడియో అకౌంట్ మీ ఫ్యామిలీతో షేర్ చేస్తున్నారా? కొత్త 2 రూల్స్ ఇవే..!

Amazon Prime Video : సబ్‌స్ర్కైబర్లకు పంపిన ఇమెయిల్‌లో కంపెనీ తన వినియోగ నిబంధనలను జనవరి 2025 నుంచి అప్‌డేట్ చేయబోతున్నట్లు తెలిపింది.

Amazon Prime Video account with your family

Amazon Prime Video : అమెజాన్ ప్రైమ్ వీడియోలో పెద్ద మార్పు రాబోతుంది. ప్రైమ్ వీడియో యాక్సెస్ నిబంధనలను అప్‌డేట్ చేయాలని కంపెనీ నిర్ణయించింది. జనవరి 2025 నుండి దాని వినియోగ నిబంధనలను అప్‌డేట్ చేయబోతున్నట్లు కంపెనీ ఇమెయిల్‌లో తెలిపింది.

ప్రముఖ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియోలో పెద్ద మార్పు రాబోతుంది. ప్రైమ్ వీడియో యూజర్ల కోసం ప్రైమ్ వీడియో యాక్సెస్ నిబంధనలను అప్‌డేట్ చేయాలని కంపెనీ నిర్ణయించింది. సబ్‌స్ర్కైబర్లకు పంపిన ఇమెయిల్‌లో కంపెనీ తన వినియోగ నిబంధనలను జనవరి 2025 నుంచి అప్‌డేట్ చేయబోతున్నట్లు తెలిపింది.

ఇప్పటివరకు, ప్రైమ్ యూజర్లు ఎలాంటి డివైజ్ కంట్రోల్ లేకుండా గరిష్టంగా 5 డివైజ్‌లలో ప్రైమ్ వీడియో కంటెంట్‌ను వీక్షించారు. జనవరి 2025 నుంచి అప్‌డేట్ చేసిన తర్వాత కూడా వినియోగదారులు 5 డివైజ్‌లలో ప్రైమ్ వీడియోను చూడగలరు. అయితే, ఇందులో 2 కన్నా ఎక్కువ టీవీలలో వీక్షించడం కుదరదు.

వినియోగదారులు ప్రైమ్ వీడియో సెట్టింగ్స్ పేజీ నుంచి డివైజ్‌లను ఎంచుకోవచ్చు. సెట్టింగ్‌ల పేజీకి వెళ్లడం ద్వారా డివైజ్‌లను నిర్వహించవచ్చని ఇమెయిల్‌లో అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రైబర్‌లకు తెలిపింది. ఇది కాకుండా, మరిన్ని డివైజ్‌లలో ప్రైమ్ వీడియోను వీక్షించేందుకు కొత్త డివైజ్‌ల సెట్టింగ్‌ల పేజీ నుంచి రిజిస్టర్ చేసుకోవచ్చని కంపెనీ మెయిల్‌లో తెలిపింది.

అమెజాన్ ప్రైమ్ సెట్టింగ్‌ల పేజీలో మీరు ఇప్పటికే లాగిన్ చేసిన అన్ని డివైజ్‌ల గురించి సంవత్సరంతో పాటు సమాచారాన్ని పొందుతారు. మీరు ఇకపై ప్రైమ్ వీడియో కంటెంట్‌ని చూడని డివైజ్‌లను కూడా సైన్ అవుట్ చేయవచ్చు.

అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ :
అమెజాన్ ప్రైమ్ యూజర్లకు వివిధ రకాల ప్లాన్‌లను అందిస్తోంది. నెలవారీ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ కోసం మీరు ప్రతి నెలా రూ. 299 చెల్లించాలి అలాగే, 3 నెలల ప్లాన్ తీసుకుంటే.. రూ. 599కి పొందవచ్చు.

కంపెనీ వార్షిక ప్లాన్ ధర రూ.1499 అందిస్తోంది. అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్ కూడా వస్తుంది. దీని ధర రూ.799కు అందిస్తుంది. ఈ సంవత్సరం మీర్జాపూర్, పంచాయత్ కొత్త సీజన్‌లతో పాటు ప్రైమ్ వీడియోలో అనేక బ్లాక్‌బస్టర్ సినిమాలు, షోలు విడుదలయ్యాయి. వినియోగదారులు వీటిని ఎక్కువగా వీక్షించారు.

Read Also : Tata Punch Camo Edition : టాటా పంచ్ క్యామో ఎడిషన్ వచ్చేసింది.. ధర, ఫీచర్లు వివరాలివే..!