Tata Punch Camo Edition : టాటా పంచ్ క్యామో ఎడిషన్ వచ్చేసింది.. ధర, ఫీచర్లు వివరాలివే..!
Tata Punch Camo Edition : ఈ కొత్త టాటా పంచ్ ఎడిషన్ కారు రూ. 8.45 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్) వద్ద లాంచ్ చేసింది.

Tata Punch Camo Edition
Tata Punch Camo Edition : ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ పంచ్ ప్రత్యేక క్యామో ఎడిషన్‌ను లాంచ్ చేసింది. ఈ కొత్త టాటా పంచ్ ఎడిషన్ కారు రూ. 8.45 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్) వద్ద లాంచ్ చేసింది. ఎస్‌యూవీకి కొన్ని ఫీచర్లతో పాటు కొన్ని ఎక్స్‌ట్రనల్ డిజైన్ మార్పులను తీసుకువస్తుంది. పంచ్ కొత్త వేరియంట్ గురించి మరిన్ని ఫీచర్లను ఇప్పుడు తెలుసుకుందాం.
పంచ్ క్యామో ఎడిషన్ ఎక్స్‌ట్రనల్, ఇంట్రనల్ వెలుపలి వైపున, క్యామో ఎడిషన్ కొత్త సీవీడ్ గ్రీన్ కలర్‌తో పాటు వైట్ రూఫ్, ఆర్16 చార్‌కోల్ గ్రే అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంది. క్యాబిన్‌లో క్యామో-బ్యాక్‌గ్రౌండ్ మోడల్ కలిగిన కొత్త అప్హోల్స్టరీ ఉంది.
పంచ్ క్యామో ఎడిషన్ ఫీచర్లు :
ఫీచర్ ఫ్రంట్‌లో క్యామో ఎడిషన్ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జర్, బ్యాక్ ఏసీ వెంట్‌లు, ఫాస్ట్ సి-టైప్ యూఎస్‌బీ ఛార్జర్‌తో సెగ్మెంట్-ఫస్ట్ 10.25-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందుతుంది.
పంచ్ క్యామో ఎడిషన్ పవర్‌ట్రెయిన్ :
క్యామో ఎడిషన్ పంచ్ పెట్రోల్, సీఎన్‌జీ రెండు వెర్షన్లలో అందుబాటులో ఉంది. 1.2-లీటర్, 3-సిలిండర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. పెట్రోల్‌పై రన్ అయ్యే 88బీహెచ్‌పీ, 115ఎన్ఎమ్ టార్క్, సీఎన్‌జీ ఆధారంగా పనిచేస్తుంది.
74bhp, 103Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ ఇంజన్‌ను 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఎఎంటీ గేర్‌బాక్స్‌తో పెయిర్ చేయవచ్చు. అయితే, సీఎన్‌జీ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది.