Apple Watch Series 6 వచ్చేసింది.. ఈ కొత్త వాచ్ విప్పి చూశారా?

  • Publish Date - September 22, 2020 / 03:54 PM IST

ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ గతవారమే వాచ్ సిరీస్ 6 మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఆపిల్ వాచ్ సిరీస్ 6‌ డివైజ్‌ ను ఓసారి విప్పి చూడండి.. అందులో ఫీచర్లు, సెన్సార్లు అట్రాక్టీవ్‌గా ఉన్నాయి.  వేరబుల్ కొత్త సెన్సార్ అయిన ఈ ఆపిల్ వాచ్ సిరీస్ 6 ద్వారా శరీరంలోని బ్లడ్ ఆక్సీజన్ స్థాయిలను లెక్కిస్తుంది.



ఈ కొత్త సెన్సార్ ఆపిల్ వాచ్ సిరీస్‌లో రెండు భారీ బ్యాటరీలను అమర్చారు.. సీరీస్ 6 వేరియంట్‌లో 40mm, 44mm రెండు భారీ బ్యాటరీలు ఉన్నాయి.

సిరీస్ 5 కంటే ఈ వాచ్ బ్యాటరీలు పెద్దవిగా ఉన్నాయని iFixit సంస్థ రివీల్ చేసింది. సిరీస్ 5 వాచ్ కంటే.. 44mm వేరియంట్ బ్యాటరీలో ఫీచర్లు 3.5 శాతం అత్యధిక సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని పేర్కొంది.



ఇక 40mm మోడల్ వాచ్ 8.5 శాతం అతిపెద్ద పవర్ సెల్ తో వచ్చింది.

ఈ సిరీస్ 6 వాచ్ లో మరో అద్భుతమైన ఫీచర్ ఒకటి.. Taptic Engine.. 2019 తర్వాత రీసైకిల్ చేసిన విభాగాల నుంచి ఐఫోన్‌లోని Taptic Engine రూపొందించింది.

ఏడాది తర్వాత ఆపిల్ వాచ్ లోనూ అలానే రీసైకిల్డ్ చేసిన విభాగాలను చేరుస్తోంది. రిమూవబుల్ ఫోర్స్ టచ్ ఫీచర్ హైలెట్‌గా నిలిచింది. గత జూన్ నెలలో ఆపిల్ రిలీజ్ చేసిన WatchOS7 Beta మాదిరి ఫీచర్ గా ఆకట్టుకుంటోంది.



వాచ్ సిరీస్ 6 డివైజ్ సైజు విషయానికి వస్తే.. 5 సిరీస్ వాచ్ కంటే సన్నగా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. సిరీస్ 5 వాచ్ పరిమాణం 10.74mmతో పోలిస్తే దీని పరిమాణం 10.4mm చాలా మందంగా ఉంటుంది.



ప్యూజడ్ డిస్ ప్లే పైభాగంలో ఉంటే.. ప్యూజడ్ సెన్సార్ కిందిభాగంలో ఉంటుంది. అది పైకి చూడాటానికి కనిపించదు.. వాచ్ విడిభాగాలను తీసినప్పుడు మాత్రమే కనిపిస్తుంది.

ట్రెండింగ్ వార్తలు