Infinix Note 50 Pro Plus : కొత్త స్మార్ట్‌ఫోన్ కావాలా? ఇన్ఫినిక్స్ నోట్ 50 ప్రో ప్లస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ఫోన్ ధర వివరాలు లీక్..!

Infinix Note 50 Pro Plus : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ఈ నెల 20న గ్లోబల్ మార్కెట్లోకి ఇన్ఫినిక్స్ నోట్ 50 ప్రో ప్లస్ వచ్చేస్తోంది. ఫోన్ లైవ్ ఇమేజ్‌లతో పాటు ధర వివరాలు కూడా లీక్ అయ్యాయి.

Infinix Note 50 Pro Plus

Infinix Note 50 Pro Plus : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? ఇన్ఫినిక్స్ నోట్ 50 ప్రో ప్లస్ వచ్చేస్తోంది. షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 20న గ్లోబల్ మార్కెట్లో లాంచ్ కానుంది. అంతకంటే ముందే ఈ ఫోన్ ఫీచర్లు, ధర వివరాలు లీక్ అయ్యాయి. లీకైన లైవ్ ఇమేజెస్‌లో హ్యాండ్‌సెట్ ఫుల్ డిజైన్ కనిపిస్తుంది.

Read Also : AC Buying Guide : కొత్త ఏసీ కొంటున్నారా? 1 టన్ ఏసీ బెటరా? 1. 5 టన్ ఏసీ బెటరా? ఇందులో ఏది కొంటే బెటర్? ఫుల్ డిటెయిల్స్ మీకోసం..!

ఈ నెల ప్రారంభంలో ఇండోనేషియాలో ఇన్ఫినిక్స్ నోట్ 50, ఇన్ఫినిక్స్ నోట్ 50 ప్రోతో పాటు లాంచ్ అయింది. కొత్త నివేదిక ప్రకారం.. ఇన్ఫినిక్స్ ఫోన్ “ఆర్మర్అల్లాయ్” బిల్డ్, 100x జూమ్‌తో 50ఎంపీ పెరిస్కోప్ కెమెరా, జేబీఎల్ ద్వారా ఆడియో ట్యూనింగ్, వన్ ట్యాప్ ఇన్ఫినిక్స్ ఏఐ ఫీచర్లను కలిగి ఉంది.

ఈ ఇన్ఫినిక్స్ ఫోన్ మార్చి 20న ఇన్ఫినిక్స్ ఏఐ ఇన్ఫినిటీ బీటా ఈవెంట్‌లో లాంచ్ కానుంది. కంపెనీ రియల్ వైర్‌లెస్ స్టీరియో (TWS) ఇయర్‌బడ్‌లు, స్మార్ట్ రింగ్‌ కూడా ఆవిష్కరించనున్నట్టు సమాచారం.

ఇన్ఫినిక్స్ నోట్ 50 ప్రో ప్లస్ డిజైన్, ఫీచర్లు :
నివేదికల ప్రకారం.. ఇన్ఫినిక్స్ నోట్ 50ప్రో ప్లస్ 5జీ లైవ్ ఇమేజ్‌లు లీకయ్యాయి. ఈ ఫోన్ ఆక్టాగోనల్ బ్యాక్ కెమెరా మాడ్యూల్ కలిగి ఉంది. ఈ ఫోన్ 100x జూమ్ సామర్థ్యంతో 50ఎంపీ పెరిస్కోప్ సెన్సార్‌ను అందిస్తుంది. డిజైన్ పరంగా ఇన్ఫినిక్స్ నోట్ 50 ప్రో ప్లస్ ఫ్లాట్ ఫ్రేమ్‌తో కూడిన ‘ఆర్మర్ అల్లాయ్’ బిల్డ్‌ను కలిగి ఉంటుంది. ఇన్ఫినిక్స్ నోట్ 50 ప్రో 4జీ మాదిరిగానే హైపర్‌కాస్టింగ్ ఆప్సన్ కలిగి ఉంది.

ఇన్ఫినిక్స్ ఫోన్ రైట్ సైడ్ పవర్ బటన్ ఉంటుంది. వాల్యూమ్ రాకర్స్ లెఫ్ట్ సైడ్ ఉంటాయి. ఈ హ్యాండ్‌సెట్ దిగువన సిమ్ ట్రే, ఛార్జింగ్ కోసం USB టైప్-సి పోర్ట్, ఆడియో ట్యూనింగ్‌ ‘సౌండ్‌బై జేబీఎల్’ లోగో ఉన్నాయి. దీనికి ఎదురుగా సెకండరీ మైక్రోఫోన్, ఇన్‌ఫ్రారెడ్ (IR) బ్లాస్టర్, స్పీకర్ గ్రిల్ ఉన్నాయి.

Read Also : Lenovo Idea Tab Pro : కొంటే ఇలాంటి ట్యాబ్ కొనాలి.. కొత్త లెనోవా ఐడియా ట్యాబ్ ప్రో ఇదిగో.. క్వాడ్ జేబీఎల్ స్పీకర్లు అదుర్స్.. ధర ఎంతంటే?

ఇన్ఫినిక్స్ హ్యాండ్‌సెట్ మరో అద్భుతమైన ఫీచర్ అయిన వన్-ట్యాప్ ఇన్ఫినిక్స్ ఏఐ కలిగి ఉంది. ప్రపంచ మార్కెట్లలో ఇన్ఫినిక్స్ నోట్ 50 ప్రో ప్లస్ ధర 500 డాలర్లు (దాదాపు రూ. 43,400) కన్నా తక్కువగా ఉండవచ్చు. ఈ ఫోన్ వేరియంట్ ఈ నెల ప్రారంభంలో ఇండోనేషియాలో లాంచ్ అయింది. అయితే, కంపెనీ లాంచ్ సమయంలో ధర ఎంత అనేది రివీల్ చేయలేదు.