Infinix Zero 30 5G Specifications Tipped by Geekbench
Infinix Zero 30 5G Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఇన్ఫినిక్స్ (Infinix) కంపెనీ నుంచి (Infinix Zero 30 5G) ఫోన్ బ్లూటూత్ SIG సర్టిఫికేషన్‌తో పాటు గీక్‌బెంచ్ బెంచ్‌మార్కింగ్ వెబ్‌సైట్‌లలో గుర్తించింది. ఈ ఫోన్ లాంచ్ త్వరలో ఉండవచ్చునని సూచించింది. ఇన్ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్ మోడల్ నంబర్ X6731తో వెరిఫైడ్ సైట్‌లలో కనిపించింది.
Infinix ఇంకా ఇన్ఫినిక్స్ జీరో 30 5G మోడల్ గురించి ఎలాంటి వివరాలను షేర్ చేయలేదు. కానీ, బడ్జెట్-ఫ్రెండ్లీ 5G ఆఫర్‌గా కనిపిస్తుంది. గరిష్టంగా 8GB RAMతో వచ్చిన ఆక్టా-కోర్ MediaTek డైమెన్సిటీ 1100 SoC ద్వారా అందించనుంది. ఆండ్రాయిడ్ 13లో కూడా ఈ ఫోన్ రన్ అవుతుంది.
బ్లూటూత్ SIG సర్టిఫికేషన్ లిస్టింగ్, గీక్‌బెంచ్ లిస్టింగ్ సూచించిన విధంగా Infinix త్వరలో (Infinix Zero 30) ఫోన్ మోనికర్‌తో కొత్త 5G ఫోన్‌ను లాంచ్ చేయనుంది. మోడల్ నంబర్ X6731తో రెండు వెబ్‌సైట్‌లలో లిస్టు అయింది. ఇన్ఫినిక్స్ జీరో 30 5G (Geekbench)లో TensorFlow Lite CPU ఇన్ఫరెన్స్ స్కోర్‌గా 276 పాయింట్లను స్కోర్ చేసింది.
Infinix Zero 30 5G Specifications Tipped by Geekbench
జాబితా ప్రకారం.. ఆండ్రాయిడ్ 13లో రన్ చేయగలదు. డైమెన్సిటీ 1100 SoCగా భావించే MT6891Z/CZA కోడ్‌నేమ్‌తో కూడిన ఆక్టా-కోర్ మీడియాటెక్ చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ప్రాసెసర్ గరిష్టంగా 2.60GHz క్లాక్ స్పీడ్‌తో 4 హై పర్ఫార్మెన్స్ కోర్‌లను 2.00GHz గరిష్ట క్లాక్ స్పీడ్‌తో 4 కోర్లను కలిగి ఉన్నట్లు నివేదిక తెలిపింది.
7.32 ర్యామ్‌ని కూడా కలిగి ఉన్నట్టు తెలుస్తోంది. 8GBకి మారవచ్చు. ఇన్ఫినిక్స్ జీరో 30 5G బ్లూటూత్ SIG సర్టిఫికేషన్‌లో కూడా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ బ్లూటూత్ 5.3తో వస్తుందని జాబితా సూచిస్తుంది. ఇప్పటి వరకు, ఇన్ఫినిక్స్ జీరో 30 5Gపై ఇన్ఫినిక్స్ ఎలాంటి సమాచారాన్ని షేర్ చేయలేదు. బ్లూటూత్ SIG, గీక్‌బెంచ్ లిస్టులను ఫస్ట్ గిజ్మోచినా గుర్తించింది.