Infinix Zero 30 5G : కొత్త ఫోన్ కావాలా? భారత మార్కెట్లో సెప్టెంబర్ 2న ఇన్ఫినిక్స్ జీరో 30 5G ఫోన్ లాంచ్ అయింది. Infinix Zero 20కి సక్సెసర్‌గా కొత్త ఇన్ఫినిక్స్ 5G ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8020 SoCతో పాటు 12GB వరకు RAMతో రన్ అవుతుంది. ఇన్ఫినిక్స్ జీరో 30 5G ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో హోల్ పంచ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 5,000mAh బ్యాటరీతో సపోర్టు అందిస్తుంది. 108MP ప్రైమరీ సెన్సార్ నేతృత్వంలోని ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇన్ఫినిక్స్ జీరో 30 5G ఫోన్ ఈరోజు నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రీ-ఆర్డర్‌లు అందుబాటులో ఉన్నాయి.
ఇన్ఫినిక్స్ జీరో 30 5G ధర :
ఇన్ఫినిక్స్ జీరో 30 5G ఫోన్ బేస్ (8GB RAM + 128GB స్టోరేజ్) మోడల్ ధర రూ. 23,999కు కొనుగోలు చేయొచ్చు. కొనుగోలుదారులు రూ. 12GB RAM + 256GB స్టోరేజీతో టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 24,999కు అందుబాటులో ఉంది. లేటెస్ట్ 5G హ్యాండ్‌సెట్ గోల్డెన్ అవర్, రోమ్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లలో అందిస్తుంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ప్రీ-ఆర్డర్‌లకు అందుబాటులో ఉంది. డెలివరీలు సెప్టెంబర్ 8 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది. Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి (Infinix Zero 30 5G)ని కొనుగోలు చేసే కస్టమర్‌లు రూ. 2వేలు డిస్కౌంట్ పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్లు రూ. 23,050, నో-కాస్ట్ EMI ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఇన్ఫినిక్స్ జీరో 30 5G స్పెసిఫికేషన్స్ :
డ్యూయల్ సిమ్ (నానో) ఇన్ఫినిక్స్ జీరో 30 5G ఫోన్ Android 13-ఆధారిత XOS 13పై నడుస్తుంది. 6.78-అంగుళాల ఫుల్-HD+ (2,400×1,080 పిక్సెల్‌లు) 60-డిగ్రీ కర్వడ్ AMOLED డిస్‌ప్లే 144Hz రిఫ్రెష్ రేట్, 950 వరకు నిట్లను కలిగి ఉంటుంది. డిస్‌ప్లే సెల్ఫీ షూటర్‌కు అనుగుణంగా హోల్ పంచ్ కటౌట్‌ను కలిగి ఉంది. 360Hz టచ్ శాంప్లింగ్ రేట్, DCI-P3 కలర్ గామట్ 100 శాతం కవరేజీని అందిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌కు 2 వైపులా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అందిస్తుంది. హుడ్ కింద, 12GB వరకు RAMతో పాటు ఆక్టా-కోర్ MediaTek డైమెన్సిటీ 8020 SoC ఉంది. Infinix Memfusion RAM ఫీచర్‌తో అదనపు ఉపయోగించని స్టోరేజీని ఉపయోగించి ఆన్‌బోర్డ్ మెమరీని 21GB వరకు విస్తరించవచ్చు.
Infinix Zero 30 5G With Dimensity 8020 SoC, 108-Megapixel Triple Rear Cameras Launched in India
ఆప్టిక్స్ విషయానికి వస్తే.. ఇన్పినిక్స్ జీరో 30 5G ఫోన్ క్వాడ్ LED ఫ్లాష్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. OISకి సపోర్టుతో 108MP ప్రైమరీ సెన్సార్ నేతృత్వంలోని కెమెరా యూనిట్‌లో 13MP అల్ట్రా-వైడ్ షూటర్, 2MP సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌లు డ్యూయల్ LED ఫ్లాష్‌తో కూడిన 50MP సెల్ఫీ కెమెరా ద్వారా పనిచేస్తుంది. ఫ్రంట్ కెమెరా సెకనుకు 60 ఫ్రేమ్‌ల వద్ద 4K వీడియో రికార్డింగ్‌ను నిర్వహిస్తుందని పేర్కొన్నారు. 256GB UFS 3.1 ఆన్‌బోర్డ్ స్టోరేజీని కలిగి ఉంది. ఇన్ఫినిక్స్ జీరో 30 5Gలో కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, NFC, GPS, USB టైప్-C పోర్ట్, బ్లూటూత్ 5.3, Wi-Fi 6 ఉన్నాయి.
యాంబియంట్ లైట్ సెన్సార్, ఇ-కంపాస్, G-సెన్సర్, గైరోస్కోప్‌తో వస్తుంది. అథెంటికేషన్ కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఇన్ఫినిక్స్ జీరో 30 5G డెస్ట్, వాటర్ రెసిస్టెన్స్ IP53-రేటెడ్ బిల్డ్‌ను కలిగి ఉంది. DTS హై-రెస్ ఆడియో టెక్నాలజీతో కూడిన డ్యూయల్ స్పీకర్లను కలిగి ఉంది. ఇన్పినిక్స్ 68W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో Infinix Zero 30 5G ఫోన్ 75.03×164.51×7.9mm పరిమాణంతో పాటు 5,000mAh బ్యాటరీని అందిస్తుంది. ఈ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కేవలం 30 నిమిషాల్లో బ్యాటరీని 0 నుంచి 80 శాతానికి చేరుతుంది. ఇంకెందుకు ఆలస్యం.. ఇప్పుడే ఈ ఫోన్ కోసం ప్రీ-ఆర్డర్ పెట్టేసుకోండి.