చెక్ చేశారా? : ఇన్ స్టాగ్రామ్‌లో.. మీ Likes కనిపించవు

మీకు ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ఉందా? మీ అకౌంట్ లో పోస్టు చేసిన లేటెస్ట్ ఫొటోలకు ఎన్ని లైకులు వచ్చాయి.. ఎంతమంది లైక్ చేశారు.

  • Publish Date - April 19, 2019 / 08:40 AM IST

మీకు ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ఉందా? మీ అకౌంట్ లో పోస్టు చేసిన లేటెస్ట్ ఫొటోలకు ఎన్ని లైకులు వచ్చాయి.. ఎంతమంది లైక్ చేశారు.

మీకు ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ఉందా? మీ అకౌంట్ లో పోస్టు చేసిన లేటెస్ట్ ఫొటోలకు ఎన్ని లైకులు వచ్చాయి.. ఎంతమంది లైక్ చేశారు. ఎన్ని హార్ట్ లైక్స్ వచ్చాయో చూస్తునే ఉంటారు. యూజర్లు.. తమ పోస్టుకు వేలాది లైక్స్ రావడం చూసి ఎంతో మురిసిపోతుంటారు. ఇక నుంచి ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన పోస్టుకు ఎన్ని Likes వచ్చాయో చూడలేరు. ప్రముఖ సోషల్ మీడియా ఫొటో షేరింగ్ యాప్ ఇన్ స్టాగ్రామ్ Likes count ఫీచర్ ను Hide చేయనుంది. Like feature హైడ్ చేసేందుకు Instagram టెస్టింగ్ చేస్తోంది. ఈ టెస్టింగ్ కు సంబంధించిన ఇన్ స్ట్రాగ్రామ్ స్ర్కీన్ షాట్ లు లీక్ అయ్యాయి.
Also Read : Voiceతోనే టైపింగ్ : వచ్చే ఐదేళ్లలో Keyboards ఉండవు

ఈ టెస్టింగ్ Screenshots లను జానే మంచూన్ వాంగ్ అనే టెకీ బ్లాగర్ తన కొత్త ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశారు. ‘ఇన్ స్ట్రాగ్రామ్ లైక్ ఫీచర్ హైడ్ పై టెస్టింగ్ చేస్తోంది. యూజర్లకు మీ లైక్ కనిపించదు. మీ అకౌంట్ లో ఫాలోవర్లు.. మీ పోస్టు చేసిన దానిపైనే మాత్రమే ఫోకస్ పెట్టాలనకుంటున్నాం. పోస్టుకు ఎన్ని లైకులు వచ్చాయో కాదు. టెస్టింగ్ సమయంలో ఎవరైతే పోస్టు పెడతారో వారు మాత్రమే ఎన్ని లైక్స్ వచ్చాయో చూడగలరు’అని టెకీ జానే పోస్టు పెట్టారు. లీకైన సమాచారం ప్రకారం.. ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లోని పీడ్ పోస్టులో షేర్ చేసిన ఫొటోలకు ఎన్ని లైకులు వచ్చాయో కనిపించవు. 

ఎన్ని లైక్స్ వచ్చాయో తెలుసుకోవడం చాలామంది యూజర్లకు ఆసక్తి ఉంటుంది. కొన్నిసార్లు మొత్తానికే ఈ లైక్స్ యూజర్లను కృంగిపోయేలా చేస్తాయి. ఇవే లైక్స్ ఎక్కుమంది యూజర్లను ఎట్రాక్ట్ చేస్తాయి కూడా. Instagram .. ఇప్పుడు తమ యాప్ ను బ్రాండ్ అవేర్ నెస్, షాపింగ్ కోసం వినియోగిస్తోంది. ఇందులో పోస్టుకు వచ్చిన లైక్స్ ఆధారంగా బిజినెస్ ఆధారపడి ఉంటుంది. Products కు ఎన్ని లైక్స్ వస్తే.. కస్టమర్ కు ఆ ప్రొడక్ట్ పట్ల అంత ఆసక్తి ఉన్నట్టు భావిస్తారు. ఇన్ స్టాగ్రామ్ లైక్స్ ఫీచర్ ను హైడ్ చేయడం పట్ల యూజర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లైక్స్ హైడ్ చేయడం చెత్త ఐడియా అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

మరోవైపు ఇన్ స్టాగ్రామ్.. ఇప్పటికప్పుడే Instagram Likes ఫీచర్ హైడ్ టెస్టింగ్ చేయడం లేదని స్పష్టం చేసింది. ఇన్ స్టాగ్రామ్ పై యూజర్ల ఆసక్తిని.. లైక్స్ నుంచి…  పోస్టుల వైపు మరల్చేందుకు చేయబోయే ప్రయత్నం మాత్రమేనని కంపెనీ ప్రతినిధి ఒకరు ఒక ప్రకటనలో తెలిపారు. 

Also Read : TikTok బ్యాన్ : ఇండియాలో 100 కోట్ల పెట్టుబడికి మరో ప్లాన్