instagram introduces profile cards
Instagram Profile Cards : ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు అదిరే అప్‌డేట్.. మెటా సొంత ఫోటో-వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త అప్‌డేట్‌లను ప్రవేశపెడుతోంది. లేటెస్టుగా ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల కోసం ప్రొఫైల్ కార్డ్ అనే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.
ఈ ప్రొఫైల్ కార్డ్ ద్వారా మీ ప్రొఫైల్‌ను ఎక్కువ మందితో షేర్ చేయొచ్చు. తర్వాత మీరు మీ యూజర్ నేమ్ షేర్ చేయడంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాస్తవానికి, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకే పేరుతో చాలాసార్లు అనేక ప్రొఫైల్‌లు క్రియేట్ అవుతుంటాయి. ఈ కార్డ్ ద్వారా ఫాలోవర్లు మిమ్మల్ని మాత్రమే ఫాలో అయ్యేందుకు వీలుంటుంది. ఈ ప్రొఫైల్ కార్డ్‌లో క్యూర్ కోడ్ కూడా ఉంది. స్కాన్ చేయడం ద్వారా ప్రొఫైల్ నేరుగా ఓపెన్ చేసి ఫాలో చేయొచ్చు.
ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ కార్డ్ ఎలా పనిచేస్తుందంటే? :
మీ ప్రొఫైల్ కార్డుతో అకౌంట్ ప్రొఫైల్ మరింత ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు. ఇది రెండు వైపుల డిజిటల్ కార్డ్ మాదిరిగా ఉంటుంది. మీ బయో, ఇతర పేజీలకు లింక్‌లు, మీకు ఇష్టమైన పాట వంటి వాటిని పెట్టుకోవచ్చు. అంతేకాదు.. మీ కార్డ్‌ని కస్టమైజ్ చేసుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ కూడా మార్చవచ్చు. సెల్ఫీలను అప్‌లోడ్ చేయవచ్చు. కస్టమైజడ్ ఎమోజీలను కూడా యాడ్ చేయొచ్చు.
ప్రొఫైల్ కార్డ్‌ని ఎలా షేర్ చేయాలి? :
మీ ప్రొఫైల్ కార్డ్‌ను షేర్ చేయడానికి పెద్దగా చేయనక్కర్లేదు. మీ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌కు వెళ్లండి. మీకు షేర్ ప్రొఫైల్ ఆప్షన్ కనిపిస్తుంది. షేర్ ప్రొఫైల్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ప్రొఫైల్ కార్డ్‌లో వివరాలను ఎంటర్ చేయండి. అవసరమైన వివరాలను ఎడిట్ చేయొచ్చు. తర్వాత మీ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ కార్డ్‌ని స్టోరీలో షేర్ చేయవచ్చు. ఇతర సోషల్ నెట్‌వర్క్‌లలో కూడా షేర్ చేయవచ్చు. మీకు కావాలంటే, మీరు దీన్ని వాట్సాప్ గ్రూపులతో, ఇతర స్నేహితుల కూడా షేర్ చేయొచ్చు.
ఫాలోవర్లను ఎలా పెంచుకోవాలి? :
మీ ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అవ్వమని మీరు ఎవరినైనా అడిగినప్పుడు.. మీ యూజర్ నేమ్ చెప్పేవారు. దీని కారణంగా ఇతర యూజర్లు ఏ ప్రొఫైల్ మీదే అని గందరగోళానికి గురవుతారు. కానీ, ఈ కార్డ్ సాయంతో ఫాలోవర్లు నేరుగా మీ ప్రొఫైల్‌కి వచ్చి మిమ్మల్ని ఫాలో చేయొచ్చు. అవసరమైతే.. క్యూఆర్ కోడ్‌ను కూడా స్కాన్ చేయవచ్చు. తద్వారా సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. ఈ స్టోరీని వివిధ నెట్‌వర్క్‌లలో పోస్ట్ చేయడం, గ్రూపులో షేరింగ్ చేయడం ద్వారా మీ ఫాలోవర్లను పెంచుకోవచ్చు. మీ ప్రొఫైల్ కార్డుతో స్టైలిష్‌గా, ప్రత్యేకంగా కనిపించేలా చేస్తుంది.
Read Also : iPhone 15 Pro : కొత్త ఐఫోన్ కొంటున్నారా? ఆపిల్ ఐఫోన్ 15ప్రోపై రూ.30,901 డిస్కౌంట్.. ఈ డీల్ ఎలా పొందాలంటే?