iPad Air Discount : ఫ్లిప్‌కార్ట్‌లో ఐప్యాడ్ ఎయిర్‌పై భారీ డిస్కౌంట్.. కేవలం రూ.9,901 మాత్రమే!

iPad Air Discount : మరోవైపు ఆపిల్ అధికారిక స్టోర్ ఇదే టాబ్లెట్‌ను రూ.59,900కు విక్రయిస్తోంది. ఈ ఐప్యాడ్ ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లో రూ. 9,901 ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్‌తో అందుబాటులో ఉంది.

iPad Air Discount : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఎయిర్ సిరీస్‌లో సరికొత్త మోడల్ 5వ జనరేషన్ ఐప్యాడ్ ఎయిర్ భారీ తగ్గింపును అందిస్తోంది. కొత్త మోడల్ లాంచ్ తర్వాత దీని ధర మరింత తగ్గే అవకాశం ఉంది. ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే 5వ జనరేషన్ ఐప్యాడ్ ఎయిర్‌ను తక్కువ ధరకు అందిస్తోంది. పూర్తివివరాలు ఇలా ఉన్నాయి. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 5వ జనరేషన్ ఐప్యాడ్ ఎయిర్ రూ. 49,999 ప్రారంభ ధరతో వస్తుంది.

Read Also : Apple iPhone 14 discount : ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్.. కేవలం రూ.57వేలకే సొంతం చేసుకోవచ్చు!

మరోవైపు ఆపిల్ అధికారిక స్టోర్ ఇదే టాబ్లెట్‌ను రూ.59,900కు విక్రయిస్తోంది. ఈ ఐప్యాడ్ ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లో రూ. 9,901 ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్‌తో అందుబాటులో ఉంది. ఆపిల్ ఎమ్1 చిప్, 10.9-అంగుళాల స్క్రీన్ కలిగిన వై-ఫై మాత్రమే మోడల్‌కు మాత్రమే అందిస్తుంది. ఈ డివైజ్‌లో బ్యాంక్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి. హెచ్‌ఎస్‌బీసీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై 10 శాతం తగ్గింపు, ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ. 1,250 తగ్గింపు పొందవచ్చు.

2022లో 5వ జనరేషన్ ఐప్యాడ్ ఎయిర్ కొత్త వెర్షన్ ఈ ఏడాది మేలో అందుబాటులోకి రానుంది. 6వ జనరేషన్ వేగవంతమైన ఎమ్2 చిప్‌తో వస్తుందని అంచనా. గత వెర్షన్‌తో పోలిస్తే.. పెద్ద 12.9-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉండనుంది. దీనిపై కంపెనీ అధికారికంగా ధృవీకరించలేదు.

ప్రస్తుతం ఎయిర్ లైనప్‌లో సరికొత్త మోడల్‌గా ఉన్న 2022 ఐప్యాడ్ ఎయిర్ మోడల్, 10.9-అంగుళాల లిక్విడ్ రెటినా డిస్‌ప్లేతో 3.8 మిలియన్ పిక్సెల్‌లు, 500 నిట్స్ బ్రైట్‌నెస్, పీ3 వైడ్ కలర్ గామట్, ట్రూ టోన్, యాంటీ రిఫ్లెక్టివ్‌తో వస్తుంది. అదనపు సెక్యూరిటీ విషయానికి వస్తే.. పవర్ బటన్‌లో టచ్ ఐడీ-ఆధారిత ఫింగర్‌ఫ్రింట్ సెన్సార్ ఇంటర్నల్‌గా ఉంటుంది. ఈ డివైజ్ ఇసిమ్, స్టీరియో స్పీకర్లు, వై-ఫై 6కి కూడా సపోర్టు అందిస్తుంది.

వీడియో కాల్ కోసం ఆపిల్ ఐప్యాడ్ ప్రంట్ సైడ్ 12ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉంది. ఈ డివైజ్ ఆపిల్ సెంటర్ స్టేజ్ ఫీచర్‌కు కూడా సపోర్టు చేస్తుంది. ప్రాథమికంగా వీడియో కాల్ సమయంలో కాల్ ఐడెంటిటీని గుర్తించడంలో సాయపడుతుంది. అవసరమైతే జూమ్ అవుట్ చేయొచ్చు. ఐప్యాడ్ ఎయిర్ బ్యాక్ సైడ్ 12ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. యూజర్లను 4కె వీడియోలను కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు.

Read Also : iPhone 16 Pro Leak : ఆపిల్ లవర్స్‌కు ఇంట్రెస్టింగ్ న్యూస్.. ఐఫోన్ 16ప్రో కలర్ ఆప్షన్లు లీక్, క్యాప్చర్ బటన్ లొకేషన్ తెలిసిందోచ్!

ట్రెండింగ్ వార్తలు