iPhone 12 mini can be bought for under Rs 35,000 on Flipkart, here's how the deal works
iPhone 12 mini Series : ఆపిల్ ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఐఫోన్ 12 సిరీస్ తక్కువ ధరకే అందుబాటులో ఉంది. మీరు iPhone 12 మినీ సిరీస్ రూ.35వేల ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ-కామర్స్ దిగ్గజం (Flipkart) బ్లాక్ ఐఫోన్ 12 మినీ సిరీస్ 64GB వేరియంట్‌పై 36 శాతం తగ్గింపును అందిస్తోంది. మీరు ఈ కొత్త డీల్ ఇతర డీల్స్‌తో కలిపితే ఐఫోన్ 12మినీ ధరను మరింత తగ్గించవచ్చు. ఐఫోన్ 12 మినీ వేరియంట్‌పై ఫ్లాట్ 36 శాతం తగ్గింపును అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ కొన్ని బ్యాంక్ డీల్‌లతో ఈ ఆఫర్ అందిస్తోంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై, మీరు రూ. 5వేలు, అంతకంటే ఎక్కువ ఆర్డర్‌లపై రూ. 1,500 వరకు 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే, IDFC మొదటి క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై, మీరు రూ. 5,000, అంతకంటే ఎక్కువ ఆర్డర్‌లపై రూ. 1,000 వరకు 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. Induslnd బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై, మీరు రూ. 5వేలు, అంతకంటే ఎక్కువ ఆర్డర్‌లపై రూ. 1,500 వరకు 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు.
మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు. మీరు పేమెంట్ కోసం Paytm వ్యాలెట్ ఉపయోగిస్తే.. కనిష్ట ఆర్డర్ వాల్యూ రూ. 1000పై ఫ్లాట్ రూ.100 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ ఉంది. ఈ ఆఫర్ ద్వారా ఒక్కో Paytm అకౌంట్ ఒకసారి మాత్రమే పేమెంట్ చేసే వీలుంది. మీరు UPI లావాదేవీలపై రూ. 250 తగ్గింపును కూడా పొందవచ్చు. ప్రతి ఆఫర్‌కు నిబంధనలు, షరతులు వర్తిస్తాయి. మీరు ఐఫోన్ 12మినీ కొనుగోలు చేసే ముందు తప్పక వివరాలను తెలుసుకోండి.
iPhone 12 mini can be bought for under Rs 35,000 on Flipkart
iPhone 12 మినీ డీల్స్ :
మీరు బ్లాక్ ఐఫోన్ 12 మినీ మోడల్ వద్దనుకుంటే.. వైట్, బ్లూ, గ్రీన్, పర్పల్, రెడ్ కలర్ ఐఫోన్‌లపై కూడా డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. వివిధ కలర్లలో అన్ని 64GB వేరియంట్‌లు 34 శాతం తగ్గింపుతో లభిస్తాయి. వాటిపై బ్యాంక్ డీల్‌లు కూడా పొందవచ్చు.
పాత ఫోన్‌ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు :
మీరు ఐఫోన్ 12మినీ వేరియంట్ మరింత తక్కువ ధరకే పొందాలంటే.. మీ పాత ఫోన్‌ని ఎక్స్ఛేంజ్ చేసి భారీ డిస్కౌంట్ పొందవచ్చు. మీ ఫోన్ మెరుగైన కండిషన్‌లో ఉంటే, డిస్కౌంట్ మెరుగ్గా ఉంటుంది. Flipkart మీ పాత ఫోన్‌కి బదులుగా రూ. 23,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అయితే, మీ ఫోన్ అద్భుతమైన కండిషన్, టెక్ దిగ్గజం అధిక వాల్యూతో ఉన్న కొన్ని సందర్భాల్లో మాత్రమే సాధ్యమవుతుంది.
‘Buy with Exchange’ ట్యాబ్‌పై క్లిక్ చేయడం ద్వారా, మీరు మీ పాత ఫోన్‌కు వాల్యూను చెక్ చేయవచ్చు. అలాగే, డీల్ పేజీలో పేర్కొన్న పెట్టెలో మీ పిన్ కోడ్‌ను నమోదు చేయవచ్చు. తద్వారా మీ ప్రాంతానికి ఎక్స్ఛేంజ్ ఆప్షన్ అందుబాటులో ఉందో లేదో చెక్ చేయాల్సి ఉంటుంది.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..