Flipkart Big Billion Days Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. కేవలం రూ. 11కే ఐఫోన్ 13 మోడల్.. ఈ డీల్‌పై విమర్శల వెల్లువ..!

Flipkart Big Billion Days Sale : వినియోగదారుల ఫిర్యాదులపై ఫ్లిప్‌కార్ట్ సపోర్టు స్పందిస్తూ వివరణ ఇచ్చింది. “ఆఫర్ గురించి మీ ఆందోళనను మేం అర్థం చేసుకున్నాం. వేగవంతమైన మొదటి ఆఫర్‌ను మొదటి ముగ్గురు కస్టమర్‌లు మాత్రమే క్లెయిమ్ చేసారు.

iPhone 13 At Rs 11 Available During Flipkart Big Billion Days Sale

Flipkart Big Billion Days Sale : కొత్త ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, మీకో అద్భుతమైన అవకాశం.. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఇటీవల బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఆకర్ణణీయమైన డీల్‌ను ప్రకటించింది. ఈ నెల 22వ తేదీ రాత్రి 11 గంటల వద్ద ఆపిల్ ఐఫోన్ 13ని కేవలం రూ.11కే అంటూ ప్రకటన చేసింది.

Read Also : Mahindra Thar Roxx 4WD Prices : కొత్త కారు కొంటున్నారా? మహీంద్రా థార్ రోక్స్ 4WD ధరలివే.. బుకింగ్, డెలివరీ వివరాలు మీకోసం..!

అయితే, ఈ ప్రమోషన్ ఆన్‌లైన్‌లో సంచలనాన్ని సృష్టించింది. చాలా మంది వినియోగదారులు ఈ కొత్త ఆఫర్‌ను పొందేందుకు ఆసక్తిగా చూశారు. అయితే, సేల్ లైవ్ అయిన కొద్ది క్షణాల వ్యవధిలోనే వినియోగదారులు అనేక సమస్యలను నివేదించారు. చాలా మంది వినియోగదారులు “బై నౌ” బటన్‌ను క్లిక్ చేయలేకపోయారు. వినియోగదారులకు ఎర్రర్ మెసేజ్‌లు వచ్చాయి.

క్షణాల్లోనే, ఐఫోన్ 13 స్టాక్ లేదంటూ మెసేజ్ కనిపించింది. దాంతో కొనుగోలుదారులలో తీవ్రనిరాశకు దారితీసింది. మరికొందరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 11కి కొనుగోలు చేయగలిగినప్పటికీ, ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఆర్డర్‌ను రద్దు చేసిందని చెప్పారు. మరికొందరు ఆర్డర్ చేసేటప్పుడు సాంకేతిక లోపాలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అయినప్పటికీ, సోషల్ మీడియాలో కొంతమంది వినియోగదారులు తాము డీల్‌ను విజయవంతంగా పొందామని పేర్కొన్నారు. ఇంతకీ, వారి ఆర్డర్‌లను అనుమతిస్తారా? లేదా రద్దు చేస్తారా? అనే ప్రశ్నలను లేవనెత్తింది.

ప్రతిరోజూ రాత్రి 9 నుంచి 11 గంటల మధ్య డీల్స్ :
“మీరు రాత్రి 11 గంటలకు రూ.11కి ఐఫోన్ 13ని పొందడానికి ప్రయత్నించి ఉంటే.. బహుశా మీరు మోసపోయి ఉండవచ్చు. బజ్ క్రియేట్ చేయడానికి ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్‌లు ఉపయోగించే మార్కెటింగ్ జిమ్మిక్కులలో ఇది ఒకటి. “సోల్డ్ అవుట్” మెసేజ్ అందరికీ పాప్ అప్ అవుతుంది” అని ఎక్స్ వేదికగా పలువురు వినియోగదారులు నివేదించారు.

ఫ్లిప్‌కార్ట్ సపోర్టు వివరణ :
వినియోగదారుల ఫిర్యాదులపై ఫ్లిప్‌కార్ట్ సపోర్టు స్పందిస్తూ వివరణ ఇచ్చింది. “ఆఫర్ గురించి మీ ఆందోళనను మేం అర్థం చేసుకున్నాం. వేగవంతమైన మొదటి ఆఫర్‌ను మొదటి ముగ్గురు కస్టమర్‌లు మాత్రమే క్లెయిమ్ చేసారు. కానీ చింతించకండి. బిగ్ బిలియన్ డేస్‌లో భాగంగా మీరు ఇప్పటికీ ప్రతిరోజూ రాత్రి 9 గంటలు, రాత్రి 11 గంటలకు గొప్ప డీల్‌లను పొందవచ్చు” అని పేర్కొంది.

ఇలాంటి సంఘటనల నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ విమర్శలను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల, ప్లాట్‌ఫారమ్ మోటో జీ85పై 99శాతం తగ్గింపును తర్వాత ఆర్డర్‌లను రద్దు చేసినందుకు విమర్శల పాలైంది. ఇది కస్టమర్‌లను మరింతగా కలవరపెడుతోంది. రూ. 11కే ఐఫోన్ 13 ఆఫర్ అదే పద్ధతిని అనుసరించినట్లు కనిపిస్తోంది. తగినంత స్టాక్ లేకుండా హైప్‌ని క్రియేట్ చేయడానికి ఇలా ప్రమోషన్ వ్యూహంగా చాలా మంది వినియోగదారులను తప్పుదారి పట్టించింది.

ఫ్లిప్‌కార్ట్ సేల్ వ్యూహాలపై మరోసారి విమర్శలు రావడంతో ఈ డీల్స్ కోసం వేచి ఉన్న వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రమోషన్‌లు, వినియోగదారుల దృష్టిని ఆకర్షించేలా ఉంటున్నాయి. ఫ్లిప్‌కార్ట్ ఈ తరహా ప్రమోషన్లపై ఆందోళనలను పరిష్కరిస్తుందా లేదా హై-ట్రాఫిక్ సేల్స్ ఈవెంట్‌లలో ఇలాంటి సంఘటనలు జరుగుతాయా అనేది చూడాలి.

Read Also : Flipkart Diwali Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. ఆపిల్ ఐఫోన్ 15 ప్రోపై భారీ తగ్గింపు.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు!