iPhone 15 gets Rs 8,000 discount on Croma, here is how the deal works
Apple iPhone Discount : ఆపిల్ కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఐఫోన్ 15 మళ్లీ భారీ తగ్గింపుతో అందుబాటులోకి వచ్చింది. ఎందుకంటే.. ఆపిల్ ఫ్లాగ్‌షిప్ డివైజ్‌ను కొన్ని నెలల క్రితమే లాంచ్ చేసింది. ఈ కొత్త 5జీ ఫోన్‌పై రూ. 8వేల డిస్కౌంట్ అందిస్తోంది. ఇందులో బ్యాంక్ కార్డ్ ఆఫర్, ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉన్నాయి. లేటెస్ట్ ఐఫోన్ 15 డీల్ ప్రస్తుతం క్రోమాలో అందుబాటులో ఉంది. ఈ డీల్ ఎప్పుడు ముగుస్తుందో క్లారిటీ లేదు. కానీ, ఈ డీల్ ఎలా సొంతం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
క్రోమాలో ఐఫోన్ 15పై రూ. 8వేల తగ్గింపు :
ఐఫోన్ 15 రూ. 79,900 ప్రారంభ ధరతో లిస్టు అయింది. కానీ, ఇప్పుడు, ఈ ఐఫోన్ అసలు ధర నుంచి రూ. 76,900కి తగ్గింది. ఈ ప్లాట్‌ఫారమ్ రూ. 3వేల ఫ్లాట్ డిస్కౌంట్ కూడా అందిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై అదనంగా రూ. 5వేల డిస్కౌంట్ కూడా అందిస్తోంది. ఐఫోన్ ధర రూ.71,900కి తగ్గుతుంది.
ఐఫోన్ 15 కొనుగోలు చేయాలా వద్దా? :
భారత మార్కట్లో ఐఫోన్ 15 దాదాపు రూ. 72వేలు ఖర్చు చేయగలిగితే.. ప్రస్తుతం ఇదే బెస్ట్ ఫోన్. 4కె సినిమాటిక్ మోడ్, వేగవంతమైన చిప్‌సెట్, కొత్త పంచ్-హోల్ డిస్‌ప్లే డిజైన్, యూఎస్‌బీ-సి పోర్ట్‌కు సపోర్టుతో కొత్త 48ఎంపీ కెమెరా సిస్టమ్‌తో వస్తుంది. ఈ ఫోన్ యూఎస్‌బీ-సి పోర్ట్‌ని కలిగి ఉంది. ఐఫోన్ 15 ప్రత్యేక ఛార్జింగ్ కేబుల్‌తో పాటు అడాప్టర్‌ను తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఉన్న ఏదైనా టైప్-సి ఛార్జర్‌ని ఉపయోగించవచ్చు. ఫ్యామిలీతో ప్రయాణిస్తున్నప్పుడు.. కొత్త మోడల్ మునుపటి మోడల్‌ల కన్నా కొంచెం ప్రకాశవంతమైన డిస్‌ప్లేను కలిగి ఉంది.
Apple iPhone 15 discount on Croma
వినియోగదారులు ప్రాథమిక వినియోగంతో ఒక రోజు కన్నా తక్కువ బ్యాటరీ లైఫ్ పొందవచ్చు. వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు, ఐపీ68 రేటింగ్‌ను కూడా కలిగి ఉంది. ఐఫోన్ 15 మొత్తం పర్పార్మెన్స్ కూడా వేగంగా ఉంటుంది. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుంటే.. ఐఫోన్ 15 బెస్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే.. మీరు మునుపటి వెర్షన్లతో పోలిస్తే.. మెరుగైన ఎక్స్‌పీరియన్స్ పొందవచ్చు. అది కూడా కొత్త ఐఫోన్ లాంచ్ అయిన కొన్ని నెలల తర్వాత చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం.. ఇప్పుడే ఐఫోన్ 15 కొనేసుకోండి.
Read Also : Redmi 13R 5G Launch : అద్భుతమైన కెమెరాలతో రెడ్‌మి 13ఆర్ 5జీ ఫోన్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?