iPhone 16 Battery Leak : ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ బ్యాటరీ వివరాలు లీక్.. ఐఫోన్ 15 ప్లస్ కన్నా చిన్న బ్యాటరీతో రావొచ్చు!

iPhone 16 Battery Leak : ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ బ్యాటరీ వివరాలు లీక్ అయ్యాయి. ఐఫోన్ 15 సిరీస్ మోడల్‌తో పోలిస్తే.. హుడ్ కింద భారీ బ్యాటరీతో వస్తాయని గత లీక్ డేటా తెలిపింది. కానీ, చిన్న బ్యాటరీతో వచ్చే అవకాశం ఉంది.

iPhone 16 Battery Leak : ఆపిల్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఐఫోన్ 16 సిరీస్‌కు సంబంధించి బ్యాటరీ వివరాలు మళ్లీ లీక్ అయ్యాయి. గత లీక్‌లు అన్ని 2024 ఐఫోన్‌లు హుడ్ కింద పెద్ద బ్యాటరీని కలిగి ఉంటాయని సూచించాయి. అయితే, లేటెస్ట్ లీక్ ప్రకారం.. ఐఫోన్ 16 ప్లస్ మోడల్ గత మోడల్ ఐఫోన్‌తో పోలిస్తే.. చిన్న బ్యాటరీతో లాంచ్ అవుతుందని పేర్కొంది. లీక్‌లు నిజమైతే.. ఐఫోన్ 15 ప్లస్‌తో పోల్చిస్తే.. బ్యాటరీ లైఫ్ పరంగా పెద్దగా తేడా ఉండదని చెప్పవచ్చు.

Read Also : Tesla Robotaxi : ఎట్టకేలకు భారత్‌కు టెస్లా వచ్చేస్తోంది.. బిగ్ హింట్ ఇచ్చిన ఎలన్ మస్క్.. రోబోటాక్సీ లాంచ్ డేట్ రివీల్ చేశాడుగా!

వెయిబోలోని టిప్‌స్టర్ బేబీ సాస్ ఐఫోన్ 16 సిరీస్ బ్యాటరీ వివరాలను పొందినట్లు పేర్కొంది. ఐఫోన్ 15 మోడల్‌లోని 3,349ఎంఎహెచ్ యూనిట్ నుంచి ఐఫోన్ 16 ఫోన్ 3,561ఎంఎహెచ్ కలిగి ఉంటుందని నివేదిక తెలిపింది. అదేవిధంగా, ఐఫోన్ 16 ప్లస్ 4,006ఎంఎహెచ్ రానుందని, గత ఏడాది మోడల్‌లో చూసిన 4,383ఎంఎహెచ్ యూనిట్ కన్నా చిన్నదిగా ఉండనుంది.

ఏ వెర్షన్ బ్యాటరీ ఎంత ఉండొచ్చుంటే? :
ఐఫోన్ 16 ప్రో వెర్షన్ 3,355ఎంఏహెచ్‌తో రానుంది. ఐఫోన్ 15 ప్రో వెర్షన్‌లోని 3,274 ఎంఏహెచ్ కన్నా ఇది కొంచెం ఎక్కువగా ఉండనుంది. ఐఫోన్ 16ప్రో మ్యాక్స్ అతిపెద్ద బ్యాటరీతో రావొచ్చు. ఎందుకంటే.. మ్యాక్స్ మోడల్‌లు ఆపిల్ అత్యంత ప్రీమియం ఆఫర్‌లుగా చెప్పవచ్చు. కంపెనీ ఐఫోన్ 16 ప్రో మాక్స్‌ను భారీ 4,676 ఎంఏహెచ్ బ్యాటరీతో తీసుకురానుంది. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ హుడ్ కింద 4,422ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. నివేదికల ప్రకారం.. ప్రామాణిక ఐఫోన్ 16 సిరీస్ మోడల్ గత ఐఫోన్ 15 మోడళ్లతో పోలిస్తే 2 శాతం, 6 శాతం మధ్య ఎక్కువ బ్యాటరీతో వచ్చే అవకాశం ఉంది.

భారీ డిస్‌ప్లేతో ఐఫోన్ 16 సిరీస్ మోడల్స్ : 
అంతేకాకుండా, ఐఫోన్ 16 ప్రో, ప్రో మాక్స్ మోడల్‌లు భారీ డిస్‌ప్లేలతో రానున్నాయి. 6.3-అంగుళాల స్క్రీన్‌, ప్రో మాక్స్ భారీ 6.9-అంగుళాల కాన్వాస్‌ను కలిగి ఉండనుంది. అయినప్పటికీ, ఈ భారీ డిస్‌ప్లే ఐఫోన్ల వినియోగంపై కూడా ఆందోళనలను పెంచుతోంది. ఐఫోన్ 16, 16 ప్లస్‌లు గత వెర్షన్ల మాదిరిగా స్క్రీన్ సైజులతో వచ్చే అవకాశం ఉంది. అయితే, ప్రామాణిక ఐఫోన్ 16 కోసం 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ అందించనుంది.

ఐఫోన్ 16 ప్రో సిరీస్ అధునాతన ఎ18 ప్రో చిప్‌సెట్‌లతో రానుందని లీక్ డేటా తెలిపింది. ఐఫోన్ 16, 16 ప్లస్‌లకు సంబంధించి సవరించిన ఎ17 చిప్‌ ఉండనుందని అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, దీనికి సంబంధించి వివరాలు పూర్తిగా రివీల్ కాలేదు. ముఖ్యంగా, ఆపిల్ గేమింగ్ వంటి అధికంగా పవర్ వినియోగించే పనుల్లో థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం ప్రో మోడల్‌లలో గ్రాఫేన్‌ను కూడా అందించనుంది. రాబోయే ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.

Read Also : Apple iPhone 15 Pro : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 15 ప్రోపై భారీగా తగ్గింపు.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు!

ట్రెండింగ్ వార్తలు