iPhone 17 Pro Models : స్పెషల్ కెమెరా ఫీచర్లతో రానున్న ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మోడల్స్.. ఇంకా ఏమి ఉండొచ్చుంటే?

iPhone 17 Pro Models : ఐఫోన్ 17 ప్రో మోడల్స్ అద్భుతమైన సరికొత్త ఫీచర్లతో రానున్నాయి. ప్రీమియం ఐఫోన్ 17 ప్రో మోడల్‌లకు మాత్రమే ఈ ఫీచర్లు ఉండనున్నట్టు తెలుస్తోంది.

iPhone 17 Pro Models To Get This Exclusive Camera Feature

iPhone 17 Pro Models : ఆపిల్ కొత్త ఐఫోన్ 16 సిరీస్‌ను గత సెప్టెంబరులో లాంచ్ చేసింది. ఆపిల్ M4-పవర్ మ్యాక్ డివైజ్‌లను కూడా ఆవిష్కరించింది. ఇప్పుడు, కంపెనీ 2025 లైనప్‌‌పై ఫోకస్ పెట్టింది. రాబోయే ఆపిల్ ప్రొడక్టుల్లో ఐఫోన్ 17 సిరీస్ కూడా ఉంది.

ప్రస్తుతం రాబోయే ఐఫోన్ 17 సిరీస్ గురించి అనేక పుకార్లు వినిపిస్తున్నాయి. నివేదికల ప్రకారం.. ఐఫోన్ 17 ప్రో మోడల్స్ అద్భుతమైన సరికొత్త ఫీచర్లతో రానున్నాయి. ప్రీమియం ఐఫోన్ 17 ప్రో మోడల్‌లకు మాత్రమే ఈ ఫీచర్లు ఉండనున్నట్టు తెలుస్తోంది. ఎక్స్‌క్లూజివ్ కెమెరాలకు సంబంధించిన ఫీచర్లు ఉండే అవకాశం ఉందని పలు నివేదికలు సూచిస్తున్నాయి.

ఐఫోన్ 17 ప్రో కెమెరా ఫీచర్లు (అంచనా) :
నివేదికల ప్రకారం.. ఐఫోన్ 17ప్రో, ఐఫోన్ 17ప్రో మ్యాక్స్ మోడల్‌లు 5ఎక్స్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌ను పొందుతున్నాయి. ఈ మోడళ్లపై లెన్స్ 5ఎక్స్ ఆప్టికల్ జూమ్‌ను అందిస్తుందని డిజిటైమ్స్ వివరాలు చెబుతున్నాయి.

ఆపిల్ స్పేర్ పార్ట్స్ కోసం సరఫరాదారు ఎల్‌జీ ఇన్నోటెక్‌పై ఆధారపడుతుంది. ఈ లెన్స్‌ల కోసం తయారీ స్థావరాన్ని సెటప్ చేసేందుకు కంపెనీ ఇప్పటికే ప్రక్రియను ప్రారంభించిందని నివేదిక పేర్కొంది. ఆపిల్ ఫీచర్లతో ప్రత్యేకంగా కెమెరాలతో ప్రో-ఎక్స్‌క్లూజివ్‌గా మారడం కొత్తేమీ కాదు.

ఈ ఏడాది కూడా ఐఫోన్ 16ప్రో, ఐఫోన్ 16ప్రో మ్యాక్స్ వేరియంట్‌లు 5ఎక్స్ టెట్రాప్రిజం జూమ్ లెన్స్‌ను పొందాయి. తదుపరి లాజికల్ అప్‌గ్రేడ్ పెరిస్కోప్ లెన్స్‌గా ఉండబోతోంది. 2025లో ఈ ఐఫోన్‌లతో ఫేస్ ఐడీ టెక్నాలజీని అండర్ డిస్‌ప్లే కెమెరాలోకి తీసుకురావాలని కంపెనీ సూచించింది.

A19 ప్రో చిప్‌సెట్ ప్రో మోడల్‌లకు మరింత పవర్ అందించే అవకాశం ఉంది. అయితే, A18 ప్రో సాధారణ ఐఫోన్ 17 వేరియంట్‌ రిక్వైర్‌మెంట్స్ అందిస్తుంది. ప్లస్ మోనికర్‌ని స్లిమ్‌తో ఆపిల్ రిప్లేస్ చేస్తుందా లేదా కంపెనీ వచ్చే ఏడాది తన పోర్ట్‌ఫోలియోలో 5 మోడళ్లను కలిగి ఉంటుందా? లేదో చూడాలి.

Read Also : PAN 2.0 : పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. కొత్త పాన్ 2.0 కార్డు వస్తోంది.. పాత కార్డు పనిచేస్తుందా? లేదా? ఫుల్ డిటైల్స్ మీకోసం..