ఆపిల్ సంస్థ ఇటీవలే ఐఫోన్ 16ఈను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఐఫోన్ 16ఈ డిజైన్, డిస్‌ప్లే, పెర్ఫార్మెన్స్, కెమెరాలు, బ్యాటరీ లైఫ్ వంటి వివరాల గురించి అందరికీ తెలిసిపోయింది. ఐఫోన్ 16ఈ ఫిబ్రవరి 19న మార్కెట్లలోకి వచ్చింది. ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే ఐఫోన్ 17ఈను ఆపిల్ సంస్థ మార్కెట్లో విడుదల చేయనుందని విశ్లేషకులు చెబుతున్నారు.
కన్స్యూమర్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ పార్ట్‌నర్స్ (సీఐఆర్‌పీ)కు చెందిన విశ్లేషకులు వేసిన అంచనాల ప్రకారం.. ఆపిల్ సంస్థ ఐఫోన్ 17ఈను 2026 ఫిబ్రవరిలో లాంచ్ చేయవచ్చు. ఐఫోన్ 16ఈను ఐఫోన్ 16 లైనప్‌లో బడ్జెట్-ఫ్రెండ్లీ ఆప్షన్‌తో లాంచ్ చేశారు.
ఆపిల్ తమ తదుపరి ఐఫోన్‌ను (ఐఫోన్ 17ను) ఈ ఏడాది సెప్టెంబరులో లాంచ్ చేసే అవకాశం ఉంది. గూగుల్ పిక్సెల్ ‘ఏ’ మోడళ్లలాగే ఆపిల్ “ఈ” సిరీస్ ఆపిల్ ప్రాడక్ట్ లైనప్‌లో రెగ్యులర్ ఫీచర్‌గా మారవచ్చని తెలుస్తోంది.
ఐఫోన్ 16ఈ ఇప్పటికే ఏ18 చిప్‌సెట్‌తో, దాదాపు స్టాండర్డ్ ఐఫోన్ 16 ఫీచర్లతో వచ్చింది. ఐఫోన్ 17ఈ వచ్చే ఏడాది ఐఫోన్ 17లోని హార్డ్‌వేర్‌తో రానుంది. ఐపీఐఆర్‌పీ రిపోర్టు కూడా ఇదే చెబుతోంది. ఐఫోన్ 16ఈ ధర ఐఫోన్ ఎస్‌ఈ మోడళ్ల కంటే ఎక్కువగా ఉంది. ఐఫోన్ 16ఈ ధర, వేరియంట్లు వారీగా 128GB: రూ. 59,900, 256GB: రూ. 69,900, 512GB: రూ. 89,900గా ఉంది.
ఆపిల్ ఐఫోన్ ఎస్ బ్రాండింగ్ నుంచి “ఈ” సిరీస్‌కు మారడానికి కారణం ఐఫోన్ ఎస్‌ఈ అమ్మకాలు తక్కువగా జరగడమేనని తెలుస్తోంది. 2024లో అన్ని ఐఫోన్‌ల అమ్మకాల్లో ఐఫోన్ ఎస్‌ఈ అమ్మకాలు కేవలం 5 శాతం జరిగాయి.
దీంతో ఆపిల్ ఐఫోన్ ఎస్ బ్రాండింగ్ నుంచి “ఈ” సిరీస్‌కు మారిందని, ఈ సిరీస్‌లోనే ప్రతి ఏడాది ఫోన్లు విడుదల చేస్తుందని అంచనాలు ఉన్నాయి. ఈ ఏడాది ఐఫోన్ 16ఈను విడుదల చేసింది కాబట్టి వచ్చే ఏడాది ఐఫోన్ 17ఈ రావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.