iPhone 18 Leaks
iPhone 18 Leaks : ఆపిల్ లవర్స్‌కు అదిరిపోయే న్యూస్.. త్వరలో ఆపిల్ ఐఫోన్ 18 రాబోతుంది. ఇప్పటికే, 2025 ఏడాదిలో ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ సంచలనం సృష్టించింది. ముఖ్యంగా ఐఫోన్ 17 బేస్ వేరియంట్ అనేక అప్‌గ్రేడ్‌లతో యూజర్లను ఆకట్టుకుంది. ఇప్పుడు, ఐఫోన్ 18 కూడా అంతే భారీ అంచనాలతో రాబోతుంది.
లాంచ్‌కు దాదాపు 10 నెలల ముందే ఐఫోన్ 18 (iPhone 18 Leaks) సంచలనం సృష్టిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ గురించి అనేక వివరాలు లీక్‌లు, పుకార్లు రివీల్ అయ్యాయి. ఇంతకీ రాబోయే ఐఫోన్ 18 ఫీచర్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం..
ఐఫోన్ 18 లాంచ్ ఎప్పుడంటే? :
ఐఫోన్ 18 వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో లాంచ్ కానుంది. ఆపిల్ ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్, ఐఫోన్ ఎయిర్ 2 అనే ఐఫోన్ ఎయిర్ కొత్త వెర్షన్‌ను కూడా లాంచ్ చేయవచ్చు. ఆపిల్ అధికారికంగా లాంచ్ తేదీని ధృవీకరించలేదు. గత నివేదికల ఆధారంగా కొత్త ఐఫోన్లు సెప్టెంబర్‌లో మార్కెట్‌లోకి వస్తాయని అంచనా వేయవచ్చు. అంటే.. అదే నెల రెండో వారంలో ఐఫోన్ 18 అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ రాబోయే మోడల్ డ్యూయల్-కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉండవచ్చని అంచనా.
ఆపిల్ ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్, ఐఫోన్ ఎయిర్ 2 వంటి సిరీస్‌లోని అనేక ఇతర స్మార్ట్‌ఫోన్‌లతో పాటు ఐఫోన్ 18 వచ్చే ఏడాది భారత మార్కెట్లో లాంచ్ అవుతుంది. లాంచ్ తేదీపై ఇంకా ఎలాంటి సమాచారం లేనప్పటికీ, ఆపిల్ లాంగ్ టైమ్ ట్రెండ్ ప్రకారం ఈ ఐఫోన్ 18 సెప్టెంబర్ 2026 రెండవ వారంలో లాంచ్ అవుతుంది.
ధర విషయానికి వస్తే.. ఆపిల్ ఐఫోన్ 17 ముందు వెర్షన్ కన్నా కొంచెం ఎక్కువ ధరను కలిగి ఉంది. ఐఫోన్ 18 మోడల్ కూడా అదే ధర ఉండొచ్చు. భారత మార్కెట్లో ఐఫోన్ 18 ధర సుమారు రూ. 85వేలు ఉండవచ్చు.
ఐఫోన్ 18 కెమెరా, డిజైన్, స్పెసిఫికేషన్లు :
స్మార్ట్‌ఫోన్ డిజైన్ విషయానికొస్తే.. ఆపిల్ ఇటీవలే ఐఫోన్ 17లో కొన్ని మార్పులు చేసింది. రాబోయే ఐఫోన్ 18 కొత్త కలర్ ఆప్షన్లతో లాంచ్ చేయనుంది. కెమెరాల పరంగా ఐఫోన్ 18 గత మోడల్స్ మాదిరిగానే మరింత పవర్‌ఫుల్ సెన్సార్లతో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 18MP ఫ్రంట్ కెమెరా కూడా ఉండొచ్చు.
స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఆపిల్ ఐఫోన్ 18 మోడల్ 6.3-అంగుళాల ప్రోమోషన్ సూపర్ రెటినా డిస్‌ప్లే కలిగి ఉంటుందని అంచనా. ఈ ఐఫోన్ ఆపిల్ A20 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. కనీసం 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుందని భావిస్తున్నారు. అంతేకాదు.. భారీ వాడకంతో రోజంతా పవర్‌ఫుల్ బ్యాటరీ ఛార్జింగ్ అందిస్తుందని అంచనా.