iPhone Loss On Instagram : ఇన్‌స్టాగ్రామ్‌లో ఆపిల్ ఐఫోన్ కొనబోయాడు.. అకౌంట్లో రూ.29 లక్షలు మాయం.. సైబర్ మోసాల నుంచి సేఫ్‌గా ఉండాలంటే?

iPhone Loss On Instagram : భారత్‌లో సైబర్ క్రైమ్‌లు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఆన్‌లైన్‌లో పేమెంట్స్ చేస్తున్నప్పుడు యూజర్లు మోసాలకు గురవుతుంటారు. అలాంటి ఒక కేసు న్యూఢిల్లీలోని ఘిటోర్ని ప్రాంతంలో నమోదైంది.

iPhone Loss On Instagram : భారత్‌లో సైబర్ క్రైమ్‌లు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఆన్‌లైన్‌లో పేమెంట్స్ చేస్తున్నప్పుడు యూజర్లు మోసాలకు గురవుతుంటారు. అలాంటి ఒక కేసు న్యూఢిల్లీలోని ఘిటోర్ని ప్రాంతంలో నమోదైంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఐఫోన్‌లను కొనుగోలు చేయడానికి ప్రయత్నించి ఒక వ్యక్తి రూ. 29 లక్షలు కోల్పోయాడు. ఆ బాధిత వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా పేరు తెలియని వ్యక్తులపై చీటింగ్ కేసు నమోదు అయింది.

ఆన్‌లైన్‌లో రూ.29 లక్షలు మోసం :
నివేదిక ప్రకారం.. ఫిర్యాదుదారుడు కొన్ని రోజుల క్రితమే ఐఫోన్‌లపై భారీ డిస్కౌంట్ అంటూ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో చూసినట్టు పోలీసులకు చెప్పాడు. వికాస్ కటియార్ అనే ఫిర్యాదుదారు.. వెబ్‌సైట్ నుంచి కొనుగోలు చేయడానికి టెంప్ట్ అయ్యాడు. ఇన్‌స్టాలో కనిపించిన తక్కువ ధరలను చూసి ఉండవచ్చు. నివేదికలో పేజీని చెక్ చేసిన తర్వాత పేజీ రియల్ కాదో నిర్ధారించుకోవడానికి మరొక ఇన్‌స్టాగ్రామ్ పేజీ నుంచి పాత కొనుగోలుదారులను కూడా సంప్రదించాడు.

Read Also :  Holi 2023 Tips : హోలీ రోజున మీ స్మార్ట్‌ఫోన్ జాగ్రత్త.. పొరపాటున నీళ్లలో ఫోన్ పడితే వెంటనే ఇలా చేయండి.. బెస్ట్ టిప్స్ మీకోసం..!

అప్పుడు ఆ పేజీ రియల్ అనే విషయాన్ని ధృవీకరించారు. అప్పుడు ఎలాంటి సమస్య లేకుండా ఫోన్‌లను కొనుగోలు చేయొచ్చు అని భావించాడు. ఆ తర్వాత ఫిబ్రవరి 6, 2023న కటియార్ ఐఫోన్ కొనుగోలు చేయడానికి నిర్దిష్ట మొబైల్ నంబర్‌కు కాల్ చేశారు. తనకు చౌకైన ఐఫోన్‌ను విక్రయిస్తున్న వ్యక్తులు..రూ. 28వేలు అడ్వాన్స్‌డ్ పేమెంట్‌ అడిగారు. ఈ ఫోన్ ధరలో 30 శాతం అని కటియార్ చెప్పారు. అప్పుడు ఆ గ్రూపు సభ్యులు వేర్వేరు ఫోన్ నంబర్ల ద్వారా తనను సంప్రదించారు.

iPhone Loss On Instagram : Man loses Rs 29 lakh while trying to buy iPhone on Instagram

కస్టమ్స్, ఇతర పన్నులను క్లియర్ చేసే నెపంతో అదనపు డబ్బును అడిగారని నివేదిక తెలిపింది. కటియార్ వివిధ అకౌంట్లలో మొత్తం రూ.28,69,850 (సుమారు రూ. 29 లక్షలు) చెల్లించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కటియార్ ఇప్పటికీ తన ఫోన్‌తో పాటు వాపసు కూడా పొందాలని ఆశిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ ఢిల్లీలోని సౌత్ వెస్ట్ జిల్లా సైబర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైంది.

ఆన్‌లైన్‌లో పేమెంట్లపై ఎలా సేఫ్‌గా ఉండాలంటే? :
ఆన్‌లైన్‌లో ఎలాంటి కొనుగోళ్లు చేసినా సురక్షితంగా ఉండాలంటే.. యూజర్లు సురక్షితంగా ఉండే కొన్ని విషయాలు ఉన్నాయి. మీరు కొనుగోలు చేస్తున్న వెబ్‌సైట్ ప్రామాణికమైనదని నిర్ధారించుకోండి. Instagram పేజీల నుంచి నేరుగా ఏదైనా కొనుగోలు చేయడాన్ని నివారించాలి. ఆ తర్వాత మీరు ఎలాంటి ఆన్‌లైన్ పేమెంట్లను చేయడంలో జాగ్రత్తగా ఉండాలి. డబ్బు బదిలీ చేసే అకౌంట్ పేరును చెక్ చేయడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించాలి. మీరు వెరిఫై చేయని పేజీ ద్వారా కొనుగోలు చేయవలసి వస్తే.. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్‌తో ఆర్డర్ చేయడానికి ప్రయత్నించండి. తద్వారా ప్రొడక్టు మీకు చేరిన తర్వాత మాత్రమే చెల్లించవలసి ఉంటుంది.

Read Also : Best Gaming Laptops : ఈ మార్చిలో రూ.60వేల లోపు బెస్ట్ గేమింగ్ ల్యాప్‌టాప్స్ ఇవే.. మీకు నచ్చిన మోడల్ ఇప్పుడే కొనేసుకోండి!

ట్రెండింగ్ వార్తలు