iQoo 12 5G Launch : అమెజాన్‌లో ఐక్యూ 12 5జీ ఫోన్ లిస్టింగ్.. భారత్‌లో డిసెంబర్ 12నే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

iQoo 12 5G Launch : ఐక్యూ 12 5G ఫోన్ వచ్చేస్తోంది. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ డిసెంబర్ 12న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. అంతకంటే ముందుగానే అమెజాన్‌ మైక్రోసైట్‌లో ఈ ఫోన్ ప్రత్యక్షమైంది.

iQoo 12 5G to be Available on Amazon India

iQoo 12 5G Launch : ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు ఐక్యూ ఈ నెల ప్రారంభంలో స్వదేశంలో ఐక్యూ 12, ఐక్యూ 12 ప్రోలను లాంచ్ చేసింది. ఇప్పుడు, వచ్చే డిసెంబ‌ర్‌ 12న భారత మార్కెట్లో ఐక్యూ 12 5జీ సిరీస్ లాంచ్ కానుంది. దేశంలో లాంచ్‌కు దాదాపు ఐక్యూ 12 ఫోన్ అమెజాన్‌లో మైక్రోసైట్‌లో కనిపించింది. ఈ ఫ్లాగ్‌షిప్ సరికొత్త స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌లో రన్ అవుతుంది. వెనుకవైపు ఉన్న టెలిఫోటో సెన్సార్ గరిష్టంగా 100ఎక్స్ జూమ్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. కెమెరా మాడ్యూల్ చుట్టూ సిల్వర్ రింగ్ ఫోన్‌లో ఉంటుంది.

Read Also : Apple iPhone 15 Sale : కొత్త ఆపిల్ ఐఫోన్‌ 15పై అదిరే డిస్కౌంట్.. కేవలం రూ. 29,900కే సొంతం చేసుకోండి.. డోంట్ మిస్!

ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే చైనాలో లాంచ్ కాగా.. పూర్తి స్పెసిఫికేషన్‌లు అందుబాటులో ఉన్నాయి. చైనీస్ ధరతో పోలిస్తే రాబోయే ఫ్లాగ్‌షిప్ ఫోన్ ధరపై అనేక అంచనాలు నెలకొన్నాయి. ఐక్యూ 12 5జీ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లలో 6.78-అంగుళాల 1.5K అమోల్డ్ 144హెచ్‌జెడ్ స్క్రీన్‌, 3,000నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కలిగి ఉంది. హుడ్ కింద హ్యాండ్‌సెట్ 4ఎన్ఎమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 సీపీయూ అడ్రినో 750 జీపీయూని అందిస్తుంది. ఈ బ్రాండ్ ఆండ్రాయిడ్ 14-ఆధారిత కస్టమ్ స్కిన్‌పై రన్ అవుతుంది. ఐక్యూ 12 మోడల్ 120డబ్ల్యూ ఛార్జింగ్‌తో 5,000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.

ఐక్యూ 12 5జీ ఫీచర్లు (అంచనా) : 

ఆప్టిక్స్ విషయానికొస్తే.. స్మార్ట్‌ఫోన్‌లో 50ఎంపీ ఓఐఎస్ మెయిన్, 50ఎంపీ అల్ట్రావైడ్, 64ఎంపీ టెలిఫోటో సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో డివైజ్ 16ఎంపీ సెల్ఫీ షూటర్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ విషయానికొస్తే.. స్మార్ట్‌ఫోన్ వై-ఫై 7, బ్లూటూత్ 5.4, ఐఆర్ బ్లాస్టర్, టైప్-సి పోర్ట్‌ను అందిస్తుంది. భారత్‌లో ఐక్యూ 12 5జీ ధర స్మార్ట్‌ఫోన్ చైనాలో 3,999 యువాన్ (12జీబీ+256జీబీ) నుంచి ప్రారంభమవుతుంది. అంటే.. భారత కరెన్సీలో దాదాపు రూ. 45,800 వరకు ఉంటుంది. టాప్-ఎండ్ (16జీబీ+1టీబీ) మోడల్ ధర 4,699 యువాన్లు (సుమారు రూ. 55వేలు) ఉండవచ్చు. ఆండ్రాయిడ్ 14 ఆధారిత (OriginOS4)పై ఫోన్ రన్ అవుతుంది.

iQoo 12 5G Amazon India

ఐక్యూ 12లో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ ఉంది. ఇందులో 50ఎంపీ 1/1.3-అంగుళాల ప్రైమరీ సెన్సార్, 100ఎక్స్ డిజిటల్ జూమ్‌తో కూడిన 64ఎంపీ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, అల్ట్రా వైడ్‌తో 50ఎంపీ సెన్సార్, యాంగిల్ లెన్స్ ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్ ఫ్రంట్ కెమెరా 16ఎంపీ సెన్సార్‌తో వస్తుంది. ఐక్యూ 12 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 120డబ్ల్యూతో భారీ బ్యాటరీని అందిస్తుంది. సెక్యూరిటీ విషయానికి వస్తే.. ఈ హ్యాండ్‌సెట్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉండనుంది. ఈ ఫోన్ బరువు 203 గ్రాములు, 163.22ఎమ్ఎమ్ x 75.88ఎమ్ఎమ్ x 8.10ఎమ్ఎమ్ పరిమాణంలో ఉండనుంది.

ఐక్యూ 12 5జీ పూర్తి స్పెషిషికేషన్లు (అంచనా) :

* ఆండ్రాయిడ్ v14
* ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ఫ్రింట్ సెన్సార్
* డిస్‌ప్లే : 6.78 అంగుళాల అమోల్డ్ స్ర్కీన్
* 1260 x 2800 పిక్సెల్స్
* 453 పీపీఐ
* హెచ్‌డీఆర్+, పీ3 కలర్ గేమట్, కర్వడ్ డిస్‌ప్లే, 3000నిట్స్
* 144 హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్
* పంచ్ హోల్ డిస్‌ప్లే
* కెమెరా 64ఎంపీ+ 50ఎంపీ+ 50ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా ఓఐఎస్
* 8కె @ 30ఎఫ్‌పీఎస్ యూహెచ్‌డీ వీడియో రికార్డింగ్
* 16ఎంపీ ఫ్రంట్ కెమెరా
* క్వాల్‌కామ్న్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్3 చిప్‌సెట్
* 3.3 జీహెచ్‌జెడ్, ఆక్టా కోర్ ప్రాసెసర్
* 12జీబీ ర్యామ్+ 8జీబీ వేరియంట్ ర్యామ్
* 256జీబీ ఇన్‌బిల్ట్ మెమరీ
* మెమెరీ కార్డ్ సపోర్టు చేయదు
* కనెక్టవిటీ : 4జీ, 5జీ, వోల్ట్ బ్లూటూత్ వి5.4, వైఫై, ఎన్ఎఫ్‌సీ
* యూఎస్‌బీ-సి వి2.0
* ఐఆర్ బ్లాస్టర్
* బ్యాటరీ
* 5000ఎంఎహెచ్ బ్యాటరీ
* 120డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్
* వైర్‌లెస్ ఛార్జింగ్

Read Also : WhatsApp Voice Chat : వాట్సాప్‌లో గ్రూపు కాల్స్ కోసం వాయిస్ చాట్ ఫీచర్.. ఇదేలా పనిచేస్తుందంటే?