iQOO Series Launch : iQOO లవర్స్‌కు గుడ్ న్యూస్.. భారీ బ్యాటరీ, 2K డిస్‌ప్లేతో ఫోన్లు వచ్చేస్తున్నాయి.. ఫీచర్లు చూస్తే ఫిదానే..!

iQOO Series : ఐక్యూ బ్రాండ్ నుంచి రెండు సరికొత్త ఫోన్లు రానున్నాయి. ఐక్యూ 15, ఐక్యూ నియో 11 సిరీస్ ఫోన్లు 2K డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో అత్యంత ఆకర్షణగా ఉన్నాయి. లీక్ డేటా ప్రకారం.. ఇంకా ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

iQOO 15 and iQOO Neo 11 series

iQOO Series Launch : కొత్త ఫోన్ కొనుగోలు చేసేవారికి గుడ్ న్యూస్.. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఐక్యూ నుంచి రెండు సరికొత్త ఫోన్లు లాంచ్ కానున్నాయి. iQOO 15, iQOO Neo 11 సిరీస్‌లు 2025 చివరి నాటికి లాంచ్ అయ్యే అవకాశం ఉంది. డిస్‌ప్లే , బ్యాటరీ లైఫ్ పర్ఫార్మెన్స్ పరంగా మెయిన్ అప్‌గ్రేడ్‌లతో రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు ప్రీమియం విభాగంలో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Read Also : Motorola Edge 60 : ఖతర్నాక్ ఫీచర్లతో కొత్త మోటోరోలా ఫోన్లు వచ్చేస్తున్నాయి.. లాంచ్‌కు ముందే కీలక స్పెషిఫికేషన్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లలో ఒకటైన ఐక్యూ బ్రాండ్ 2020లో భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పట్లోనే మొబైల్ గేమింగ్‌లో సంచలనం సృష్టించింది. 2025 చివరి నాటికి నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్‌ఫోన్‌లైన ఐక్యూ 15 సిరీస్, ఐక్యూ నియో 11 సిరీస్‌లను లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన చేయనప్పటికీ, ఈ రాబోయే ఫోన్లు డిస్‌ప్లే, క్వాలిటీ, బ్యాటరీ సామర్థ్యంలో భారీ అప్‌గ్రేడ్‌లను తీసుకువస్తాయని లీక్‌లు సూచిస్తున్నాయి.

ఐక్యూ 15, ఐక్యూ నియో 11 ఫీచర్లు (అంచనా) :
ఐక్యూ 15 లైనప్‌కు సంబంధించి లీక్ డేటా ప్రకారం.. ఐక్యూ 15, ఐక్యూ 15 ప్రోతో పాటు ఐక్యూ నియో 11 సిరీస్ కూడా రావొచ్చునని భావిస్తున్నారు. ఇందులో కూడా రెండు వేరియంట్లు ఉండనున్నాయి. ఐక్యూ నియో 11, ఐక్యూ నియో 11 ప్రో అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో 2K డిస్‌ప్లే ఉండనుంది. ఐక్యూ 15, ఐక్యూ నియో 11 సిరీస్‌లు రెండూ 2K రిజల్యూషన్ OLED డిస్‌ప్లేలను కలిగి ఉంటాయని లీక్ డేటా సూచిస్తోంది.

గత వెర్షన్ల కన్నా భారీ అప్‌గ్రేడ్ ఉండే అవకాశం ఉంది. 1.5K రిజల్యూషన్ ప్యానెల్‌లను అందించింది. ముఖ్యంగా ఐక్యూ 15 ప్రో, శాంసంగ్ డిస్‌ప్లే కంపెనీ (SDC) నుంచి తొలగించిన 6.85-అంగుళాల ఎల్టీపీఓ ఓఎల్ఈడీ స్క్రీన్‌ను కలిగి ఉంటుందని అంచనా. అన్‌లాకింగ్ కోసం అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉండవచ్చు. ఫుల్ లైటింగ్ ఉన్నప్పుడు కూడా స్ర్కీన్ కనిపించేందుకు ఏఆర్ (యాంటీ-రిఫ్లెక్టివ్) లేయర్ కూడా ఉంది.

భారీ బ్యాటరీ అప్‌గ్రేడ్‌లు :
రాబోయే ఐక్యూ ఫోన్‌లలో అతిపెద్ద బ్యాటరీ కూడా ఉండనుంది. 7,000mAh బ్యాటరీతో రానున్నాయి. భారత మార్కెట్లో 6,000mAh బ్యాటరీ ఫోన్లు ఉండగా, చైనాలో 6,150mAh వేరియంట్‌ కలిగిన ఐక్యూ 13 మోడల్ కన్నా ఎక్కువగా ఉండవచ్చు.

Read Also : iPhone 16 Price : కొత్త ఐఫోన్ కావాలా? ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16పై అద్భుతమైన డిస్కౌంట్.. ఐఫోన్ 15 ధరకే వచ్చేస్తోంది..!

అదేవిధంగా, ఐక్యూ నియో 11 సిరీస్ 7,000mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుందని భావిస్తున్నారు. ఐక్యూ నియో 10 సిరీస్‌లోని 6,100mAh యూనిట్ స్థానంలో ఉంటుంది. అయితే, ఐక్యూ నియో 11 లైనప్‌లో మెటల్ మిడిల్ ఫ్రేమ్ ఉండకపోవచ్చు. ఈ డిజైన్ కారణంగా ఫోన్ బరువు తగ్గే అవకాశం ఉంది.

పర్ఫార్మెన్స్, కెమెరా అప్‌గ్రేడ్స్ :
లీక్‌ల ప్రకారం.. ఐక్యూ 15 ప్రో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ 2 చిప్‌సెట్‌తో వస్తుందని సూచిస్తున్నాయి. ఫ్లాగ్‌షిప్-లెవల్ పర్ఫార్మెన్స్ అందిస్తుందని పేర్కొంది. అలాగే, మెరుగైన పెరిస్కోప్ జూమ్ కెమెరా డివైజ్ జూమ్, తక్కువ కాంతిలో కూడా అద్భుతమైన ఫొటోగ్రఫీని అందిస్తుంది.