iQOO Neo 10
IQOO నుంచి నియో 10R స్మార్ట్‌ఫోన్ ఈ ఏడాది మార్చిలో భారత్‌లో లాంచ్ అయిన విషయం తెలిసిందే. ఆ స్మార్ట్‌ఫోన్ 6.78-అంగుళాల AMOLED డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 GEN 3 ప్రాసెసర్, 12GB RAM, 120W ఫాస్ట్ ఛార్జింగ్, 6,100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో వచ్చింది.
ఇప్పుడు IQOO నుంచి ఇండియన్ మార్కెట్లో NEO 10 లాంచ్ కానుంది. ఆ కంపెనీ తాజాగా ఎక్స్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ఫస్ట్ లుక్‌ను పోస్ట్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే విడుదల చేస్తామని సూచించింది. రూ.35,000లోపు ఖర్చు చేసి స్మార్ట్‌ఫోన్లను కొనాలనుకుంటున్న వారికి IQOO NEO 10 మంచి ఆప్షన్.
iQOO నియో 10 ఫీచర్లు
డిస్ప్లే: 6.78-అంగుళాల FHD+ 1.5K AMOLED ప్యానెల్, 144Hz రిఫ్రెష్ రేట్, షాట్ డైమండ్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్
పర్ఫార్మన్స్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8s Gen 4 చిప్‌సెట్, ఆప్టిమైజేషన్ కోసం Q1 చిప్‌సెట్, 7K VC లిక్విడ్ కూలింగ్ సిస్టమ్
బ్యాటరీ, ఛార్జింగ్: 7,000 mAh బ్యాటరీ సామర్థ్యం, 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
సాఫ్ట్‌వేర్: ఆండ్రాయిడ్ 15 FunTouch OS 15
రెసిస్టెన్సీ: డస్ట్, వాటర్ రెసిస్టెన్సీ IP65 సర్టిఫికేషన్
కనెక్టివిటీ, పోర్ట: USB 2.0 పోర్ట్, NFC సపోర్ట్, IR బ్లాస్టర్, వైఫై 7 / 6 / 5 సపోర్ట్, బ్లూటూత్ వెర్షన్ 6.0, ఆప్టికల్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్
బ్యాక్ కెమెరాలు: OISతో 50MP సోనీ LYT-600 ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రావైడ్ సెన్సార్
ఫ్రంట్ కెమెరా: 32MP సెల్ఫీ కెమెరా
ధర: ఇండియాలో దాదాపు రూ.35,000