iQOO Z10 Price
iQOO Z10 Price : ఐక్యూ అభిమానులకు గుడ్ న్యూస్.. వచ్చే ఏప్రిల్ 11న భారత మార్కెట్లో ఐక్యూ Z10 ఫోన్ లాంచ్ కానుంది. అయితే, ఈ ఫోన్ లాంచ్‌కు ముందే కంపెనీ డిజైన్, కలర్ ఆప్షన్‌లను రివీల్ చేసింది. ఈ హ్యాండ్‌సెట్ అనేక కీలక ఫీచర్లను కూడా వెల్లడించింది.
ఇప్పుడు, ఐక్యూ స్మార్ట్‌ఫోన్ ధర, చిప్‌సెట్ వివరాలను కూడా అధికారికంగా ప్రకటించింది. ఐక్యూ Z9 అప్‌గ్రేడ్ వెర్షన్ స్నాప్‌డ్రాగన్ 7s జనరేషన్ 3 SoCతో వస్తుంది. మార్చి 2024లో దేశంలో రిలీజ్ అయిన గత మోడల్‌లో కూడా మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్‌సెట్ ఉంది.
భారత్‌లో ఐక్యూ Z10 ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో ఐక్యూ Z10 ఫోన్ ధర రూ. 22వేల కన్నా తక్కువగా ఉంటుందని కంపెనీ (X) పోస్ట్‌లో ధృవీకరించింది. దేశంలో ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ. 22వేల కన్నా తక్కువగా ఉండవచ్చు. రాబోయే స్మార్ట్‌ఫోన్ బేస్ 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 21,999 ఉంటుందని గతంలో లీక్‌లు తెలిపాయి.
🚀 The Undisputed Speed Champion! 🏆
Presenting the Fastest Smartphone in the Segment*—the #iQOOZ10, powered by the Snapdragon 7s Gen3 for unmatched speed and efficiency. Experience breakthrough performance that leaves everything else in the dust! ⚡Launching on 11th April!… pic.twitter.com/0bC0LJ8iJN
— iQOO India (@IqooInd) March 28, 2025
ఈ ఫోన్ 256GB ఆప్షన్‌లో కూడా వస్తుందని భావిస్తున్నారు. ముఖ్యంగా, ఐక్యూ Z9 ఫోన్ భారత మార్కెట్లో 8GB + 128GB, 8GB + 256GB వేరియంట్‌లకు వరుసగా రూ. 19,999, రూ. 21,999 ధరలకు అందుబాటులో ఉన్నాయి.
ఐక్యూ Z10 ఫోన్ ఫీచర్లు :
ఐక్యూ Z10 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7s జనరేషన్ 3 SoC ద్వారా పవర్ పొందుతుంది. 8,20,000 కన్నా ఎక్కువ AnTuTu స్కోరు ఉందని కంపెనీ పేర్కొంది. అత్యంత వేగవంతమైన స్మార్ట్‌ఫోన్‌గా చెప్పవచ్చు. ఐక్యూ Z10 ఏప్రిల్ 11న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. గ్లేసియర్ సిల్వర్, స్టెల్లార్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో రానుంది. అమెజాన్, ఐక్యూ ఇండియా ఇ-స్టోర్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
ఈ ఫోన్ 7.89mm సన్నని ప్రొఫైల్ కలిగి ఉంటుందని కంపెనీ ధృవీకరించింది. గత టీజర్లను పరిశీలిస్తే.. ఐక్యూ Z10 5,000నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ లెవల్‌తో క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని వెల్లడించాయి. 90W ఫ్లాష్‌ఛార్జ్ సపోర్ట్‌తో 7,300mAh బ్యాటరీ సపోర్టు ఉంటుంది. ఈ ఫోన్ 33 నిమిషాల్లో 0 నుంచి 50 శాతం వరకు ఛార్జ్ చేయగలదని బ్రాండ్ పేర్కొంది.