iPhone Whatsapp : ఐఫోన్ యూజర్లకు పండగే.. వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. డిఫాల్ట్ కాలింగ్ యాప్‌గా సెట్ చేయొచ్చు.. ఇదిగో ఇలా..!
iPhone Whatsapp Users : ఆపిల్ ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ సరికొత్త ఫీచర్ అందిస్తోంది. డిఫాల్ట్ యాప్‌లపై మరింత కంట్రోలింగ్ పొందవచ్చు. కాల్స్, మెసేజ్ చేసేందుకు వాట్సాప్ ఎంచుకోవచ్చు.

iPhone Whatsapp
iPhone Whatsapp Users : ఆపిల్ ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. వాట్సాప్‌ను ఐఫోన్ డిఫాల్ట్ కాలింగ్, మెసేజింగ్ యాప్‌గా సెట్ చేసుకునేందుకు యూజర్లకు వీలు కల్పిస్తుంది.
లేటెస్ట్ iOS 18.2 అప్‌డేట్‌తో ఐఫోన్ యూజర్లు ఇప్పుడు కాల్స్ చేసేటప్పుడు లేదా మెసేజ్ పంపేటప్పుడు డిఫాల్ట్ ఫోన్ లేదా మెసేజెస్ యాప్‌కు బదులుగా వాట్సాప్‌ను ఓపెన్ చేయొచ్చు. బ్రౌజింగ్, ఇమెయిల్ పంపేందుకు కూడా ఈ ఫీచర్ వినియోగించుకోవచ్చు.
ఐఫోన్‌లో డిఫాల్ట్ కాలింగ్, మెసేజింగ్ యాప్‌గా వాట్సాప్ :
ఈ కొత్త అప్‌డేట్ (WABetaInfo) ద్వారా మొదట గుర్తించింది. ఐఫోన్ సెట్టింగ్‌లలో డిఫాల్ట్ యాప్ ఆప్షన్ మెనూలో వాట్సాప్ కనిపిస్తుంది. వినియోగదారులు ఇప్పుడు కాలింగ్, మెసేజింగ్ రెండింటికీ వాట్సాప్ ఎంచుకోవచ్చు. రోజువారీ కమ్యూనికేషన్‌కు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.
ఈ ఫీచర్ యాక్టివేట్ చేయాలంటే? :
- యాప్ స్టోర్ నుంచి వాట్సాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేయండి.
- మీ ఐఫోన్‌లో Settings > Apps > డిఫాల్ట్ యాప్‌లకు వెళ్లండి.
- కాల్స్, మెసేజ్‌ల కోసం డిఫాల్ట్‌గా వాట్సాప్ ఎంచుకోండి.
- సెట్ చేసిన తర్వాత కాంటాక్ట్ నంబర్ లేదా మెసేజ్ బటన్‌ను ట్యాప్ చేయాలి.
- ఐఫోన్ బిల్ట్-ఇన్ యాప్‌లకు బదులుగా ఆటోమాటిక్‌గా వాట్సాప్ ఓపెన్ చేయొచ్చు.
ప్రపంచవ్యాప్తంగా ఈ ఫీచర్ అందుబాటులోకి :
ప్రారంభంలో, ఈ ఫీచర్ యూరోపియన్ యూనియన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుందని భావించారు. కానీ, ఆపిల్ ప్రపంచవ్యాప్తంగా అమలులోకి తెచ్చింది. iOS యూజర్లు అల్ట్రానేట్ డిఫాల్ట్ యాప్‌లను ఎంచుకోవచ్చు.
- వెబ్ బ్రౌజింగ్
- ఇ-మెయిల్
- పాస్‌వర్డ్ మేనేజ్‌మెంట్
- పేమెంట్స్ (ఎంపిక చేసిన ప్రాంతాలలో)
- కాల్ ఫిల్టరింగ్
- ఈయూలో ఆపిల్ యూజర్లు డిఫాల్ట్ మ్యాప్స్ యాప్‌ను మార్చుకోవచ్చు.
ఆపిల్ ఐఫోన్ యూజర్లకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కొత్త అప్‌డేట్‌తో ఆపిల్ ఐఫోన్ యూజర్లు తమ డిఫాల్ట్ యాప్‌లపై మరింత కంట్రోల్ పొందవచ్చు. మెసేజ్ చేయడం, కాలింగ్ చేయడం లేదా బ్రౌజింగ్ వంటివి వినియోగదారులకు ఇప్పుడు ఆపిల్ ఇంటర్నల్ యాప్‌లకు మించి మరిన్ని ఆప్షన్లు ఉన్నాయి.