Income Tax Deadline : టాక్స్ పేయర్లు, ఇన్వెస్టర్లకు బిగ్ అలర్ట్.. మార్చి 31 డెడ్‌లైన్ ముగిసేలోగా ఈ 8 పనులను పూర్తి చేయండి..!

Income Tax Deadline : మార్చి 31 డెడ్‌లైన్ దగ్గరపడుతోంది.. ఆర్థికపరమైన లావాదేవీల దగ్గర నుంచి పన్నుచెల్లింపులు, పెట్టుబడులకు సంబంధించి తుది గడువు ముగియనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Income Tax Deadline : టాక్స్ పేయర్లు, ఇన్వెస్టర్లకు బిగ్ అలర్ట్.. మార్చి 31 డెడ్‌లైన్ ముగిసేలోగా ఈ 8 పనులను పూర్తి చేయండి..!

Income Tax Deadline

Updated On : March 29, 2025 / 12:25 PM IST

Income Tax Deadline : పన్నుచెల్లింపుదారులు, పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. మార్చి 31, 2025 డెడ్‌లైన్ సమీపిస్తోంది. సరికొత్త మార్పులు అమలులోకి రానున్నాయి. క్రెడిట్ కార్డ్ యూజర్లు, డిజిటల్ పేమెంట్ కస్టమర్లపై తీవ్ర ప్రభావం పడనుంది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్‌లో పెట్టుబడి పెట్టడానికి ఇదే చివరి అవకాశం. అప్‌డేట్ చేసిన యూపీఐ మొబైల్ నంబర్ వెరిఫికేషన్, సేవింగ్స్, పెట్టుబడులకు సంబంధించి పనులను సకాలంలో పూర్తి చేయాలి.

Read Also : All Banks Open : మార్చి 31న బ్యాంకులు ఓపెన్.. ఈ తేదీల్లో LIC ఆఫీసులు కూడా.. నో హాలీడేస్.. అసలు రీజన్ ఇదే..!

ఇదే సమయంలో అప్‌డేట్ ITR కూడా దాఖలు చేయాలి. మార్చి 31 తర్వాత రిటర్న్‌లను దాఖలు చేస్తే భారీగా జరిమానాలు ఉంటాయి. ప్రముఖ బ్యాంకులు అందించే ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) పథకాలు త్వరలో ముగియనున్నాయి. ఎస్బీఐ కార్డ్ హోల్డర్లు క్రెడిట్ కార్డ్ రివార్డ్‌ బెనిఫిట్స్ సైతం కోల్పోనున్నారు. మార్చి 31లోగా జరగబోయే 8 విషయాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

1. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ ఇన్వెస్ట్‌మెంట్ గడువు :
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకం కింద మహిళలు, బాలికలు మాత్రమే పెట్టుబడి పెట్టడానికి అర్హులు. మైనర్ బాలికల తరపున సంరక్షకులు పెట్టుబడి పెట్టవచ్చు. అకౌంట్ ఓపెన్ చేసేందుకు అవసరమైన కనీస మొత్తం రూ.1,000. గరిష్టంగా పెట్టుబడి ఒక్కో వ్యక్తికి రూ.2 లక్షలు. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్‌లో పెట్టుబడి పెట్టడానికి చివరి తేదీ మార్చి 31, 2025.

2. యూపీఐ నిబంధనల మార్పులు :
యూపీఐ యాప్స్‌లో యూజర్ల యూపీఐ ఐడీని కేటాయించడానికి లేదా అప్‌డేట్ చేసే ముందు సమ్మతిని అడుగుతాయి. డిఫాల్ట్‌గా యూజర్లు ఎంచుకోవాలి. ఈ ఫీచర్‌ యాక్టివ్ ఆప్షన్ ఎంచుకోవాలి. భవిష్యత్తులో యూపీఐ పేమెంట్ సమయంలో గందరగోళాన్ని నివారించవచ్చు.

3. అప్‌డేటడ్ ITR డెడ్‌లైన్ :
అసెస్‌మెంట్ ఇయర్ ముగిసినప్పటి నుంచి రెండు సంవత్సరాలలోపు పన్ను చెల్లింపుదారు అప్‌డేట్ చేసిన రిటర్న్‌ను దాఖలు చేయవచ్చు. అయితే, అదనపు పన్ను బాధ్యత దాఖలు చేసే సమయాన్ని బట్టి మారుతుంది. మార్చి 31, 2025కి ముందు పొడిగించిన వ్యవధిలోని మొదటి 12 నెలల్లోపు దాఖలు చేస్తే పన్ను, వడ్డీలో 25శాతం పడుతుంది. మార్చి 31, 2025 తర్వాత పొడిగించిన వ్యవధిలోని 12 నెలల నుంచి 24 నెలల మధ్య దాఖలు చేస్తే పన్ను, వడ్డీలో 50 శాతం ఉంటుంది.

4. చిన్న పొదుపు పథకాలు.. వడ్డీ రేట్లు మార్పు :
కేంద్ర ప్రభుత్వం ప్రతి త్రైమాసికంలో పోస్ట్ ఆఫీస్ చిన్న పొదుపు పథకం వడ్డీ రేట్లను సవరిస్తుంది. గత డిసెంబర్‌లో జనవరి, మార్చికి వరుసగా నాలుగోసారి రేట్లను మార్చలేదు. ఏప్రిల్, జూన్ నెలలకు తాజా వడ్డీ రేట్లు మార్చి 31, 2025 నాటికి ప్రకటించే అవకాశం ఉంది.

5. మార్చి 31కి ముందే పన్ను ఆదా :
ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి పన్ను చెల్లింపుదారులు మార్చి 31లోపు తమ పన్ను ఆదా పెట్టుబడులు, డిక్లరేషన్లను పూర్తి చేయాలి. సరైన ప్రణాళిక కలిగి ఉంటే పన్ను ఆదా చేసుకోవచ్చు. అయితే, వ్యక్తగత పన్నుచెల్లింపుదారులు కొత్త విధానంలో పన్ను ఆదా పెట్టుబడులకు అర్హులు కారని గమనించాలి.

6. SBI క్రెడిట్ కార్డ్ రివార్డులు :
దేశంలో రెండవ అతిపెద్ద క్రెడిట్ కార్డ్ జారీదారు SBI కార్డ్, క్రెడిట్ కార్డ్‌ల కోసం రివార్డ్ ప్రోగ్రామ్‌లో అనేక సవరణలను ప్రకటించింది. ఏప్రిల్ 1, 2025 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. క్లబ్ విస్తారా SBI క్రెడిట్ కార్డ్‌లు, క్లబ్ విస్తారా ఎస్బీఐ ప్రైమ్ క్రెడిట్ కార్డ్‌లు, (SimplyCLICK) SBI కార్డ్, ఎయిర్ ఇండియా ఎస్బీఐ ప్లాటినం క్రెడిట్ కార్డ్, ఎయిర్ ఇండియా ఎస్బీఐ సిగ్నేచర్ క్రెడిట్ కార్డ్ వంటి పాపులర్ క్రెడిట్ కార్డ్‌లలో కొన్నింటిలో మార్పులు ఉండనున్నాయి.

Read Also : Realme 14 5G : గేమర్లకు గుడ్ న్యూస్.. బైపాస్ ఛార్జింగ్‌తో కొత్త రియల్‌మి 5G ఫోన్.. ఫీచర్లు మాత్రం కెవ్వుకేక.. ధర ఎంతంటే?

7. PM ఇంటర్న్‌షిప్ పథకం (PMIS) గడువు :
పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ (PMIS) అనేది 2024-25 కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్రభుత్వ పథకం. ఈ పథకం కోసం రిజిస్ట్రేషన్ గడువును మార్చి 31, 2025 వరకు పొడిగించారు. ఇంటర్న్‌షిప్ అవకాశాన్ని పొందడానికి మీరు ఈ తేదీకి ముందే మీ దరఖాస్తును పూర్తి చేయాలి. గతంలో, రిజిస్ట్రేషన్ గడువు మార్చి 12, 2025 ఉండగా, మార్చి 31 వరకు పొడిగించారు.

8. స్పెషల్ FD డెడ్‌లైన్స్ :
SBI, IDBI బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, HDFC బ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ వంటి ప్రముఖ బ్యాంకులు పోటీ రేట్లతో స్పెషల్ FD టెన్యూర్లను ప్రవేశపెట్టాయి. ఈ పథకాలు సాధారణ పెట్టుబడిదారులు, సీనియర్ సిటిజన్లు, సూపర్ సీనియర్ సిటిజన్లకు వర్తిస్తాయి. టెన్యూర్, కేటగిరీ ఆధారంగా వేర్వేరు వడ్డీ రేట్లు ఉంటాయి.