Realme 14 5G : గేమర్లకు గుడ్ న్యూస్.. బైపాస్ ఛార్జింగ్‌తో కొత్త రియల్‌మి 5G ఫోన్.. ఫీచర్లు మాత్రం కెవ్వుకేక.. ధర ఎంతంటే?

Realme 14 5G : కొత్త 5జీ ఫోన్ కోసం చూస్తున్నారా? గ్లోబల్ మార్కెట్లో బైపాస్ ఛార్జింగ్ సపోర్టుతో రియల్‌మి 14 5G ఫోన్ వచ్చేసింది. గేమర్ల కోసం స్పెషల్ GT బూస్ట్ మోడ్ ఉంది. ధర ఎంతో తెలుసా?

Realme 14 5G : గేమర్లకు గుడ్ న్యూస్.. బైపాస్ ఛార్జింగ్‌తో కొత్త రియల్‌మి 5G ఫోన్.. ఫీచర్లు మాత్రం కెవ్వుకేక.. ధర ఎంతంటే?

Realme 14 5G With Snapdragon

Updated On : March 29, 2025 / 11:40 AM IST

Realme 14 5G Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? గ్లోబల్ మార్కెట్లోకి రియల్‌మి 14 5G ఫోన్ వచ్చేసింది. ఎంపిక చేసిన మార్కెట్లలోనే ఈ 5G ఫోన్ అందుబాటులో ఉండనుంది. ఈ హ్యాండ్‌సెట్ 12GB ర్యామ్ స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 4 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 45W సూపర్‌వూక్ ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్ సపోర్టుతో 6,000mAh బ్యాటరీతో వస్తుంది.

గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకమైన GT బూస్ట్ మోడ్‌తో వస్తుంది. మృదువైన గేమ్‌ప్లే కోసం 120fps ఫ్రేమ్ రేట్ వరకు సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ 6,050mm² VC లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంది. మెచా డిజైన్ అలాగే హ్యాండ్‌సెట్ ముఖ్య ఫీచర్లు గత ఫిబ్రవరిలో చైనాలో రిలీజ్ అయిన రియల్‌మి నియో 7x హ్యాండ్‌సెట్‌ మాదిరిగానే ఉంటాయి.

Read Also : X ని అమ్మేసిన మస్క్.. తన కంపెనీని తన కంపెనీకే xAIకి విక్రయం.. ఎన్ని లక్షల కోట్ల నష్టం? యూజర్లకి లాభం ఏంటి?

రియల్‌మి 14 5G ధర, కలర్ ఆప్షన్లు :
థాయిలాండ్‌లో రియల్‌మి 14 5G ఫోన్ 12GB + 256GB ఆప్షన్‌ ధర THB 13,999 (సుమారు రూ. 35,300) నుంచి ప్రారంభమవుతుంది. అయితే, 12GB + 512GB వేరియంట్ THB 15,999 (సుమారు రూ. 40,400) వద్ద లిస్ట్ అయింది. దేశంలో లాజాడా, షాపీ, టిక్‌టాక్ షాప్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ మెచా సిల్వర్, స్టార్మ్ టైటానియం, వారియర్ పింక్ ఫినిషింగ్‌లలో అందుబాటులో ఉంటుంది.

రియల్‌మి 14 5G స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
రియల్‌మి 14 5G ఫోన్ 6.67-అంగుళాల Full-HD+ (1,080×2,400 పిక్సెల్స్) అమోల్డ్ స్క్రీన్‌ను 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 240Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్, 2,000 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్ లెవల్, 92.65 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 4SoC ద్వారా 12GB ర్యామ్, 51జీబీ వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 15లో రియల్‌మి యూఐ 6తో అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో రన్ అవుతుంది.

ఆప్టిక్స్ విషయానికొస్తే.. రియల్‌మి 14 5G ఫోన్ f/1.8 అపెర్చర్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో ఏఐ-బ్యాక్డ్ 50MP ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంది. సెకండరీ సెన్సార్, బ్యాక్ సైడ్ LED ఫ్లాష్ యూనిట్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్ f/2.4 అపెర్చర్‌తో 16MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది.

Read Also : All Banks Open : మార్చి 31న బ్యాంకులు ఓపెన్.. ఈ తేదీల్లో LIC ఆఫీసులు కూడా.. నో హాలీడేస్.. అసలు రీజన్ ఇదే..!

రియల్‌మి 14 5G ఫోన్ థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం 6,050mm² VC లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో వస్తుంది. గేమ్‌ప్లే కోసం 120fps వరకు సపోర్టు ఇస్తుంది. మొత్తం గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం ప్రత్యేకమైన జీటీ బూస్ట్ మోడ్‌ను కలిగి ఉందని కంపెనీ తెలిపింది. రియల్‌మి 14 5G ఫోన్ 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది. 45W సూపర్‌వూక్ ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్టు ఇస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ IP66, IP68, IP69 డస్ట్, వాటర్-రెసిస్టెంట్ రేటింగ్‌లతో రానుంది.