X ని అమ్మేసిన మస్క్.. తన కంపెనీని తన కంపెనీకే xAIకి విక్రయం.. ఎన్ని లక్షల కోట్ల నష్టం? యూజర్లకి లాభం ఏంటి?

Elon Musk : ఎలన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xని తన xAI కంపెనీకి 33 బిలియన్ డాలర్ల స్టాక్‌కు విక్రయించారు. ఈ విలీనంతో అడ్వాన్స్ ఏఐ సామర్థ్యాలను ఎక్స్ యూజర్ బేస్‌తో కలిసి అద్భుతాలు చేయొచ్చునని మస్క్ అభిప్రాయపడుతున్నారు.

X ని అమ్మేసిన మస్క్.. తన కంపెనీని తన కంపెనీకే xAIకి విక్రయం.. ఎన్ని లక్షల కోట్ల నష్టం? యూజర్లకి లాభం ఏంటి?

Elon Musk sells X to xAI

Updated On : March 29, 2025 / 10:53 AM IST

Elon Musk : ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలన్ మస్క్ ఏం చేసిన సంచలనమే. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చెప్పలేం. తాజాగా మస్క్ మామ (X)పై మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అప్పట్లో ట్విట్టర్‌ను కొన్నాడు.. (X)గా మార్చేశాడు. ఇప్పుడు సోషల్ మీడియా సైట్ (X) తన సొంత AI కంపెనీ (xAI)కి అమ్మేశాడు. మొత్తం 33 బిలియన్ డాలర్లకు విక్రయించినట్టు మస్క్ వెల్లడించాడు. ఈ డీల్ మొత్తం షేర్లలోనే జరిగింది.

Read Also :  Earthquake Detector : మీ స్మార్ట్‌ఫోన్ భూకంపాలను ముందే పసిగట్టగలదు.. ఈ డిటెక్టర్ ఫీచర్ ఆన్ చేస్తే చాలు.. ఇదేలా పనిచేస్తుందంటే?

XAI సంస్థ కూడా మస్క్ మామదే :
ChatGPTకి పోటీగా గతేడాదిలో మస్క్‌ ‘xAI’ పేరుతో అంకుర సంస్థను ప్రారంభించారు. మస్క్ ఎక్స్ ప్లాట్‌ఫారంను తన నేతృత్వంలోని (xAI)కే విక్రయించాడు. దాంతో ఎక్స్ఏఐ విలువ 80 బిలియన్ డాలర్లుగా ఉంది. మస్క్ కొన్ని ఏళ్ల క్రితం ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత, అతను ఎక్స్‌‌ను ప్రైవేట్ కంపెనీగా మార్చాడు.

ఈ రెండు కంపెనీలు ప్రైవేట్ కావడంతో తన సంపాదన గురించి అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. మస్క్ ఈ సమాచారాన్ని (X)లో పోస్ట్‌లో పేర్కొన్నాడు. xAI అడ్వాన్స్‌డ్ ఏఐ సామర్థ్యాన్ని ఎక్స్ ఇంటిగ్రేట్ చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చునని మస్క్ అభిప్రాయపడ్డారు.

మస్క్ టెస్లా, స్పేస్‌ఎక్స్‌లకు సీఈఓ మాత్రమే కాదు.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సలహాదారు కూడా. 2022లో 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన మస్క్.. ఆ తర్వాత కంపెనీలోని అనేక మంది ఉద్యోగులను తొలగించాడు. దాంతో పాటు, ద్వేషపూరిత ప్రసంగం, తప్పుడు సమాచారం, వినియోగదారు ధృవీకరణకు సంబంధించిన రూల్స్ కూడా మార్చేశాడు. 2023లో xAI కంపెనీని మస్క్ ప్రారంభించాడు.

యూజర్లకు కలిగే ప్రయోజనం ఏంటి? :
xAI, X భవిష్యత్తు ఒకదానితో ఒకటి ముడిపడి ఉందని మస్క్ చెబుతున్నారు. డేటా, మోడల్స్, కంప్యూటింగ్ పవర్, సప్లయ్, ప్రతిభను ఒకేచోట కలిపేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ కలయికతో xAI ఏఐ సామర్థ్యాలను ఎక్స్ పెద్ద నెట్‌వర్క్‌ను కలపడం ద్వారా అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చునని చెబుతున్నారు.

ఇకపై ఈ రెండు కంపెనీలు కలిసి పనిచేస్తాయి. ఓపెన్‌ఏఐతో పోటీ పడనున్నాయి. దాంతో యూజర్లకు మెరుగైన సౌకర్యాలు లభిస్తాయి. ఈ కంపెనీ బిలియన్ల మంది ప్రజలకు మెరుగైన, ఉపయోగకరమైన అనుభూతిని అందిస్తుందని మస్క్ చెప్పుకొస్తున్నారు. అందులో నిజాన్ని వెతకడంతో పాటు మరింత జ్ఞానాన్ని పెంచుకోవచ్చనని మస్క్ రాసుకొచ్చారు.

Read Also : Motorola Edge 60 Pro : పిచ్చెక్కించే ఫీచర్లతో కొత్త మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో.. 4 క్రేజీ కెమెరాలు.. లాంచ్‌కు ముందే ధర ఎంతో తెలిసిందోచ్!

నివేదికల ప్రకారం.. xAI, Grok చాట్‌బాట్ ఇప్పటికే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో విలీనం అయ్యాయి. టెస్లా సీఈఓ ఎలాంటి మార్పులను ప్రకటించలేదు. ఎక్స్ యూజర్లపై లాభం ఉంటుందో లేదో స్పష్టంగా చెప్పలేదు. xAI ఇప్పటికే ఏఐ మోడల్స్ ట్రైనింగ్ ఇచ్చేందుకు (X) యూజర్ల పోస్ట్‌ల నుంచి డేటాను ఉపయోగిస్తుంది. ప్రీమియం ఎక్స్ యూజర్లకు ఏఐ చాట్‌బాట్, గ్రోక్‌కు యాక్సెస్ లభిస్తుంది అంతే..

డోజ్ (DOGE) నుంచి వైదొలగనున్న మస్క్ :
అమెరికా లోటులో ఒక ట్రిలియన్ డాలర్ల భారీ తగ్గింపును పర్యవేక్షించిన తర్వాత మే నెలాఖరులో ప్రభుత్వ సంబంధిత (DOGE) బ్రాంచ్‌లో తన పదవి నుంచి వైదొలగాలని మస్క్ ప్రకటించారు. డోజ్ అధినేతగా ప్రభుత్వ ఖర్చు తగ్గించే ప్రయత్నాలకు మస్క్ నాయకత్వం వహిస్తున్నారు.