Earthquake Detector : మీ స్మార్ట్‌ఫోన్ భూకంపాలను ముందే పసిగట్టగలదు.. ఈ డిటెక్టర్ ఫీచర్ ఆన్ చేస్తే చాలు.. ఇదేలా పనిచేస్తుందంటే?

Earthquake Detector Feature : భూకంపాలను ముందే మీరు పసిగట్టేయొచ్చు. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ ఫీచర్‌ ఆన్ చేస్తే చాలు.. ఆండ్రాయిడ్ యూజర్లు ప్రకృతి వైపరీత్యాల కన్నా ఒక అడుగు ముందుండవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో తమను తాము రక్షించుకోవచ్చు.

Earthquake Detector : మీ స్మార్ట్‌ఫోన్ భూకంపాలను ముందే పసిగట్టగలదు.. ఈ డిటెక్టర్ ఫీచర్ ఆన్ చేస్తే చాలు.. ఇదేలా పనిచేస్తుందంటే?

Earthquake Detector Feature

Updated On : March 28, 2025 / 6:01 PM IST

Earthquake Detector Feature : భూకంపాలు అనేవి ఆకస్మాత్తుగా సంభవిస్తుంటాయి. సాధారణ ప్రజలు ఈ భూకంపాలను ముందుగా పసిగట్టలేరు. అయితే, భూకంపం గురించి ముందుగానే సమాచారం తెలుసుకోవచ్చు. మీ చేతిలో స్మార్ట్‌ఫోన్ ద్వారా రాబోయే భూకంపాన్ని ముందే పసిగట్టేయొచ్చు.

మీరు చేయాల్సిందిల్లా.. మీ స్మార్ట్ ఫోన్ల సెట్టింగ్స్‌లో దాగిన అలర్ట్ ఫీచర్ ఎనేబుల్ చేయడమే.. ఈ డిటెక్టర్ ఫీచర్‌ను ఆన్ చేయడం ద్వారా ఆండ్రాయిడ్ యూజర్లు ప్రకృతి వైపరీత్యాల కన్నా ఒక అడుగు ముందుండవచ్చు. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో తమను తాము రక్షించుకోవచ్చు.

Read Also : Air Coolers Sale : కొత్త కూలర్ కొంటున్నారా? అమెజాన్‌లో టాప్ 5 కూలర్లపై ఖతర్నాక్ డిస్కౌంట్లు.. ధరలు పెరిగేలోగా కొనేసుకోండి!

ఈశాన్య భారత్, థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్, కాఠ్మాండ్, మియన్మార్‌లలో 7.7 తీవ్రతతో కూడిన అతిపెద్ద భూకంపం సంభవించింది. మోనివా నగరానికి తూర్పున 50 కిలోమీటర్ల దూరంలోని 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే గుర్తించింది.

అయితే, ఈ భారీ భూకంపం 2004 నాటి వినాశకరమైన విపత్తును మళ్లీ గుర్తుకుతెస్తోంది. మేఘాలయ, గౌహతి, కోల్‌కతాతో సహా భారత్‌లోని అనేక రాష్ట్రాలలో కూడా ఈ భూప్రకంపనలు సంభవించాయి. భూకంపాలు తరచుగా సంభవిస్తుంటాయి. భూకంపం సమయంలో వినియోగదారులను వెంటనే అప్రమత్తం చేసేందుకు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం గూగుల్ భూకంప డిటెక్టర్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.

గూగుల్ భూకంప డిటెక్టర్ ఫీచర్ :
ముందస్తు భూకంప హెచ్చరికలను తెలుసుకోవడానికి గూగుల్ ఆండ్రాయిడ్ 15లో భూకంప డిటెక్టర్‌ను ఇంటిగ్రేట్ చేసింది. భారత్ సహా అనేక దేశాలలో ఆండ్రాయిడ్ భూకంప హెచ్చరికల వ్యవస్థ (Android Earthquake Alerts System)లో ఈ డిటెక్టర్ ఫీచర్ అందుబాటులో ఉంది.

ఒకసారి ఈ ఫీచర్ ఎనేబుల్ చేసిన తర్వాత వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లలో రియల్-టైమ్ భూకంప హెచ్చరికలను అందుకుంటారు. భూకంపానికి ముందే తక్షణ జాగ్రత్తలు తీసుకోవచ్చు. అయితే, ఈ వార్నింగ్ ఫీచర్ కేవలం అధిక తీవ్రత కలిగిన భూకంపాలను మాత్రమే అలర్ట్ చేస్తుంది. తక్కువ-తీవ్రత కలిగిన భూప్రకంపనల గురించి యూజర్లకు అలర్ట్ చేయలేదని గమనించాలి.

మీ స్మార్ట్‌ఫోన్‌ సపోర్టు చేస్తుందో లేదో చెక్ చేయండి :
ఈ ఫీచర్‌ని యాక్టివేట్ చేసేందుకు ఇలా ప్రయత్నించండి.
కంప్యాటబిలిటీ (Compatibility) చెక్ చేయండి.
మీ స్మార్ట్‌ఫోన్ Android 15 రన్ అవుతుందా? లేదో చెక్ చేసుకోండి.
ఈ అప్‌డేట్ Google Pixel, Samsung, OnePlus వంటి ఎంపిక చేసిన ఫోన్లలో మాత్రమే అందుబాటులో ఉంది.

భూకంపం అలర్ట్స్ (Earthquake Alerts) ఎలా ఎనేబుల్ చేయాలంటే? :

మీ ఫోన్‌లో సెట్టింగ్స్ (Settings) ఓపెన్ చేయండి.
సేఫ్టీ & ఎమర్జెన్సీ (Saftey & Emergency) ఆప్షన్ ట్యాప్ చేయండి.
భూకంప అలర్ట్స్ (Earthquake Alerts) ఆప్షన్ ఎంచుకోండి.
ఫీచర్‌ను యాక్టివేట్ చేసేందుకు Toggle టర్న్ ఆన్ చేయండి.

ఇదేలా పనిచేస్తుందంటే? :
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు సీస్మోమీటర్ (భూకంప గుర్తింపు యంత్రం) మాదిరిగా పనిచేసే యాక్సిలరోమీటర్ సెన్సార్‌తో అమర్చి ఉంటాయి. భూకంప కంపనాలను గుర్తించినప్పుడు భూకంపం తీవ్రత, అది ఏర్పడిన స్థానాన్ని డిస్‌ప్లేలో చూపిస్తూ యూజర్లను వెంటనే హెచ్చరికను పంపుతుంది.

Read Also : UPI Payments Offline : ఇంటర్నెట్‌తో పనిలేదు.. ఇక ఆఫ్‌లైన్‌‌లోనూ UPI పేమెంట్లు చేయొచ్చు తెలుసా? ఈ సింపుల్ ప్రాసెస్ ట్రై చేయండి..!

భూకంప తరంగాల కన్నా ఇంటర్నెట్ సిగ్నల్స్ వేగంగా ప్రయాణిస్తాయని గూగుల్ చెబుతోంది. వినియోగదారులు ప్రకంపనలు తీవ్రతరం అయ్యే ముందే హెచ్చరికలను అందుకుంటారు. ఈ ముందస్తు హెచ్చరిక వ్యవస్థతో ప్రజలు సురక్షితమైన ప్రదేశాలకు వెళ్లి తమ ప్రాణాలను కాపాడుకోవచ్చు.