UPI Payments Offline : ఇంటర్నెట్‌తో పనిలేదు.. ఇక ఆఫ్‌లైన్‌లోనూ UPI పేమెంట్లు చేయొచ్చు తెలుసా? ఈ సింపుల్ ప్రాసెస్ ట్రై చేయండి..!
UPI Payments Offline : యూపీఐ పేమెంట్లను ఆఫ్‌లైన్‌లో ఎలా చేయాలో తెలుసా? ఇంటర్నెట్ కనెక్టివిటీ లేని ప్రాంతాల్లో చాలా ఈజీగా యూపీఐ పేమెంట్లను పూర్తి చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

UPI Payments Offline
UPI Payments Offline : యూపీఐ పేమెంట్లు చేస్తున్నారా? యూపీఐ పేమెంట్లను ఆన్ లైన్‌లో మాత్రమే కాదు.. ఆఫ్‌లైన్‌లో కూడా లావాదేవీలను పూర్తి చేయొచ్చు. యూపీఐ పేమెంట్లను అత్యంత వేగంగా పూర్తి చేయాలంటే తప్పనిసరిగా ఇంటర్నెట్ కనెక్టవిటీ ఉండాల్సిందే. సాధారణంగా యూపీఐ పేమెంట్లను నెట్‌వర్క్-తక్కువ ప్రాంతంలో చేయడం కష్టం.
Read Also : DA Salary Hike : కేంద్రం గుడ్ న్యూస్.. DA 2శాతం పెంపు.. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతం ఎంత పెరగనుందంటే?
అత్యవసర సమయాల్లో ఇలాంటి ప్రాంతాల్లో యూపీఐ పేమెంట్లు చేసేందుకు వీలుంది. నెట్‌వర్క్ డేటా లేదా వైఫై లేకుండా ఇంటర్నెట్ లేకుండా యూపీఐ పేమెంట్ చేసేందుకు మరో పద్ధతి ఉంది. యూపీఐ పేమెంట్ ఆఫ్‌లైన్ మోడ్ మొబైల్ డేటా లేదా వైఫై లేకుండా కూడా లావాదేవీలను పూర్తి చేసేందుకు అనుమతిస్తుంది. ఇంతకీ ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది? యూపీఐ పేమెంట్లను ఆఫ్‌లైన్‌లో ఎలా చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఇంటర్నెట్ లేకుండా యూపీఐ పేమెంట్స్ ఎలా? :
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రవేశపెట్టిన *99# సౌకర్యం ద్వారా UPI ఇంటర్నెట్ లావాదేవీలు సాధ్యమే. ఈ సౌకర్యం USSD (అన్‌స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా) ద్వారా అందిస్తోంది.
తద్వారా వినియోగదారులు తమ ఫోన్‌ల నుంచి నేరుగా బ్యాంకింగ్ సర్వీసులను పొందవచ్చు. సాధారణ యూపీఐ యాప్‌లకు భిన్నంగా ఈ సౌకర్యానికి స్మార్ట్‌ఫోన్ లేదా ఇంటర్నెట్ కనెక్టివిటీ అవసరం లేదు. అన్ని మొబైల్ నెట్‌వర్క్‌లలో యాక్టివేట్ అయి ఉంటుంది. బ్యాలెన్స్‌లను చెక్ చేసేందుకు ఫండ్ ట్రాన్స్‌ఫర్ చేసేందుకు యూపీఐ పిన్‌లను సెట్ చేయడం లేదా రికవరీ చేసేందుకు ఉపయోగించవచ్చు.
UPI పేమెంట్లను ఆఫ్‌లైన్‌లో ఎలా చేయాలంటే? :
ఆఫ్‌లైన్ యూపీఐ పేమెంట్ ప్రాసెస్ చాలా సులభంగా ఉంటుంది. ఆఫ్‌లైన్‌లో లావాదేవీ కోసం ఈ కింది విషయాలను పాటించాలి.
- మొబైల్ ఫోన్ డయల్ ప్యాడ్ ఓపెన్ చేసి *99# అని టైప్ చేయండి.
- ఇచ్చిన ఆప్షన్ల నుంచి మీకు నచ్చిన లాంగ్వేజీ ఎంచుకోండి.
- మెను నుంచి ‘Send Money’పై ట్యాప్ చేయండి.
- రిసీవర్ (UPI ID), మొబైల్ నంబర్ లేదా బ్యాంక్ అకౌంట్ టైప్ చేయండి.
- మీరు పంపాల్సిన మొత్తం అమౌంట్ ఎంతో టైప్ చేయండి.
- యూపీఐ పిన్‌ను ఎంటర్ చేయడం ద్వారా లావాదేవీని వెరిఫై చేసుకోండి.
సాధారణ యూపీఐ మాదిరిగానే పేమెంట్ వెంటనే పూర్తి అవుతుంది. ఇది ఫీచర్ ఫోన్‌లో అయినా లేదా స్మార్ట్‌ఫోన్‌లో అయినా ఒకేమాదిరిగా వేగంగా ట్రాన్సాక్షన్లను పూర్తి చేయొచ్చు.
ఆఫ్‌లైన్ UPI ట్రాన్సాక్షన్ బెనిఫిట్స్ ఇవే :
డిజిటల్ పేమెంట్లు అందరికీ అందుబాటులోకి ఉంటాయి. ఆఫ్‌లైన్ యూపీఐ లావాదేవీలతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
ఆఫ్‌లైన్‌లో యూపీఐ : మొబైల్ డేటా లేదా వైఫై లేకుండా డబ్బును ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. డేటా కనెక్టివిటీ తక్కువగా ఉన్న చోట ప్రయోజనకరంగా ఉంటుంది.
ఫీచర్ ఫోన్లలో వర్కింగ్ : అందరూ స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించరు. కానీ, ఈ ఫీచర్ సాధారణ సెల్ ఫోన్‌లలో కూడా అందుబాటులో ఉంది.
సేఫ్ ట్రాన్సాక్షన్లు : పేమెంట్ యూపీఐ పిన్ ద్వారా జరుగుతుంది. భద్రత విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు.
సింపుల్ క్విక్ పేమెంట్లు : ఒక సాధారణ లావాదేవీ కోసం ఏ యాప్‌లోకి లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు.
ఇంటర్నెట్ కనెక్టివిటీ లేని గ్రామీణ ప్రాంతాల్లో ప్రయోజనకరంగా ఉంటుంది. నెట్‌వర్క్ ఫెయిల్యూర్ సమయంలో కూడా సాయపడుతుంది. పేమెంట్లు వేగంగా చేసేందుకు వీలు కల్పిస్తుంది.
ఆఫ్‌లైన్ యూపీఐ పేమెంట్స్ లిమిట్స్ :
ఈ ప్రక్రియలో కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి.
ట్రాన్సాక్షన్ లిమిట్ : ఒకే లావాదేవీకి పరిమితి రూ. 5వేలు
ఛార్జీలు : USSD ఆధారిత సేవలకు కొన్ని బ్యాంకులు తక్కువ మొత్తంలో ఛార్జీని విధించవచ్చు.
మొబైల్ బ్యాలెన్స్ తప్పనిసరి : ఈ సర్వీసు USSD ద్వారా పొందవచ్చు. తక్కువ మొబైల్ బ్యాలెన్స్ అవసరం కావచ్చు. పరిమితులు ఉన్నప్పటికీ, ఇంటర్నెట్ కనెక్షన్ అందుబాటులో లేనప్పుడు చెల్లింపులకు *99# సౌకర్యం బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.