Samsung Galaxy A Series : కొత్త స్మార్ట్‌ఫోన్ కావాలా? AI ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ A సిరీస్ 5G ఫోన్లు మీకోసం.. ఓసారి లుక్కేయండి!

Samsung Galaxy A Series : శాంసంగ్ గెలాక్సీ A56, A36, A26 స్మార్ట్‌ఫోన్లు గ్లోబల్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ 5G ఫోన్లు ఫీచర్లు, ధర వివరాలను ఓసారి పరిశీలిద్దాం..

Samsung Galaxy A Series : కొత్త స్మార్ట్‌ఫోన్ కావాలా? AI ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ A సిరీస్ 5G ఫోన్లు మీకోసం.. ఓసారి లుక్కేయండి!

Samsung Galaxy A Series

Updated On : March 28, 2025 / 4:47 PM IST

Samsung Galaxy A Series : శాంసంగ్ అభిమానులకు గుడ్ న్యూస్.. ప్రపంచ మార్కెట్లోకి శాంసంగ్ గెలాక్సీ A సిరీస్ ఫోన్లు అందుబాటులోకి వచ్చేశాయి. శాంసంగ్ గెలాక్సీ A సిరీస్ కొత్త ఫోన్లలో గెలాక్సీ A56 5G, గెలాక్సీ A36, గెలాక్సీ A 26 వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌత్ కొరియన్ బ్రాండ్ ఫోన్‌ల కెమెరా పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉన్నాయి.

కెమెరా ఫొటోల క్వాలిటీని పెంచే అనేక ఏఐ ఫీచర్లు ఉన్నాయి. ఈ శాంసంగ్ 5G ఫోన్ కొత్త కెమెరా ఫీచర్లలో ఆబ్జెక్ట్ ఎరేజర్‌ ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు. శాంసంగ్ A26లో అత్యుత్తమ ఫేస్ డిటెక్టర్ ఫీచర్ కూడా ఉంది. కెమెరా ఎల్లప్పుడూ కచ్చితమైన ఫొటోలను క్యాప్చర్ చేస్తుంది. ఈ మూడు వేరియంట్లలో మీకు నచ్చిన శాంసంగ్ 5G ఫోన్ కొనేసుకోవచ్చు.

Read Also : Air Coolers Sale : కొత్త కూలర్ కొంటున్నారా? అమెజాన్‌లో టాప్ 5 కూలర్లపై ఖతర్నాక్ డిస్కౌంట్లు.. ధరలు పెరిగేలోగా కొనేసుకోండి!

శాంసంగ్ గెలాక్సీ A56 5G :
శాంసంగ్ గెలాక్సీ A56 5జీ ఫోన్ 13MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంది. బ్యాక్ కెమెరా మాడ్యూల్‌లో 12MP అల్ట్రా-వైడ్ కెమెరా, 50MP వైడ్ యాంగిల్ కెమెరా, అలాగే 5MP మాక్రో కెమెరా ఉన్నాయి. మీరు గేమింగ్ చేస్తున్నా, స్ట్రీమింగ్ చేస్తున్నా లేదా ఫోన్‌ను ఉపయోగిస్తున్నా సరే.. అత్యంత ఆప్టిమమ్ పర్ఫార్మెన్స్ పొందేలా ఆక్టా కోర్ ప్రాసెసర్ కలిగి ఉంది.

అంతకు మించి, ఫోన్ స్ప్లాష్-ప్రూఫ్ సెక్యూరిటీ కోసం IP67 రేటింగ్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. 256GB, 12GB వేరియంట్ ఫోన్ ధర రూ. 44,999గా ఉంటే.. 8GB వేరియంట్ ధర దాదాపు రూ. 41,999 నుంచి అందుబాటులో ఉంటుంది.

శాంసంగ్ గెలాక్సీ A36 5G :
శాంసంగ్ A36 5G ఆక్టా కోర్ ప్రాసెసర్ ద్వారా పవర్ అందిస్తుంది. CPU, GPU టాక్సులతో పాటు కూలింగ్ కోసం 15శాతం బిగ్ స్టీమ్ రూం కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌లోని కెమెరా సెటప్‌లో 12MP సెల్ఫీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ సెన్సార్, 50MP వైడ్-యాంగిల్ సెన్సార్ ఉన్నాయి. అలాగే మాక్రో 5MP సెన్సార్ ఉన్నాయి. ఈ గెలాక్సీ 5G ఫోన్లలో (256GB+ 12GB) వేరియంట్ ధర రూ. 35,999కు లభ్యమవుతున్నాయి.

శాంసంగ్ గెలాక్సీ A26 5G :
ఈ ఫోన్‌లో 8MP అల్ట్రా వైడ్ కెమెరా యాంగిల్ కలిగి ఉంది. 50MP వైడ్ ఏంజెల్ కెమెరాతో పాటు 2MP మాక్రో కూడా ఉన్నాయి. ఈ ఫోన్‌లో అమర్చిన బ్యాటరీ 5000mAh యూనిట్ ఉండగా, ఎక్సినోస్ 1380 (గ్లోబల్ స్పెక్)తో 17 గంటల వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుంది. ఈ 5జీ ఫోన్ డిస్‌ప్లే దాదాపు 6.7 అంగుళాలు. ఈ ఫోన్ 256GB, 8GB వేరియంట్ ధర రూ. 27,999కు లభిస్తోంది.

మీరు ఈ ధరల శ్రేణిలో కొత్త ఫోన్‌లను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే.. శాంసంగ్ గెలాక్సీ A26 5Gకి బదులుగా మీరు రూ. 24,999 ధర వద్ద నథింగ్ ఫోన్ 3a (128GB) వేరియంట్‌ను ఎంచుకోవచ్చు. మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ (256GB) వేరియంట్‌ను రూ. 22,999 ధర వద్ద కొనుగోలు చేయొచ్చు.

Read Also : DA Salary Hike : కేంద్రం గుడ్ న్యూస్.. DA 2శాతం పెంపు.. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతం ఎంత పెరగనుందంటే?

మీరు శాంసంగ్ A56 కొనాలంటే.. గత ఏడాది ఫ్లాగ్‌షిప్‌లైన గూగుల్ పిక్సెల్ 8a (128GB) స్టోరేజ్‌తో రూ. 37,999కి అందిస్తోంది. మీరు రూ. 52,999 ధర వద్ద పిక్సెల్ 8 ఎంచుకోవచ్చు. మీరు శాంసంగ్ గెలాక్సీ A36 కొనుగోలు చేయాలంటే రూ. 31,999 ధర వద్ద నథింగ్ ఫోన్ 3a ప్రో లేదా నార్డ్ 4 5G (256GB) ఇంటర్నల్ స్టోరేజ్ లేదా పాత పిక్సెల్ 7a కూడా రూ. 30,249 ధర వద్ద ఎంచుకోవచ్చు.