Air Coolers Sale : కొత్త కూలర్ కొంటున్నారా? అమెజాన్‌లో టాప్ 5 కూలర్లపై ఖతర్నాక్ డిస్కౌంట్లు.. ధరలు పెరిగేలోగా కొనేసుకోండి!
Air Coolers Sale : కొత్త కూలర్ కోసం చూస్తున్నారా? అమెజాన్ ప్రైమ్ షాపింగ్ డేస్ సందర్భంగా ఎయిర్ కూలర్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ధరలు పెరిగేలోగా ఇప్పుడే కూలర్ కొనేసుకోండి.

Air Coolers Sale
Air Coolers Sale : అసలే ఎండకాలం.. ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఉక్కపోతలతో ఇంట్లో కూలర్ లేకుండా ఉండలేని పరిస్థితి. ఇళ్లంతా చల్లగా ఉండాలంటే ఎయిర్ కూలర్ ఇంట్లో ఉండాల్సిందే. మీరు కూడా కొత్త ఎయిర్ కూలర్ కోసం చూస్తున్నారా? ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ షాపింగ్ డేస్ (Amazon Prime Shopping Days)లో డిస్కౌంట్ ధరలకు ఎయిర్ కూలర్లు లభ్యమవుతున్నాయి.
Read Also : Poco F7 Ultra : గేమర్లకు పండగే.. పోకో F7 అల్ట్రా ఫోన్ కేక.. ఫీచర్లు కోసమైనా కొనేసుకోవచ్చు..!
ఇందులో మీకోసం 5 బెస్ట్ సెల్లింగ్ ఎయిర్ కూలర్లను మీకోసం అందిస్తున్నాం. ప్రస్తుతానికి ఎయిర్ కూలర్ల ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎండలు పెరిగే కొద్ది ఎయిర్ కూలర్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. మీకు నచ్చిన ఎయిర్ కూలర్లను ఎంచుకుని ఇంటికి కొని తెచ్చుకోండి.
బజాజ్ PX97 టార్క్ కొత్త 36L పర్సనల్ ఎయిర్ కూలర్ :
ఈ బజాజ్ పర్సనల్ ఎయిర్ కూలర్ 36-లీటర్ అద్భుతమైన కెపాసిటీ కలిగి ఉంది. 30 అడుగుల వరకు ఎయిర్ కూలింగ్ అందిస్తుంది. ఇందులో హై-స్పీడ్ మోటారును కలిగి ఉంది. చల్లని గాలి కోసం మూడు-స్పీడ్ కంట్రోలర్లు, యాంటీ బాక్టీరియల్ హెక్సాకూల్ టెక్నాలజీ ప్యాడ్‌లతో వస్తుంది. ఇన్వర్టర్ సపోర్టు కూడా కలిగి ఉంది. అంటే.. విద్యుత్తు అంతరాయం సమయంలో కూడా ఈ కూలర్ ఆపరేట్ చేయవచ్చు. మొత్తం మీద 3 ఏళ్ల వారంటీతో వస్తుంది.
ఓరియంట్ ఎలక్ట్రిక్ డ్యూరాచిల్ 40 L పోర్టబుల్ ఎయిర్ కూలర్ :
ఓరియంట్ డ్యూరాచిల్ ఎయిర్ కూలర్ 40-లీటర్ సామర్థ్యం కలిగి ఉంటుంది. పోర్టబుల్‌గా ఉంటుంది. ఇన్వర్టర్ కంపాటబిలిటీ కలిగి ఉంటుంది. నీటి కోసం లెవల్ ఇండికేటర్, గది నుంచి గదికి సులభంగా పోర్టబిలిటీ చేసేలా కాస్టర్ వీల్స్‌తో వస్తుంది. వైట్, గ్రే కలర్ కాంబినేషన్ కలిగి ఉంది. ఈ కూలర్ చిన్న గదులకు బెస్ట్. అద్భుతమైన కూలింగ్ అందిస్తుంది.
క్రాంప్టన్ ఆప్టిమస్ 100లీటర్ల డెజర్ట్ ఎయిర్ కూలర్ :
పెద్ద గదుల్లో క్రాంప్టన్ ఆప్టిమస్ డెజర్ట్ ఎయిర్ కూలర్ 100-లీటర్ల అధిక సామర్థ్యాన్ని అందిస్తుంది. మెరుగైన కూలింగ్ పర్ఫార్మెన్స్ కోసం ఐస్ చాంబర్‌ను కలిగి ఉంది. ఎయిర్ కండిషనర్లకు సమానమైన గాలిని అందిస్తుంది. ఈ కూలర్ తేమను కలిగి ఉండి సమర్థవంతంగా పనిచేస్తుంది. వేడి తేమతో కూడిన వాతావరణంలో కూడా మంచి కూలింగ్ అందిస్తుంది. మోటార్ ఓవర్‌లోడ్ ప్రొటెక్టర్ కూడా ఉంది. ఒక ఏడాది వారంటీతో వస్తుంది.
సింఫనీ హైఫ్లో 40 పర్సనల్ ఎయిర్ కూలర్ :
సింఫనీ హైఫ్లో 40 అనేది వ్యక్తిగత ఎయిర్ కూలర్. హై పవర్ బ్లోవర్, ఐ-ప్యూర్ టెక్నాలజీతో వస్తుంది. గదిలో గాలిని వేగంగా క్లీన్ చేస్తుంది. 40 లీటర్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది. మిడ్ రేంజ్ గదికి బెస్ట్ ఆప్షన్. తక్కువ విద్యుత్ వినియోగంతో అద్భుతమైన కూలింగ్ అందిస్తుంది.
ఓరియంట్ ఎలక్ట్రిక్ ఏరోస్టార్మ్ 92L డెజర్ట్ ఎయిర్ కూలర్ :
ఓరియంట్ ఎలక్ట్రిక్ ఏరోస్టార్మ్ 92-లీటర్ల సామర్థ్యాన్ని అందిస్తుంది. ఇంటి గదిని కూలింగ్ చేసే ఆటో-ఫిల్ ఫీచర్‌ను కలిగి ఉంది. ఇన్వర్టర్-సపోర్టు చేస్తుంది. కరెంట్ లేని సమయంలో కూడా కూలింగ్ ఇస్తూనే ఉంటుంది. ఈ కూలర్ ఎయిర్‌ను 25శాతం వేగంగా అందిస్తుంది. సాధారణ మోడళ్ల కన్నా తక్కువ నీటిని ఉపయోగిస్తుంది. కాలుష్య కారకాలు ప్రవేశించకుండా గాలిని మరింత క్లీన్ ఉంచేందుకు డస్ట్ ఫిల్టర్‌తో కూడా వస్తుంది.
అమెజాన్ ప్రైమ్ షాపింగ్ డేస్ :
ఈ ఎయిర్ కూలర్లు ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ షాపింగ్ డేస్‌లో 45శాతం వరకు తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు.. బజాజ్ PX97 టార్క్ ధర రూ.5,999కు అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.9,050 ఉండగా.. 34శాతం డిస్కౌంట్ అందిస్తోంది.
ఓరియంట్ ఎలక్ట్రిక్ డ్యూరాచిల్‌ను కూడా రూ.6,099కి కొనుగోలు చేయవచ్చు. గతంలో దీని ధర రూ.10,490కు పైగా ఉంది. ఇప్పుడు 42శాతం డిస్కౌంట్ అందిస్తోంది. క్వాలిటీ ఎయిర్ కూలర్‌ను తగ్గింపు ధరకు కొనుగోలు చేయొచ్చు.