iQOO Z10R Launch : ఐక్యూ లవర్స్ కోసం కొత్త ఫోన్.. ఐక్యూ Z10R వచ్చేస్తోందోచ్.. ధర, స్పెసిఫికేషన్లపై అంచనాలివే..!

iQOO Z10R Launch : భారత మార్కెట్లోకి ఐక్యూ నుంచి సరికొత్త ఫోన్ రాబోతుంది. ఐక్యూ Z10R లాంచ్ కానుంది.. ధర, ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి..

iQOO Z10R Launch

iQOO Z10R Launch : ఐక్యూ అభిమానుల కోసం సరికొత్త ఫోన్ రాబోతుంది. ఐక్యూ ఇండియా కంపెనీ ఐక్యూ Z10 సిరీస్‌ను తీసుకొస్తోంది. భారత మార్కెట్లో ఐక్యూ Z10R పేరుతో (iQOO Z10R Launch) కొత్త హెడ్‌సెట్‌ లాంచ్ చేయనుంది. ఈ మేరకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. లీక్‌ల ప్రకారం పరిశీలిస్తే.. ఇప్పటికే ఐక్యూ Z10R ఫస్ట్ లుక్ వెల్లడైంది.

రాబోయే మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ కర్వ్డ్ స్క్రీన్, డ్యూయల్ కెమెరా సెటప్, సిగ్నేచర్ ఆరా లైట్లు, 4K రికార్డింగ్ సామర్థ్యాలతో రానుంది. కచ్చితమైన లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్లు, ధర వివరాలు ప్రస్తుతానికి రివీల్ చేయలేదు. ఈ ఐక్యూ ఫోన్ గతంలో గీక్‌బెంచ్ జాబితాలో మోడల్ నంబర్ వివో I2410తో కనిపించింది. ఈ స్మార్ట్‌ఫోన్ గురించి తెలిసిన పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి..

ఐక్యూ Z10R లాంచ్ టైమ్‌లైన్ :
ఈ లీక్‌లను పరిశీలిస్తే.. కచ్చితమైన లాంచ్ తేదీని వెల్లడించకుండానే ఐక్యూ ఫోన్ త్వరలో లాంచ్ అవుతుందని సూచిస్తున్నాయి. ఈ నెల చివర్లో లేదా ఆగస్టు ప్రారంభంలో ఐక్యూ Z10R లాంచ్ కావచ్చు.

Read Also : Nothing Phone 2a Plus : అమెజాన్ సేల్ ఈరోజే లాస్ట్.. నథింగ్ ఫోన్ 2 ప్లస్‌పై బిగ్ డిస్కౌంట్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి..!

ఐక్యూ Z10R స్పెసిఫికేషన్లు (అంచనా) :
నివేదికల ప్రకారం.. ఐక్యూ Z10R అనేది వివో T4R రీబ్రాండెడ్ వెర్షన్. అదే నిజమైతే, ఈ ఐక్యూ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.77-అంగుళాల ఫుల్-HD+ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉండొచ్చు. మీడియాటెక్ డైమన్షిటీ 7400 చిప్‌సెట్ నుంచి పవర్ పొందవచ్చు. 12GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో రావచ్చు.

ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. ఈ ఐక్యూ మోడల్ 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో రావచ్చు. 32MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఉండవచ్చు. కేవలం ముందస్తు లీక్‌లు మాత్రమే. రాబోయే ఫోన్ ధర, ఫీచర్ల వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందే..

భారత్‌లో ఐక్యూ Z10R ధర (అంచనా) :
నివేదికల ప్రకారం.. ఈ ఐక్యూ ఫోన్ ధర రూ. 15వేల నుంచి రూ. 20వేల మధ్య ఉండవచ్చు. అయితే, కచ్చితమైన ధర ఇంకా రివీల్ చేయలేదు. బ్లూ కలర్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇతర కలర్ ఆప్షన్లలో కూడా రావచ్చు.