iQOO Z11 Series : ఐక్యూ లవర్స్ కోసం కొత్త సిరీస్ వస్తోంది.. ఈ నెల 6నే గ్లోబల్ లాంచ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ఫుల్ డిటెయిల్స్!
iQOO Z11 Series : ఐక్యూ జెడ్ 11 సిరీస్ వచ్చేస్తోంది. మే 6న ప్రపంచ మార్కెట్లో లాంచ్ కానుంది. ఫీచర్లు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి.. పూర్తి వివరాల కోసం ఓసారి లుక్కేయండి.
- Sreehari A
- Published on- May 3, 2026 / 03:34 PM IST
iQOO Z11 Global Variant
- ఈ ఫోన్‌లో 12GB వరకు ర్యామ్ ఉంటుంది
- 4nm ప్రాసెసింగ్, స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 చిప్‌సెట్
- ఐక్యూ Z11x సిల్వర్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది
iQOO Z11 Series : కొత్త ఐక్యూ ఫోన్ కొంటున్నారా? ఐక్యూ బ్రాండ్ నుంచి ఐక్యూ Z11 సిరీస్ గ్లోబల్ లాంచ్ కు రెడీగా ఉంది. కంపెనీ మిడ్-రేంజ్ ఫోన్ మలేషియా మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. లాంచ్‌కు ముందే తేదీ కూడా ఖరారు అయింది.
ఆసక్తికరంగా, ఈ ఫోన్ గీక్‌బెంచ్ బెంచ్‌మార్క్ లిస్టులో కనిపించింది. చైనీస్ వేరియంట్ కన్నా భిన్నమైన చిప్‌సెట్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో 12GB వరకు ర్యామ్ ఉంటుంది. అనేక ఇతర ఫీచర్లు కూడా రివీల్ అయ్యాయి. పూర్తి వివరాలతో పరిశీలిద్దాం..
మే 6న మలేషియాలో ఐక్యూ జెడ్ 11 లాంచ్ :
ఐక్యూ Z11 గ్లోబల్ లాంచ్ మే 6వ తేదీకి ఖరారైంది. మలేషియాలో ఈ ఫోన్ లాంచ్ కూడా మే 6వ తేదీకే షెడ్యూల్ అయింది. ఈ ఫోన్ రెండు ఐక్యూ జెడ్11, ఐక్యూ Z11ఎక్స్ మోడళ్లు లాంచ్ కానున్నాయి.
Read Also : SmartPhone Lock : పవర్ బటన్ పాడైందా? ఈ చిన్న సెట్టింగ్ చాలు.. జస్ట్ టచ్‌తోనే మీ ఫోన్ లాక్ చేయొచ్చు..
గతంలో I2512 అనే మోడల్ నంబర్‌తో గీక్‌బెంచ్ లిస్టులో కనిపించింది. ఈ ఫోన్ 4nm ప్రాసెసింగ్‌పై స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 చిప్‌సెట్‌తో వస్తుంది. చైనీస్ వేరియంట్ మీడియాటెక్ డైమెన్సిటీ 8500 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది.
ఈ ఫోన్ బెంచ్‌మార్క్ స్కోర్‌లలో సింగిల్-కోర్ టెస్ట్ స్కోర్ 1,214 పాయింట్లు, మల్టీ-కోర్ సీపీయూ టెస్ట్ స్కోర్ 3,091 పాయింట్లు ఉన్నాయి. ఈ ఫోన్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో లిస్ట్ అయింది. బ్లూ, బ్లాక్ అనే రెండు కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ కోసం 8GB+256GB, 12GB+256GB స్టోరేజ్ ఆప్షన్‌లతో సహా రెండు కాన్ఫిగరేషన్‌లు ఉన్నాయి. ఈ ఫోన్‌లో పిల్ ఆకారంలో ఉండే కెమెరా ఐలాండ్ ఉంటుందని అంచనా.
ఐక్యూ Z11x సిల్వర్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ ఫోన్ 8GB+128GB, 8GB+256GB స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో రెక్టాంగులర్ కెమెరా మాడ్యూల్ ఉంది. ఈ రెండు ఫోన్‌లు అధికారిక వెబ్‌సైట్‌లో లిస్ట్ అయ్యాయి. పూర్తి స్పెసిఫికేషన్‌లు ఇంకా వెల్లడి కాలేదు. అయితే, కంపెనీ మిడ్-రేంజ్ ఫోన్‌లు లాంచ్ ముందే ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. చైనీస్ వేరియంట్ మార్చిలోనే లాంచ్ అయింది.
