SmartPhone Lock : పవర్ బటన్ పాడైందా? ఈ చిన్న సెట్టింగ్ చాలు.. జస్ట్ టచ్‌తోనే మీ ఫోన్ లాక్ చేయొచ్చు..
SmartPhone Lock : పవర్ బటన్ లేకుండా స్మార్ట్‌ఫోన్‌ను లాక్ చేయడం ఎలాగో తెలుసా? మీ ఫోన్ లాక్ చేసేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. పవర్ బటన్ లేకుండా స్మార్ట్‌గా లాక్ చేయవచ్చు లేదా స్క్రీన్ ఆఫ్ చేయవచ్చు. మీ ఫోన్ సెట్టింగ్‌లలో ఇలా చేస్తే సరిపోతుంది.
SmartPhone Lock
- స్మార్ట్‌ఫోన్ లాక్ చేసేందుకు పవర్ బటన్ అవసరం లేదు
- లాక్ లేదా అన్‌లాక్ చేసేందుకు సింపుల్ ట్రిక్స్ ట్రై చేయండి
- స్క్రీన్ ఆన్‌లో ఉంటే ఫోన్ ఆటోమేటిక్‌గా అన్‌లాక్ అవ్వదు
SmartPhone Lock : మీ స్మార్ట్‌ఫోన్ భద్రమేనా? ప్రస్తుత రోజుల్లో ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో బ్యాంకింగ్ యాప్‌లు, యూపీఐ పేమెంట్ యాప్‌లు, పర్సనల్ ఫోటోలు వంటి అనేక విషయాలు ఉంటాయి. ఈ కారణంగా సమాచారం తప్పుడు చేతుల్లోకి వెళ్లకుండా ఉండాలంటే ఫోన్ లాక్ చేయాలి. మీ ఫోన్లో ఇలాంటి ఫీచర్లు చాలానే ఉన్నాయి.
కానీ, చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. మీరు కూడా కేవలం పవర్ బటన్ ద్వారా మాత్రమే ఫోన్ లాక్ చేస్తుంటే ఇది మీకోసమే.. పవర్ బటన్‌తో పాటు మీరు స్క్రీన్‌పై రెండుసార్లు ట్యాప్ చేయడం ద్వారా లేదా హోమ్ బటన్‌ను టచ్ చేయడం ద్వారా కూడా ఫోన్ లాక్ చేయవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
ఫోన్ లాక్ చేసేందుకు మార్గాలివే :
మీ స్మార్ట్‌ఫోన్ లాక్ లేదా అన్‌లాక్ చేసేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. మీరు పవర్ బటన్‌ను ట్యాప్ చేయకుండా కూడా స్క్రీన్ లాక్ చేయవచ్చు లేదా ఆఫ్ చేయవచ్చు. ఇలా చేసేందుకు మీరు సెట్టింగ్స్‌లో రెండు ఆప్షన్లను ఎనేబుల్ చేయాలి.
రెండుసార్లు ట్యాప్ చేస్తే చాలు :
స్క్రీన్‌పై రెండుసార్లు ట్యాప్ చేస్తే మీ ఫోన్ స్క్రీన్ ఆఫ్ చేయవచ్చు లేదా లాక్ చేయవచ్చు. మీ సెట్టింగ్స్‌లో చిన్న మార్పు చేయండి. ఇందుకోసం మీ ఫోన్ సెట్టింగ్స్‌కు వెళ్లండి. ఆ తర్వాత అడ్వాన్స్డ్ ఫీచర్‌కి వెళ్లండి. మోషన్, గెశ్చర్స్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
Read Also : Apple Car Key : టాటా ఈవీ కార్ల ఫ్యూచర్ ఇదే.. ఐఫోన్, ఆపిల్ వాచ్‌తోనే కారు ఓపెన్, స్టార్ట్ అన్నీ ఆటోమేటిక్!
ఆ తర్వాత కనిపించే టోగుల్‌పై క్లిక్ చేయడం ద్వారా స్క్రీన్ ఆన్ చేయొచ్చు. స్క్రీన్‌ను ఆఫ్ చేసేందుకు డబుల్ ట్యాప్ ఆన్ చేయాలి. ఆ తర్వాత ఫోన్‌ను లాక్ చేసేందుకు స్క్రీన్‌ను రెండుసార్లు ట్యాప్ చేయండి. ఫోన్‌కు అన్‌లాక్ కోడ్ లేదా ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంటే.. స్క్రీన్ ఆన్‌లో ఉన్నప్పుడు ఫోన్ ఆటోమేటిక్‌గా అన్‌లాక్ అవ్వదు.
సెకండ్ మెథడ్ :
- మీరు యాక్సెసిబిలిటీ సెక్షన్‌కు వెళ్లాలి.
- ఆపై ఇంటరాక్షన్, డెక్స్టెరిటీ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- ఆ తర్వాత అసిస్టెంట్ మెనూకి వెళ్లండి.
- ఆన్ బటన్ పక్కన టోగుల్‌పై క్లిక్ చేయండి.
- రైట్ సైడ్ హోమ్ అసిస్టెంట్ మెనూ కనిపిస్తుంది.
- దానిపై క్లిక్ చేయండి.
- స్క్రీన్ ఆఫ్‌పై ట్యాప్ చేయగానే ఫోన్ లాక్ అవుతుంది.
శాంసంగ్ ఫోన్లో మాత్రమే ఈ సెట్టింగ్స్ ట్రై చేశాం. మీ స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఓసారి చెక్ చేసుకోండి. ఈ రెండు మెథడ్స్ అన్ని శాంసంగ్ స్మార్ట్ఫోన్లలో వర్కౌట్ కాకపోవచ్చు.
