Apple Car Key : టాటా ఈవీ కార్ల ఫ్యూచర్ ఇదే.. ఐఫోన్, ఆపిల్ వాచ్‌తోనే కారు ఓపెన్, స్టార్ట్ అన్నీ ఆటోమేటిక్!
Apple Car Key Feature : మీ చేతిలో కారు కీ లేకున్నా ఐఫోన్ లేదా ఆపిల్ వాచ్ ఉంటే చాలు.. మీ టాటా ఈవీ కారును డిజిటల్ కీతో ఆపరేట్ చేయొచ్చు.. అది ఎలాగంటే?
Apple Car Key Feature
- ఆపిల్ కారు కీ ఫీచర్ బెనిఫిట్స్ ఏంటి?
- టాటా ఈవీ కారును ఆటో అన్ లాక్, స్టార్ చేయొచ్చు
- ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది? ఏయే డివైజ్‌లకు సపోర్టు..
Apple Car Key Feature : కారు కీ కోసం జేబులు తడుముకునే రోజులు ఇక ఉండవు.. కారు డ్రైవింగ్ ఫ్యూచర్ మారబోతుంది. కొత్త డిజికల్ కీ టెక్నాలజీ రాబోతుంది. ప్రత్యేకించి టాటా ఎలక్ట్రిక్ కార్ల కోసం ఆపిల్ కారు కీ ఫీచర్ వస్తోంది. టాటా మోటార్స్ ఆపిల్ కలిసి ఈ ‘కార్ కీ’ టెక్నాలజీని ప్రవేశపెడుతున్నాయి.
ఇక టాటా కారు డ్రైవ్ చేయాలంటే చేతిలో ఐఫోన్ లేదా ఆపిల్ వాచ్ ఉంటే చాలు.. కారు దగ్గరకు అడుగు పెట్టగానే డోర్స్ ఆటోమేటిక్‌గా ఓపెన్ (Apple Car Key) అయిపోతాయి. ఒక ట్యాప్ తో ఇంజిన్ ఆన్ అవుతుంది. రోడ్డుపై రైడ్ స్టార్ట్ అవుతుంది. ఇకపై టాటా కార్లకు కీ అవసరం ఉండదు. ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది? ఏ డివైజ్ సపోర్టు చేస్తాయో వివరంగా తెలుసుకుందాం..
మీ దగ్గర టాటా ఎలక్ట్రిక్ కారు (EV), ఆపిల్ ఐఫోన్ ఉంటే మీకు కీ అవసరం ఉండదు. మీ ఐఫోనే మీ టాటా ఈవీకి కీగా పనిచేస్తుంది. నివేదిక ప్రకారం.. ఆపిల్ ‘కార్ కీ’ ఫీచర్‌కు టాటా ఈవీలకు కూడా సపోర్టు విస్తరించేందుకు రెడీ అవుతోంది. ఆపిల్ బ్యాకెండ్ డేటా ప్రకారం.. ఈ ఫీచర్ ఉండే వాహనాల ఇంటర్నల్ లిస్టులో టాటా ఈవీలు ఇప్పుడు చేరాయి. అయితే, ఏయే టాటా మోడళ్లకు ఈ సపోర్టు లభిస్తుందనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.
ఆపిల్ ‘కార్ కీ’ ఫీచర్ ఏంటి? :
ఆపిల్ 2022లో ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. వినియోగదారులు తమ ఐఫోన్ లేదా ఆపిల్ వాచ్ ద్వారా తమ కారును లాక్ చేయడం లేదా అన్‌లాక్ చేయడం ఆపై స్టార్ట్ చేయొచ్చు. ఇక ఫిజికల్ కారు కీ అవసరం ఉండదు.
Read Also : Vodafone Idea : Vi బంపర్ ఆఫర్.. జస్ట్ రూ. 99 ప్లాన్‌తో నాన్‌స్టాప్ డేటా.. యూజర్లకు ఫుల్ జోష్!
ఈ ఫీచర్ కారు NFC రీడర్ లేదా అల్ట్రా-వైడ్‌బ్యాండ్ టెక్నాలజీతో రన్ అవుతుంది. టాటా ఈవీ, బీఎండబ్ల్యూ, కియా, హ్యుందాయ్, మెర్సిడెస్, వోల్వోలతో సహా 13 కార్ బ్రాండ్లకు డిజిటల్ కీ సపోర్ట్ లభిస్తుందని ఆపిల్ గతంలోనే ప్రకటించింది.
ఆపిల్ కార్ కీ ఫీచర్లు :
ఆపిల్ వాలెట్ యాప్ ద్వారా ఈ ఫీచర్ రన్ అవుతుంది. మీ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ పూర్తిగా మార్చేస్తుంది. మీ కారులో సరికొత్త అల్ట్రా-వైడ్‌బ్యాండ్ టెక్నాలజీ ఉంటే.. కారును అన్‌లాక్ చేసేందుకు మీ ఫోన్‌ను జేబులోంచి బయటకు తీయాల్సిన అవసరం ఉండదు. మీరు దగ్గరకు రాగానే కారు ఆటోమేటిక్‌గా అన్‌లాక్ అవుతుంది. తద్వారా లోపలికి వెళ్లి కారును స్టార్ట్ చేసుకోవచ్చు.
‘ఎక్స్‌ప్రెస్ మోడ్’ ఈ ప్రాసెస్ మరింత ఈజీ చేస్తుంది. తద్వారా మీ ఫోన్ అన్‌లాక్ చేయకుండా లేదా ఫేస్ ఐడీ/టచ్ ఐడీ అవసరం లేకుండానే కారులోకి ఎంట్రీ అవ్వొచ్చు. అంతేకాదు.. మీ కారు డిజిటల్ కీని ఎయిర్‌డ్రాప్ లేదా ఏదైనా మెసేజింగ్ యాప్ ద్వారా స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయొచ్చు. తద్వారా అవసరమైనప్పుడు వారు కూడా కారులోకి ఎంట్రీ అవ్వొచ్చు.
ఏ డివైజ్‌లలో సపోర్టు చేస్తుంది? :
ఆపిల్ నుంచి వచ్చిన ఈ స్పెషల్ ఫీచర్ అన్ని పాత డివైజ్‌లలో అందుబాటులో ఉండదు. ఈ ఫీచర్ బెనిఫిట్ పొందాలంటే కనీసం ఐఫోన్ 11 లేదా ఆ తర్వాత వచ్చిన మోడల్ లేదా ఏదైనా లేటెస్ట్ మోడల్ అవసరం.
మీరు ఆపిల్ వాచ్ వాడుతుంటే ఈ ఫీచర్ సిరీస్ 6 లేదా ఆపై వచ్చిన మోడళ్లలో మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అప్డేట్ హార్డ్‌వేర్ డివైజ్ యూజర్లు మాత్రమే టాటా కార్లను డిజిటల్ కీతో కంట్రోల్ చేయగలరు.
ఆపిల్ నాయకత్వంలో భారీ మార్పు
ఆపిల్ నాయకత్వంలో అతిపెద్ద మార్పు జరగనుంది. ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ పదవి నుంచి వైదొలుగుతున్నారని ఆ సంస్థ అధికారికంగా ధృవీకరించింది. ఇప్పుడు ఆపిల్ హార్డ్‌వేర్ ఇంజనీరింగ్ చీఫ్ అయిన జాన్ టర్నర్ బాధ్యతలు తీసుకోనున్నారు.
