iQOO Z11 Lite : స్టూడెంట్స్ కోసం ఐక్యూ Z11 లైట్ వచ్చేస్తోంది.. బ్యాటరీ బీస్ట్, AI స్మార్ట్ ఫీచర్లు, ఊహించిన ధర ఇదే!
iQOO Z11 Lite : ఐక్యూ జెడ్ సిరీస్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనుంది. వివో సబ్-బ్రాండ్ ఆ కొత్త ఫోన్ భారత మార్కెట్లో ఐక్యూ జెడ్11 లైట్ వెర్షన్ రాబోతోందని కంపెనీ ధృవీకరించింది.
- Sreehari A
- Published on- July 9, 2026 / 05:49 PM IST
iQOO Z11 Lite
- భారత మార్కెట్లో కొత్త ఐక్యూ జెడ్11 లైట్ రాబోతుంది
- లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీక్
- ఈ హ్యాండ్‌సెట్ ధర సుమారు రూ. 15వేలుగా ఉంటుందని అంచనా
iQOO Z11 Lite : ఐక్యూ లవర్స్ మీకోసమే.. ఐక్యూ జెడ్ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఐక్యూ జెడ్11 ఇప్పుడు భారత మార్కెట్లో ఐక్యూ జెడ్11 లైట్‌గా రాబోతోందని కంపెనీ వెల్లడించింది. ఈ ఫోన్ కోసం స్పెషల్ మైక్రోసైట్ రివీల్ చేసింది. ఐక్యూ ఫోన్ డిజైన్‌కు సంబంధించి చిన్న గ్లింప్స్ కూడా టీజ్ చేసింది.
టీజర్ ప్రకారం.. ఐక్యూ జెడ్11 లైట్ బ్యాక్ సైడ్ పిల్-షేప్ కెమెరా మాడ్యూల్‌లో డ్యూయల్ కెమెరా (iQOO Z11 Lite) సెటప్ ఉండొచ్చు. ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని ఫీచర్లు, స్పెసిఫికేషన్లు కూడా ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. నివేదికల ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6000 సిరీస్ చిప్‌సెట్‌తో రావచ్చు.
త్వరలో ఐక్యూ జెడ్11 లైట్ లాంచ్ :
ఐక్యూ ఇండియా సీఈఓ నిపున్ మరియా ప్రకారం.. ఐక్యూ జెడ్11 లైట్ త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కానుంది. కంపెనీ టీజర్ పోస్టర్ రాబోయే హ్యాండ్‌సెట్ డిజైన్ రివీల్ చేసింది. దీని ప్రకారం, ఐక్యూ జెడ్11 లైట్ ఫ్లాట్ రియర్ ప్యానెల్‌తో వస్తుంది. అదనంగా, ఫోన్ బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్ క్యాప్సల్ షేప్ కెమెరా మాడ్యూల్ కనిపిస్తుంది. ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, సింగిల్ ఎల్ఈడీ ఫ్లాష్ రింగ్ లైట్ కూడా ఉన్నాయి.
ఈ ఫోన్ ఆఫ్-వైట్ కలర్ ఆప్షన్లలో కనిపిస్తుంది. పవర్ బటన్, వాల్యూమ్ కంట్రోల్స్ రైట్ సైడ్ ఉంటాయి. అయితే, ఐక్యూ బ్రాండింగ్ రియర్ ప్యానెల్ బాటమ్ సెంటర్ కనిపిస్తుంది. ఫోన్ లెఫ్ట్ సైడ్ ఎలాంటి బటన్లు ఉండకపోవచ్చు.
అదనంగా, ఐక్యూ జెడ్11 లైట్ కోసం స్పెషల్ మైక్రోసైట్ కూడా అమెజాన్ ఇండియాలో కనిపిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా భారత మార్కెట్లో అమ్మకానికి రానుందని తెలుస్తోంది. మైక్రోసైట్ ప్రకారం.. ఐక్యూ జెడ్11 లైట్ వివో ఆరిజిన్ ఓఎస్‌తో వస్తుంది. ఏఐ-ఆధారిత ఫీచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి.
నివేదిక ప్రకారం.. :
ఐక్యూ జెడ్11 లైట్ ఫోన్‌లో యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్‌తో ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఉండవచ్చు. ఈ ఫోన్‌లో 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు భారీ 6500mAh బ్యాటరీ కూడా ఉంటుందని అంచనా. కెమెరా విషయానికి వస్తే.. ఇందులో 50ఎంపీ ప్రైమరీ రియర్ కెమెరా ఉండొచ్చు.
రిపోర్టుల ప్రకారం.. ఐక్యూ జెడ్11 లైట్ ఫోన్ 1,200 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్ 6.74-అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ టచ్‌స్క్రీన్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఫ్రంట్ సైడ్ వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్ కూడా ఉంటుందని అంచనా. ఇందులో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5ఎంపీ కెమెరా అమర్చవచ్చు. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP65 రేటింగ్‌తో వస్తుందని అంచనా. భారత మార్కెట్లో ఈ హ్యాండ్‌సెట్ ధర సుమారు రూ. 15వేలుగా ఉంటుందని అంచనా.
