iQOO Z11 Lite Launch : AI ఫీచర్లతో కొత్త ఐక్యూ Z11 లైట్ వచ్చేస్తోంది.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంత ఉండొచ్చంటే?

iQOO Z11 Lite Launch : ఐక్యూ నుంచి సరికొత్త ఫోన్ వస్తోంది. ఐక్యూ జెడ్11 లైట్ ఫోన్ ఏఐ ఫీచర్లతో రాబోతుంది. ఈ ఫోన్ రూ. 20వేల లోపు ధరలో అందుబాటులోకి ఉండనుంది.

iQOO Z11 Lite Launch

  • ఐక్యూ జెడ్11 లైట్ 6500mAh బ్యాటరీతో వస్తుంది
  • సోలార్ ఫ్లేమ్, మిడ్‌నైట్ బ్లూ 2 ప్రీమియం కలర్ ఆప్షన్లు
  • SGS 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్‌ కూడా ఉండనుంది
  • ఈ నెల 24న భారత మార్కెట్లో లాంచ్ కానుంది

iQOO Z11 Lite Launch : ఐక్యూ లవర్స్ కోసం అద్భుతమైన ఫోన్ వచ్చేసింది. ఐక్యూ నుంచి Z11 లైట్ కొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది. ఈ నెల 24వ తేదీన భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ బ్రాండ్ ఈ ఫోన్‌ను ప్రత్యేకంగా కాలేజీ స్టూడెంట్స్ కోసం రూపొందించింది.

ఈ ఫోన్ ఆన్‌లైన్ లెక్చర్‌లకు హాజరుకావడం, అసైన్‌మెంట్‌లు, నోట్స్ కోసం ఏఐని వాడొచ్చు. ఇంకా మరెన్నో టాస్కులను (iQOO Z11 Lite Launch) కూడా కంప్లీట్ చేయొచ్చు. మల్టీటాస్కింగ్ కోసం అద్భుతమైన డిస్‌ప్లేతో అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది.

ఈ కంపెనీ ఐక్యూ లైట్ ఫోన్‌లో ఏఐ ఆధారిత ప్రొడక్టివిటీ ఫీచర్లను కూడా అందిస్తుంది. 1200-నిట్ బ్రైట్‌నెస్ డిస్‌ప్లేతో వచ్చే ఈ కొత్త ఫోన్ చాలా కంపర్ట్ ఉంటుంది. మిలిటరీ-గ్రేడ్ సర్టిఫికేషన్ కూడా ఉంటుంది ఈ ఫోన్ ధర రూ. 20వేలు లోపు ఉంటుంది. ఐక్యూ జెడ్11 లైట్ ఫోన్ ఆకర్షణీయమైన ఫీచర్లను కూడా అందిస్తుంది.

ఐక్యూ జెడ్11 లైట్ జూలై 24న లాంచ్ :
జూలై 24న భారత మార్కెట్లో ఐక్యూ జెడ్11 లైట్ లాంచ్ కానుంది. ఈ ఫోన్ సేల్స్ ఐక్యూ అధికారిక వెబ్‌సైట్, అమెజాన్ ఈ-కామర్స్ సైట్‌లో ప్రారంభమవుతాయి. ఐక్యూ జెడ్11 లైట్ సోలార్ ఫ్లేమ్ మిడ్‌నైట్ బ్లూ అనే 2 ప్రీమియం కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Read Also : Realme C100x Phone : కొత్త రియల్‌మి ఫోన్ అదుర్స్.. 8,000mAh బ్యాటరీ 120Hz డిస్‌ప్లే కేక.. ధర జస్ట్ రూ. 15,000 లోపే..!

ఐక్యూ జెడ్11 లైట్ ఫీచర్లు :
ఐక్యూ జెడ్11 లైట్ ఫోన్ అనేది లెర్నింగ్, క్రియేటివిటీ, కమ్యూనికేట్ కోసం పవర్‌ఫుల్ ఏఐ ఫీచర్లతో వస్తుంది. ఇందులో ఏఐ క్రియేషన్ ఫీచర్ కూడా ఉంది. విద్యార్థులకు భారీ డాక్యుమెంట్‌లను క్రియేట్ చేయడం లేదా అసైన్‌మెంట్‌లను ఎడిట్ చేయడం, కంటెంట్‌ జనరేట్ చేయడం, టెక్స్ట్‌ను ట్రాన్సులేట్ చేయడం, కొత్త ఐడియాలను జనరేట్ చేయడం, రైటర్స్ బ్లాక్‌ను ఈజీగా యాక్సస్ చేయొచ్చు.

ఇందులో ఏఐ క్యాప్షన్ ఫీచర్ కూడా ఉంది. రియల్-టైమ్ ట్రాన్స్‌క్రిప్షన్, ఇన్ స్టంట్ ట్రాన్సులేషన్, సింగిల్ ట్యాప్‌తో సమ్మరీలను అందిస్తుంది. విద్యార్థులకు లెక్చర్‌లు, వర్క్‌షాప్‌లు, చర్చల నుంచి నోట్స్, చూడటం, షేర్ చేయొచ్చు.

ఐక్యూ జెడ్11 లైట్ ఫీచర్లు :
ఐక్యూ జెడ్11 లైట్ ఫోన్ 44W ఫ్లాష్‌ఛార్జ్‌కి సపోర్ట్ చేసే 6500mAh బ్యాటరీతో వస్తుంది. 5 ఏళ్ల బ్యాటరీ లైఫ్‌తో రీడింగ్ టైంలో లాంగ్ టైమ్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ప్రయాణాల కోసం అకస్మాత్తుగా కిందపడటం లేదా వర్షం నుంచి ప్రొటెక్షన్ కోసం ఐక్యూ జెడ్11 లైట్ రోజువారీ క్యాంపస్ లైఫ్ అవసరాలకు బెటర్. ఈ ఫోన్ అడ్వాన్స్ డిజైన్ మరింతగా ఆకట్టుకుంటుంది.

అలాగే, మినిమలిస్ట్, కాంపాక్ట్ కెమెరా మాడ్యూల్ కాల్స్, నోటిఫికేషన్‌లకు డైనమిక్ లైట్లతో స్టైలిష్‌గా ఉంటుంది. మిలిటరీ-గ్రేడ్ మన్నికతో SGS 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్‌ అందిస్తుంది. ప్రమాదవశాత్తు ఈ ఫోన్ కిందపడినా కూడా కొంచెం కూడా డ్యామేజ్ అవ్వదు.