iQOO Z7 5G launched in India, limited period price starts at Rs 17499
iQOO Z7 5G Launch : భారత మార్కెట్లోకి ఐక్యూ (iQOO) నుంచి సరికొత్త ఫోన్ (iQOO Z7 5G) వచ్చేసింది. కంపెనీ బ్రాండ్ నుంచి సరికొత్త మిడ్-రేంజ్ ఆఫర్ ఫోన్ ఇదే. 44W ఫాస్ట్ ఛార్జింగ్, MediaTek డైమెన్సిటీ 920 ప్రాసెసర్, 90Hz రిఫ్రెష్ రేట్, AMOLED ప్యానెల్, 64-MP ప్రైమరీ కెమెరా, మరెన్నో ఫీచర్లను కలిగి ఉంది. మార్చి 21న మధ్యాహ్నం 1 గంటలకు ఈ స్మార్ట్‌ఫోన్ మొదటిసారిగా అందుబాటులోకి వచ్చింది.
ఐక్యూ Z7 5G ధర ఎంతంటే? :
ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ. 17,499తో ప్రారంభమైంది. ఈ ఫోన్‌పై ఇతర వేరియంట్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా, iQOO Z7 5G రెండు వేరియంట్లలో వస్తుంది. బేస్ మోడల్‌లో 6GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. దీని ధర రూ. 18999గా ఉండగా.. 8GB RAM, 128GB స్టోరేజ్‌తో ఉన్న ఫోన్ టాప్-ఎండ్ మోడల్ ధర రూ. 19,999తో వస్తుంది.
ఐక్యూ Z7 5G లాంచ్ ధర, తగ్గింపు ఆఫర్లు :
లాంచ్ ఆఫర్‌లో భాగంగా.. స్మార్ట్‌ఫోన్ తయారీదారు బ్యాంక్ కార్డ్‌లపై తగ్గింపును అందిస్తోంది. HDFC, SBI కార్డ్ హోల్డర్లకు రూ. 1500 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. అయితే, లిమిటెడ్ ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీరు iQOO స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలంటే.. ఇదే బెస్ట్ టైమ్ అని చెప్పవచ్చు. తగ్గింపు తర్వాత, 6GB మోడల్ రూ. 17499కి అందుబాటులో ఉంటుంది. అయితే, 8GB RAM మోడల్ రూ. 18499కి అందుబాటులో ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ అమెజాన్ ఇండియా (Amazon India) స్టోర్‌తో పాటు iQOO సొంత వెబ్‌సైట్‌లో సేల్ అందుబాటులో ఉంది.
iQOO Z7 5G launched in India, limited period price
iQOO Z7 5G స్పెసిఫికేషన్స్ :
స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. స్మార్ట్‌ఫోన్ 6.28-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో 90hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. iQOO Z7 5G ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్‌తో పాటు గరిష్టంగా 8GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13-ఆధారిత FunTouchOS 13 స్కిన్ అవుట్ ఆఫ్ ది బాక్స్‌తో రన్ అవుతుంది. కెమెరా స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. iQOO Z7 5G 2-MP సెకండరీ కెమెరాతో పాటు OIS సపోర్టుతో 64-MP ప్రైమరీ కెమెరాతో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది.
ఈ ఫోన్ ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 16-MP కెమెరాను కలిగి ఉంది. ఐక్యూ Z7 5G ఫోన్ USB టైప్-C పోర్ట్ ద్వారా 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 4500mAh బ్యాటరీతో వచ్చింది. డిజైన్ పరంగా, iQOO Z7 5G డ్యూయల్ టోన్ డిజైన్‌తో అద్భుతంగా పనిచేస్తుంది. భారత మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్ పసిఫిక్ నైట్, నార్వే బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది.