iQoo Z9 5G Launch : భారత్‌కు ఐక్యూ Z9 5జీ ఫోన్ వచ్చేసింది.. ఫీచర్ల కోసమైన ఈ ఫోన్ కొనేసుకోవచ్చు!

iQoo Z9 5G Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? అయితే, భారతీయ యూజర్ల కోసం అద్భుతమైన ఫీచర్లతో ఐక్యూ జెడ్9 5జీ ఫోన్ వచ్చేసింది. ధర, ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.

iQoo Z9 5G With MediaTek Dimensity 7200 5G SoC, 5,000mAh Battery

iQoo Z9 5G Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి వివో సబ్ బ్రాండ్ ఐక్యూ నుంచి సరికొత్త 5జీ ఫోన్ వచ్చేసింది. అదే.. ఐక్యూ జెడ్9 5జీ మోడల్. ఈ కొత్త ఫోన్ మంగళవారం (మార్చి 12) దేశ మార్కెట్లో లాంచ్ అయింది. లేటెస్ట్ ఈ ఐక్యూ Z సిరీస్ స్మార్ట్‌ఫోన్ రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది.

మీడియాటెక్ డైమెన్సిటీ 7200 5జీ ఎస్ఓసీ ద్వారా పవర్ అందిస్తుంది. ఐక్యూ జెడ్9 5జీ ఫోన్ 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 50ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. 44డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. 5జీ ఫోన్‌కు ఐపీ54 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్ కూడా ఉంది.

Read Also : iPhone 16 Pro Leak : కొత్త డిజైన్‌, క్యాప్చర్ బటన్‌‌తో ఆపిల్ ఐఫోన్ 16 ప్రో వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

భారత్‌లో ఐక్యూ జెడ్9 5జీ ధర :
ఐక్యూ జెడ్9 5జీ 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ మోడల్ ప్రారంభ ధర 19,999, 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వెర్షన్ ధర రూ. 21,999గా నిర్ణయించింది. బ్రష్డ్ గ్రీన్, గ్రాఫేన్ బ్లూ కలర్ ఆప్షన్లలో అందిస్తోంది. ఈ ఐక్యూ ఫస్ట్ సేల్ మార్చి 13 మధ్యాహ్నం 12:00 గంటలకు అందుబాటులో ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ వినియోగదారులందరికీ మార్చి 14 నుంచి మధ్యాహ్నం 12:00 గంటలకు అమెజాన్ ఇండియా, ఐక్యూ ఇండియా స్టోర్, ఇతర రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి చేసిన కొనుగోళ్లకు రూ. 2వేలు తగ్గింపు అందిస్తుంది. 128జీబీ, 256జీబీ స్టోరేజ్ వెర్షన్‌ల ధరను వరుసగా రూ. 17,999 రూ. 19,999కు కొనుగోలు చేయొచ్చు.

ఐక్యూ జెడ్9 5జీ స్పెసిఫికేషన్లు :
ఐక్యూ జెడ్9 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఫన్‌టచ్ ఓఎస్14పై రన్ అవుతుంది. 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 394పీపీఐ పిక్సెల్ సాంద్రతతో 6.67-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ (1,080×2,400 పిక్సెల్‌లు) అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. డిస్‌ప్లే 91.90 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 300హెచ్‌జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్‌ను అందిస్తుంది. డీటీ-స్టార్ 2 ప్లస్ గ్లాస్ ప్రొటెక్షన్ అందిస్తుంది.

ఈ కొత్త ఐక్యూ స్మార్ట్‌ఫోన్ 8జీబీ (LPDDR4X) ర్యామ్, ఆర్మ్ మాలి-జీ610 జీపీయూతో పాటు ఆక్టా-కోర్ 4ఎన్ఎమ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 5జీ ఎస్ఓసీ ద్వారా అందిస్తుంది. ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఫీచర్‌తో, ఆన్‌బోర్డ్ మెమరీని 16జీబీ వరకు పెంచుకోవచ్చు. ఐక్యూ జెడ్9 5జీ ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), ఎఫ్/1.79 ఎపర్చర్‌తో 50ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్88 ప్రైమరీ సెన్సార్, ఎఫ్/2.4 ఎపర్చర్‌తో 2ఎంపీ బోకె షూటర్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ 16ఎంపీ సెల్ఫీ సెన్సార్‌ను కలిగి ఉంది.

మరెన్నో ఆకర్షణీయమైన ఫీచర్లు :
ఇంకా, ఐక్యూ జెడ్9 5జీ ఫోన్ 256జీబీ వరకు యూఎఫ్ఎస్3.0 ఇంటర్నల్ స్టోరేజీని అందిస్తుంది. మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా 1టీబీ వరకు విస్తరించవచ్చు. కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, వై-ఫై 6, వై-ఫై డైరెక్ట్, బ్లూటూత్ 5.3, బెయిడూ, జీపీఎస్, (GLONASS, GALILEO), యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. బోర్డ్‌లోని సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఇ-కంపాస్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఐపీ54 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్‌ను కలిగి ఉంది. ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి.

ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 67.78 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ :
ఐక్యూ జెడ్9 5జీ ఫోన్ ఐక్యూ 44డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఎహెచ్ బ్యాటరీని అందించింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. గరిష్టంగా 67.78 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్ టైమ్ అందిస్తుంది. అలాగే, 17 గంటల వరకు యూట్యూబ్ వీడియో ప్లేబ్యాక్ టైమ్ అందిస్తుంది. ఈ ఫోన్‌లోని ఫ్లాష్ ఛార్జింగ్ టెక్నాలజీ కేవలం 31 నిమిషాల్లో బ్యాటరీని 0 నుంచి 50 శాతానికి వేగంగా ఛార్జ్ చేయగలదు. ఈ హ్యాండ్‌సెట్ పాలికార్బోనేట్ బాడీని కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 163.17×75.81×7.83ఎమ్ఎమ్ కొలతలు, 188 గ్రాముల బరువు ఉంటుంది.

Read Also : Aadhaar Free Update Extended : గుడ్ న్యూస్.. ఆధార్ ఫ్రీ అప్‌డేట్‌ గడువు పొడిగింపు.. లాస్ట్ డేట్ ఇదిగో.. ఎలా అప్‌డేట్ చేసుకోవాలంటే?