iQOO Z9s First Sale : ఈ నెల 29 నుంచే ఐక్యూ జెడ్9ఎస్ ఫస్ట్ సేల్.. లాంచ్ ఆఫర్లు, కీలక స్పెషిఫికేషన్లు ఇవే..!

iQOO Z9s First Sale : ఐక్యూ జెడ్9ఎస్ 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 19,999తో వస్తుంది. 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 21,999కు పొందవచ్చు. 12జీబీ+256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 23,999కు పొందవచ్చు.

iQOO Z9s First Sale : ఈ నెల 29 నుంచే ఐక్యూ జెడ్9ఎస్ ఫస్ట్ సేల్.. లాంచ్ ఆఫర్లు, కీలక స్పెషిఫికేషన్లు ఇవే..!

iQOO Z9s first sale in India on August 29_ Price ( Image Source : Google )

iQOO Z9s First Sale : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ఐక్యూ జెడ్9ఎస్ ఫోన్ ఫస్ట్ సేల్ ఆగస్టు 29న ప్రారంభం కానుంది. ఈ ఫోన్ ధర రూ. 17,999కి అందుబాటులో ఉంటుంది. పోకో ఎక్స్6 ప్రో, నథింగ్ ఫోన్ 2ఎ, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ వంటి ప్రముఖ ఫోన్లతో పోటీపడుతుంది. ఐక్యూ జెడ్9ఎస్ స్మార్ట్‌ఫోన్ కీలక స్పెషిఫికేషన్లు, ధర వంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also : iPhone 16 Series Price : ఐఫోన్ 16 సిరీస్ ధర, కీలక ఫీచర్లు లీక్.. అన్ని మోడల్స్‌కు ఆపిల్ ఇంటెలిజెన్స్ సపోర్టు..!

ఐక్యూ జెడ్9ఎస్ భారత్ ధర, సేల్ తేదీ, ఆఫర్‌లు :
ఐక్యూ జెడ్9ఎస్ 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 19,999తో వస్తుంది. 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 21,999కు పొందవచ్చు. 12జీబీ+256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 23,999కు పొందవచ్చు. ఒనిక్స్ గ్రీన్, టైటానియం మ్యాట్ కలర్ వేరియంట్లలో వస్తుంది.

లాంచ్ ఆఫర్‌లలో భాగంగా కొత్త ఐక్యూ ఫోన్ ఆప్షన్ చేసిన బ్యాంక్ కార్డ్‌లతో తక్కువ ధరకు అందుబాటులో ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్‌లపై రూ.2వేల తగ్గింపు పొందవచ్చు. బేస్ మోడల్ ధరను రూ. 17,999కి తగ్గిస్తుంది. అయితే, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 19,999కు పొందవచ్చు.

ఐక్యూ జెడ్9ఎస్ స్పెక్స్, ఫీచర్లు :
ఐక్యూ జెడ్9ఎస్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.77-అంగుళాల 120Hz 3డీ కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లే హెచ్‌డీఆర్10+ సర్టిఫికేషన్, 1800నిట్స్ లోకల్ పీక్ బ్రైట్‌నెస్‌ని కలిగి ఉంది. కొత్త ఐక్యూ ఫోన్ కూడా డస్ట్, వాటర్ రెసిస్టెంట్ కోసం రేట్ చేసిన ఐపీ64 అని కంపెనీ వెల్లడించింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఫన్‌టచ్ ఓఎస్ 14లో రన్ అవుతుంది. ఐక్యూ జెడ్9ఎస్ రెండు ఏళ్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, మూడు ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ లభిస్తాయని కంపెనీ హామీ ఇచ్చింది.

హుడ్ కింద, 44డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,500mAh బ్యాటరీ ఉంది. ఎప్పటిలాగే, బ్రాండ్ రిటైల్ బాక్స్‌లో ఛార్జర్‌ను అందిస్తుంది. ఫోటోగ్రఫీ పరంగా ఐక్యూ జెడ్9ఎస్ డ్యూయల్ కెమెరా బ్యాక్ సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్882 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 2ఎంపీ పోర్ట్రెయిట్ కెమెరా ఉన్నాయి. కొన్ని ఫోటోగ్రఫీ ఫీచర్లు 4కె వీడియో ఓఐఎస్, బ్లర్ ఫొటోలకు ఏఐ ఫొటో ఎన్‌ఆన్సర్, ఫొటోలోని అవాంఛిత వస్తువులను ఏఐ ఎరేస్‌తో రిమూవ్ చేయొచ్చు.

Read Also : Moto G45 5G Sale : కొత్త ఫోన్ కొంటున్నారా? మోటో G45 5జీ సేల్ మొదలైందోచ్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!