Israeli Electric Car Motor Is The Size Of A Smartphone
Israeli Electric Car Motor Size Of A Smartphone : ఈవీఆర్ మోటార్స్ కొత్త ఎలక్ట్రిక్ కారు మోటారును ప్రవేశపెట్టింది. ప్రస్తుతమున్న మోడళ్లలో సగం కంటే తక్కువ పరిమాణంలో ఉంది. చూడటానికి స్మార్ట్ ఫోన్ సైజులో పొడవు ఉంది. EVR మోటారు టోపోలాజీ ఆధారంగా పనిచేసే TSRF లేదా ట్రాపెజోయిడల్ స్టేటర్ రేడియల్ ఫ్లక్స్ గా దీన్ని పిలుస్తారు. RFPM మోటారుల స్థానాన్ని భర్తీచేసే మోటార్ ఎనర్జీతో రూపొందించారు. ఈ మోటార్ కారు ప్రోటోటైప్‌ను అభివృద్ధి చేసింది.
ఈ ఏడాది చివరలో ఎలక్ట్రిక్ మోటార్లను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ కంపెనీ కొత్త మోటార్లు చిన్నవిగానూ చాలా తేలికైనవిగా ఉంటాయి. పర్పార్మెన్స్ తీరు కూడా మెరుగ్గా ఉంటుంది. ద్విచక్ర వాహనాల నుంచి ట్రక్కుల వరకు 100 శాతం బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలు (BEV) హైబ్రిడ్ కార్ల వరకు అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాల్లోనూ పనిచేస్తాయి.
48 వోల్ట్ నుంచి 800 వోల్ట్ల్ వరకు వోల్టేజ్ ఉన్న అవుట్‌లెట్లలో ఛార్జింగ్ చేయవచ్చు. ప్రస్తుత నమూనా 20 పౌండ్ల (9 కిలోగ్రాముల) బరువుతో ఎయిర్ కూలింగ్ మోటారు అమర్చారు. వాణిజ్య వాహనాల కోసం పెద్ద మోటార్లు కూడా డెవలప్ చేస్తున్నామని కంపెనీ తెలిపింది. పెటా టిక్వా కేంద్రంగా EVR మోటార్స్ 2012లో స్థాపించారు.