itel Feature Phone : రూ. 123కే జియో కొత్త ప్లాన్.. ఐటెల్ 4G ఫోన్ యూజర్లకు డబుల్ ఎంజాయ్!
itel Feature Phone : ఐటెల్ 4జీ ఫీచర్ ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై జియో రూ. 123 రీఛార్జ్ ప్లాన్‌ను ఐటెల్ యూజర్లు ఎంజాయ్ చేయొచ్చు. ఈ రీఛార్జ్ ప్లాన్ జియో ఫీచర్ ఫోన్లలో మాత్రమే కాదు ఐటెల్ ఫోన్లకు కూడా వర్తిస్తుంది..
- Sreehari A
- Published on- May 27, 2026 / 12:52 PM IST
itel Feature Phone
- ఐటెల్ 4G ఫీచర్ ఫోన్ యూజర్ల కోసం జియో రూ. 123 ప్లాన్
- 28 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 0.5GB డేటా
- జియో ఫీచర్ ఫోన్లతో పాటు ఐటెల్ ఫోన్ యూజర్లకు అందుబాటులో
itel Feature Phone : కొత్త ఫీచర్ ఫోన్ కొంటున్నారా? మీకోసం అద్భుతమైన ఆఫర్.. ఐటెల్ 4G ఫీచర్ ఫోన్ కొనే యూజర్లకు బంపర్ ఆపర్ అందుబాటులో ఉంది. 4జీ ఫీచర్ ఫోన్ కస్టమర్లు ఇకపై రిలయన్స్ జియో రూ. 123 రీఛార్జ్ ప్లాన్ పొందవచ్చు. ఈ మేరకు ఐటెల్ కంపెనీ ప్రకటించింది.
గతంలో ఈ ప్లాన్ జియో సొంత ఫీచర్ ఫోన్‌లకు మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ, ఇప్పుడు ఐటెల్ 4జీ ఫోన్ (itel Feature Phone) యూజర్లకు కూడా సరసమైన ధరలో రీఛార్జ్ ప్లాన్ లభిస్తోంది. పూర్తి ప్లాన్ వివరాలపై ఓసారి లుక్కేయండి..
జియో రూ. 123 ప్లాన్ యూజర్లకు 28 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 0.5GB డేటా కూడా అందిస్తుంది. మొత్తం 28 రోజులకు 14GB డేటా లభిస్తుంది. కంపెనీ ప్రకారం.. ఈ ప్లాన్ ఫీచర్ ఫోన్ యూజర్లకు ప్రతి ఏటా రూ. 1,000 వరకు ఆదా చేయొచ్చు.
Read Also : Oppo A6c Launch : 7000mAh బ్యాటరీతో కొత్త ఒప్పో A6c ఫోన్ ఆగయా.. ఫీచర్లు అదుర్స్, ధర రూ. 13,999కే..
4జీ ఫీచర్ ఫోన్ రీఛార్జ్ ప్లాన్లు ఇవే :
ఇతర జియో ఫీచర్ ఫోన్ ప్లాన్‌లు ఇప్పుడు 4జీ ఫీచర్ ఫోన్ పోర్ట్‌ఫోలియోలో అందుబాటులో ఉంటాయని ఐటెల్ తెలిపింది. ఇందులో రూ. 234కు 56 రోజుల ప్లాన్, రూ. 369కు 84 రోజుల ప్లాన్ రూ. 1234కు 336 రోజుల ప్లాన్ ఉన్నాయి. ఈ ప్లాన్‌లన్నీ రోజుకు 0.5GB డేటాను అందిస్తాయి.
భారత మార్కెట్లో 1.3 లక్షలకు పైగా రిటైల్ అవుట్‌లెట్లు ఉన్నాయని కంపెనీ చెబుతోంది. అదనంగా, 1,000కి పైగా సర్వీస్ సెంటర్ల నెట్‌వర్క్ కూడా ఉంది. ఐటెల్ ఫీచర్ ఫోన్‌లపై ఏడాది కౌంటర్ రీప్లేస్‌మెంట్‌ను కూడా అందిస్తున్నట్లు పేర్కొంది. ఈ పథకం కింద ఫోన్‌లో తయారీ లోపం ఉన్నట్లు తేలితే యూజర్లు కొనుగోలు చేసిన ఏడాది లోపు రిటైల్ స్టోర్‌లో మార్చుకోవచ్చు.
ఐటెల్ ఈ ఏడాది మే ప్రారంభంలో భారత మార్కెట్లో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఐటెల్ A100 ప్రోను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.6-అంగుళాల 90Hz HD+ డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ, యూనిసోక్ T7100 ప్రాసెసర్ ఉన్నాయి.
కంపెనీ ప్రకారం.. ఐటెల్ A100 ప్రో MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ సర్టిఫికేషన్, అల్ట్రాలింక్ ఫీచర్, ఆండ్రాయిడ్ 15 గో ఎడిషన్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో డీటీఎస్ ఆడియో సపోర్ట్, 8MP రియర్ కెమెరా ఉన్నాయి.
