Oppo A6c Launch : 7000mAh బ్యాటరీతో కొత్త ఒప్పో A6c ఫోన్ ఆగయా.. ఫీచర్లు అదుర్స్, ధర రూ. 13,999కే..
Oppo A6c Launch : ఒప్పో ఇండియా కొత్త ఒప్పో A6c స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 7000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, IP64 రేటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. పూర్తి వివరాలివే..
Oppo A6c Launch
- ఒప్పో A6c ఫోన్ 7000mAh బ్యాటరీతో వస్తుంది
- 120Hz డిస్ప్లే, IP64 రేటింగ్‌తో వస్తుంది
- ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 13,999 మాత్రమే
Oppo A6c Launch : ఒప్పో లవర్స్ పండగ చేస్కోండి. భారత మార్కెట్లోకి కొత్త ఒప్పో A6c వచ్చేసింది. కంపెనీ ఈ కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లో భారీ 7000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, IP64 రేటింగ్ వంటి ఫీచర్లు అద్భుతంగా ఉన్నాయి. ఒప్పో A6c ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తోంది.
ఈ ఫోన్లో యూనిసోక్ ప్రాసెసర్, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 13MP డ్యూయల్ రియర్ కెమెరా (Oppo A6c Launch) సెటప్ ఉన్నాయి. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్, చైనాలో లాంచ్ అయింది. కానీ రెండు వేరియంట్ల స్పెసిఫికేషన్లలో తేడాలు ఉన్నాయి. ప్రస్తుతం గ్లోబల్ వేరియంట్ కూడా భారత మార్కెట్లో లాంచ్ అయింది.
ఒప్పో A6c ఫోన్ ఫీచర్లు, స్పెషిఫికేషన్లు :
ఒప్పో A6c ఫోన్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 13,999 నుంచి ప్రారంభమవుతుంది. 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 16,999కు పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ఒప్పో అధికారిక వెబ్సైట్లో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఫెదర్ వైట్, స్టోన్ బ్రౌన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
ఒప్పో A6c ఫోన్ 720×1570 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.75-అంగుళాల HD+ ఎల్సీడీ డిస్ప్లేతో వస్తుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 900 నిట్స్ వరకు టాప్ బ్రైట్నెస్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌కు IP64 డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ రేటింగ్ అందిస్తుంది. ఈ ఫోన్ బరువు సుమారుగా 215 గ్రాములు, 9mm మందం ఉంటుంది. ఒప్పో A6c ఫోన్ 7000mAh బ్యాటరీతో వస్తుంది. 15W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. :
ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆక్టా-కోర్ యూనిసోక్ T7250 ప్రాసెసర్ అమర్చారు. మాలి-G57 జీపీయూ, 4GB LPDDR4x ర్యామ్, 128GB వరకు స్టోరేజ్ అందిస్తుంది. సేఫ్టీ కోసం ఈ ఫోన్లో పక్కన ఫింగర్‌ప్రింట్ సెన్సార్ అమర్చారు. అలాగే, యాంబియంట్ లైట్ సెన్సార్, యాక్సిలరోమీటర్, ఇ-కంపాస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఒప్పో A6c ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఆటోఫోకస్ సపోర్ట్‌తో 13MP ప్రైమరీ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్లో 5MP ఫ్రంట్ కెమెరా ఉంది. 1080p, 30fps వరకు వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
ఒప్పో A6c ఫోన్ USB టైప్-సీ పోర్ట్‌తో వస్తుంది. కనెక్టివిటీ ఫీచర్లలో 4జీ LTE, వై-ఫై 5, బ్లూటూత్ 5.2, జీపీఎస్, 3.5mm ఆడియో జాక్ ఉన్నాయి.
