itel Power 451 Launch : వారెవ్వా.. స్మార్ట్‌ఫోన్‌ రేంజ్ ఫీచర్లతో కొత్త ఐటెల్ AI ఫీచర్ ఫోన్ వచ్చేసింది.. ధర జస్ట్ రూ. 1,699కే..

itel Power 451 Launch : ఐటెల్ ఇండియా కొత్త పవర్ 451 ఫీచర్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఏఐ-ఎన్‌సీ, టైప్-సీ ఛార్జింగ్, 2500mAh బ్యాటరీ, 32GB స్టోరేజ్, వైర్‌లెస్ ఎఫ్‌ఎం వంటి ఫీచర్లతో వస్తుంది.

itel Power 451 Launch

  • ఏఐ-ఎన్‌సీ ఫీచర్‌తో ఫీచర్ ఫోన్ రూ. 1,699కి లాంచ్
  • 2500mAh బ్యాటరీ, టైప్-C ఛార్జింగ్ సపోర్ట్
  • 32GB స్టోరేజ్, ఒక ఏడాది కౌంటర్ రీప్లేస్‌మెంట్ ఆఫర్

itel Power 451 Launch : కొత్త ఫీచర్ ఫోన్ కొనేవారికి పండగే.. ఏఐ ఫీచర్లతో అద్భుతమైన ఐటెల్ ఫోన్ వచ్చేసింది. భారత మార్కెట్లోకి ఐటెల్ నుంచి సరికొత్త ఫీచర్ ఫోన్ పవర్ 451 లాంచ్ అయింది. కంపెనీ ప్రకారం.. ఈ ఫీచర్ ఫోన్ ఏఐ ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ (AI-ENC)తో వస్తుంది.

కాల్స్ సమయంలో ఈజీగా సౌండ్ డిటెక్ట్ చేయగలదు. ఈ ఫోన్‌లో 2500mAh బ్యాటరీ, టైప్-C ఛార్జింగ్, 2.4-అంగుళాల డిస్‌ప్లే ఉన్నాయి. 32GB వరకు పెంచుకోగల స్టోరేజ్‌కు సపోర్టు ఇస్తుంది. బ్లూటూత్, వైర్‌లెస్ ఎఫ్ఎమ్ కాల్ రికార్డింగ్ వంటి ఫీచర్లను కూడా అందిస్తుంది.

ఐటెల్ పవర్ 451 ఫోన్ ధర రూ. 1,699 మాత్రమే. దేశవ్యాప్తంగా రిటైల్ స్టోర్లలో బ్లూ, గ్రీన్, పర్పల్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ ఫీచర్ ఫోన్‌తో కంపెనీ ఒక ఏడాది కౌంటర్ రీప్లేస్‌మెంట్‌ కూడా అందిస్తోంది. బాక్స్‌లో ఫ్రీగా బ్యాక్ కవర్ కూడా అందిస్తుంది.

Read Also : Vivo X Fold 6 Launch : వివో X ఫోల్డ్ 6 మడతబెట్టే ఫోన్ వచ్చేసిందోచ్.. మైండ్ బ్లోయింగ్ ఫీచర్లు.. ధర ఎంతైనా కొనేస్తారు తెలుసా?

స్పెసిఫికేషన్ల పరంగా పరిశీలిస్తే.. :
ఐటెల్ పవర్ 451లో 2.4-అంగుళాల డిస్‌ప్లే ఉంది. కంపెనీ ప్రకారం.. ఈ కొత్త ఐటెల్ ఫోన్‌లో ఏఐ ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ (AI-ENC) ఫీచర్ ఉంది. కాల్స్ సమయంలో సౌండ్ నాయిస్ తగ్గిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్‌లో టైప్-C ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. ఫీచర్ ఫోన్ సెగ్మెంట్‌లో చాలా అరుదుగా చెప్పొచ్చు.

ఐటెల్ పవర్ 451 ఫోన్ 2500mAh బ్యాటరీతో రన్ అవుతుంది. సూపర్ బ్యాటరీ మోడ్‌తో 55 రోజుల వరకు స్టాండ్‌బై టైమ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్ బ్లూటూత్ కనెక్టివిటీ, వైర్‌లెస్ ఎఫ్ఎమ్ రేడియో, ఎఫ్ఎమ్ రికార్డింగ్, కాల్ రికార్డింగ్ 60 కాల్ లాగ్‌లకు కూడా సపోర్టు ఇస్తుంది. ఇందులో వీజీఏ కెమెరా కూడా ఉంది.

ఈ ఫోన్ 32GB వరకు మైక్రో SD కార్డ్ స్టోరేజ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇందులో కింగ్ వాయిస్ ఫీచర్‌తో 10 భారతీయ భాషలు ఉన్నాయి. లాంగ్ బ్యాటరీ లైఫ్, ఈజీ కాలింగ్ ప్రైమరీ ఫీచర్లతో ఈ ఫీచర్ ఫోన్‌ అందుబాటులోకి వచ్చింది.