Jeep Meridian X special Edition Launched ( Image Credit : Google )
Jeep Meridian X special Edition : ప్రముఖ జీప్ ఇండియా స్పెషల్ ఎడిషన్ మెరిడియన్ ఎక్స్ జీప్ విడుదల చేసింది. కాస్మెటిక్ అప్‌గ్రేడ్‌లతో వస్తుంది. స్టాండర్డ్ మెరిడియన్ ఎస్‌యూవీతో పోల్చితే.. అదనపు కిట్‌ను కలిగి ఉంది. ఎక్స్‌టీరియర్ మెర్డియన్ ఎక్స్ బాడీ-కలర్ లోయర్స్, గ్రే రూఫ్, గ్రే యాక్సెంట్‌లతో కొద్దిగా భిన్నమైన అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది.
Read Also : WWDC 2024 Event : ఈ నెల 10 నుంచి WWDC 2024 ఈవెంట్.. ఆపిల్ అన్ని డివైజ్‌ల్లోకి కొత్త పాస్‌వర్డ్ మేనేజర్!
లోపలి భాగంలో మెర్డియన్ ఎక్స్ సైడ్ మౌల్డింగ్, పుడ్ల్ ల్యాంప్స్, ప్రీమియం మ్యాట్స్, ప్రోగ్రామబుల్ యాంబియంట్ లైటింగ్, సన్‌షేడ్‌లతో పాటు ఎయిర్ ప్యూరిఫైయర్, డాష్ క్యామ్ ఆప్షన్ బ్యాక్ సీటు ఎంటర్‌టైన్మెంట్ ప్యాకేజీ వంటి అదనపు డివైజ్‌లను పొందుతుంది. ఈ యాడ్-ఆన్స్ కాకుండా మెకానికల్ నుంచి మెర్డియన్ ఎక్స్ మాదిరిగానే ఉంటుంది.
టాప్ స్పీడ్ 198 కిలోమీటర్లు :
జీప్ మెరిడియన్ ఎస్‌యూవీ 2.0-లీటర్, 4-సిలిండర్, టర్బో-డీజిల్ మోటారుతో 168బీహెచ్‌పీ, 350ఎన్ఎమ్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 9-స్పీడ్ ఆటోమేటిక్ లేదా 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో ఇస్తుంది. జీప్ గంటకు 0 నుంచి 100కిలోమీటర్ల స్ప్రింట్ సమయాన్ని 10.8 సెకన్లు అందిస్తుంది.
అయితే, గరిష్ట స్పీడ్ గంటకు 198 కిలోమీటర్లు అందిస్తుంది. ధరల పరంగా చూస్తే.. మెర్డియన్ ఎక్స్ సంబంధిత వేరియంట్‌ల కన్నా రూ. 50వేలు ఎక్కువగా ఉంది. లిమిటెడ్, లిమిటెడ్ (O), ఓవర్‌ల్యాండ్. మెరిడియన్ శ్రేణి రూ. 29.49 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచిప్రారంభమైతే, మెర్డియన్ ఎక్స్ రేంజ్ రూ. 29.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.