Jio Long-term Plan : రిలయన్స్ జియో నుంచి కొత్త ప్రీపెయిడ్ ప్లాన్.. రోజూ 3GB డేటా.. ఏడాదంతా ఎంజాయ్ చేయొచ్చు!

ప్రముఖ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో కొత్త లాంగ్-టెర్మ్ ప్రీపెయిడ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. తమ యూజర్లను ఆకట్టుకునేందుకు ఈ దీర్ఘకాలిక ప్లాన్‌ అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా లాంగ్ టెర్మ్ బెనిఫెట్స్ పొందవచ్చు.

Jio Long-term Plan : ప్రముఖ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో కొత్త లాంగ్-టెర్మ్ ప్రీపెయిడ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. తమ యూజర్లను ఆకట్టుకునేందుకు ఈ దీర్ఘకాలిక ప్లాన్‌ అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా లాంగ్ టెర్మ్ బెనిఫెట్స్ పొందవచ్చు. రోజూ 3GB వరకు 4G డేటాను ఏడాదంతా ఎంజాయ్ చేయొచ్చు. అదే. జియో రూ 3,499 ప్రీపెయిడ్ ప్లాన్.. ఈ కొత్త జియో ప్రీపెయిడ్ ప్లాన్ యూజర్లకు రోజూ 3GB, 4G డేటాను అందిస్తుంది. మొత్తం ఏడాది వరకు 1,095GB డేటా పొందవచ్చు. డేటా ముందుగానే అధిగమించినట్టుయితే 64Kbps స్పీడ్ ఇంటర్నెట్‌ను పొందవచ్చు. అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100SMS కూడా పొందవచ్చు. ఈ లాంగ్ టెర్మ్ యానువల్ ప్లాన్ రూ .3,499తో రీచార్జ్ చేసుకుంటే 365 రోజుల వరకు వ్యాలిడిటీ అందిస్తుంది.

అంతేకాదు.. అదనంగా మరిన్ని బెనిఫిట్స్ పొందవచ్చు.. JioTV, JioCinema, JioNews, JioSecurity, JioCloudతో సహా Jio యాప్‌లకు ఈ ప్లాన్ ఫ్రీగా యాక్సస్ చేసుకోవచ్చు. రూ.3,499 ప్లాన్ ఇప్పుడు జియో సైట్, యాప్‌లో పొందవచ్చు. జియోలో ఇప్పటికే రూ.2,399, రూ.2,599 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్లు ఉన్నాయి. ఈ రెండూ రోజుకు 2GB డేటా, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు పొందవచ్చు. అలాగే Jio యాప్‌లకు కూడా యాక్సస్ చేసుకోవచ్చు. కానీ, ఇందులో తేడా ఏంటంటే?. రూ .2,599 ప్లాన్‌లో అదనంగా 10GB డేటా, ఏడాదికి డిస్నీ+ హాట్‌స్టార్ VIP (రూ. 399 విలువ)కు ఫ్రీ సబ్ స్ర్కిప్షన్ పొందవచ్చు.

జియో అందించే మరో ప్రీపెయిడ్ రూ .2,397 ప్లాన్ కూడా ఉంది. మొత్తం 365GB డేటా వరకు పొందవచ్చు. అలాగే అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలతో పాటు Jio యాప్‌లకు యాక్సస్ చేసుకోవచ్చు. జియో ఇతర ప్రీపెయిడ్ ప్లాన్లలో రోజువారీ డేటా వినియోగంలో ఎలాంటి లిమిట్ లేదు.. అందులో ఐదు ప్లాన్లు ఉన్నాయి.. రూ .127 ప్యాక్, రూ .247 ప్లాన్, రూ .447 ప్లాన్, రూ .597 ప్లాన్, రూ .2,397 ప్లాన్. ఈ ప్లాన్లన్నీ జియో వెబ్‌సైట్‌లో, అలాగే MyJio యాప్‌లో అందుబాటులో ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు