Jio Free AirFiber
Jio Free AirFiber : జియో యూజర్లకు గుడ్ న్యూస్.. ఐపీఎల్ 2025 టోర్నీకి సమయం దగ్గరపడుతోంది. మీరు (JioHotstar) సబ్‌స్క్రిప్షన్ పొందాలని ప్లాన్ చేస్తున్నారా? మీకు కొత్త జియోఫైబర్ కనెక్షన్ కావాలా? రిలయన్స్ జియో మొబైల్ ప్రీపెయిడ్ యూజర్ల కోసం కొత్త ఆఫర్ ప్రకటించింది.
మీరు ఇప్పుడు లిమిటెడ్ టైమ్ వరకు సబ్‌స్క్రిప్షన్, ట్రయల్ రెండింటినీ ఫ్రీగా పొందవచ్చు. ఈ ఆఫర్ కింద జియో రూ. 299 లేదా అంతకంటే ఎక్కువ కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ పొందే యూజర్లకు జియోఎయిర్‌ఫైబర్ 50 రోజుల ఫ్రీ ట్రయల్‌తో పాటు 90 రోజుల ఫ్రీ జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది.
ఈ కొత్త ఆఫర్ ఇప్పటికే కలిగిన యూజర్లు లేదా కొత్త జియో సిమ్ కస్టమర్లకు అందుబాటులో ఉంది. రీఛార్జ్ తర్వాత ఈ ఆఫర్ జియో యూజర్లకు రాబోయే ఐపీఎల్ 2025తో సహా క్రికెట్ మ్యాచ్‌లను, అలాగే మొబైల్ ఫోన్లు, టీవీలలో 4Kలో సినిమాలు, షోలు, ఇతర కంటెంట్‌ను యాక్సస్ చేయొచ్చునని జియో అధికారిక ప్రకటనలో పేర్కొంది.
జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ బెనిఫిట్స్ :
90 రోజుల ఫ్రీ జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ :
జియో యూజర్లు టీవీ లేదా మొబైల్ ఫోన్లలో 4K క్వాలిటీతో క్రికెట్ మ్యాచ్‌లను వీక్షించవచ్చు. ఫ్రీ జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభంతో 22 మార్చి 2025న యాక్టివేట్ అవుతుంది. ఈ ప్లాన్ 90 రోజుల పాటు వ్యాలిడిటీతో వస్తుంది.
జియోఎయిర్‌ఫైబర్ ట్రయల్ :
ఈ ఆఫర్ కింద జియో యూజర్లు జియోఫైబర్ లేదా జియో ఎయిర్‌ఫైబర్ ద్వారా బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్‌ను పొందడానికి ఫ్రీ ట్రయల్‌ను అందిస్తోంది. ఈ కనెక్షన్‌లో ఫాస్ట్ ఇంటర్నెట్ కనెక్టివిటీ, 800 కన్నా ఎక్కువ టీవీ ఛానెల్‌లకు యాక్సెస్ పొందవచ్చు. 11కు పైగా ఓటీటీ యాప్‌లు, అన్‌లిమిటెడ్ వైఫై ఉంటాయి. ముఖ్యంగా, ఆసక్తి ఉన్న యూజర్లు మార్చి 17 నుంచి మార్చి 31, 2025 వరకు ఫ్రీ జియోఫైబర్ లేదా జియో ఎయిర్‌ఫైబర్ సర్వీసును పొందే ఆఫర్‌ను పొందవచ్చు.
జియో ఆఫర్‌ను ఎలా పొందాలంటే? :
జియో కస్టమర్లు రూ. 299 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్‌తో రీఛార్జ్ చేయడం ద్వారా అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. రూ. 299 ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 1.5జీబీ రోజువారీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్, జియోటీవీ, జియోక్లౌడ్ వంటి యాప్‌లకు యాక్సెస్ అందిస్తాయి. అదే సమయంలో, కొత్త జియో యూజర్లు అధిక ధర గల ప్లాన్‌తో జియో సిమ్‌ను కొనుగోలు చేసి ఆఫర్‌ను పొందవచ్చు.
జియో యూజర్లు ఇప్పటికే యాక్టివ్ మొబైల్ రీఛార్జ్ ప్లాన్ కలిగి ఉన్నప్పటికీ కూడా ఫ్రీ జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. ఈ ప్లాన్ కోసం రూ. 100 యాడ్-ఆన్ ప్యాక్ కొనుగోలు చేయాలి. ఈ డేటా యాడ్-ఆన్ ప్యాక్‌ను రీఛార్జ్ ప్లాన్‌తో మాత్రమే తీసుకోవచ్చు. వినియోగదారుల యాడ్-ఆన్ మొబైల్, టీవీ రెండింటిలోనూ 90 రోజుల యాక్సెస్‌తో 90 రోజుల జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది.
జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ కోరుకునే జియో యూజర్లకు ఈ డేటా ప్లాన్ బెస్ట్ ఆప్షన్. ముఖ్యంగా, జియో హాట్‌స్టార్ స్టాండ్‌ఎలోన్ మొబైల్ ప్లాన్ రూ. 149 ధరతో యూజర్లకు స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా ఓటీటీ కంటెంట్‌ను యాక్సెస్ చేయొచ్చు. ఈ సూపర్ ప్లాన్ రూ. 299 ధరతో రీఛార్జ్ చేయొచ్చు.